మెయిన్ ఫీచర్

శిఖరారోహణకు దారి... సదాశయమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరిలోనైనా ఆలోచనలు ఉండడం సహజం. కాకపోతే ఆ ఆలోచనలకు రూపం ఇస్తే అందరూ శభాష్ అంటారు. మంచి ఆలోచనలకే సుమా. సాధికారత సాధించామనే మహిళలూ రోజుకు 24 గంటలున్నా 42 పనులు ఇంటా బయటా చేస్తున్నారు. ఇంకా ఏమి ఆలోచనలో ఏమో.. అనేవాళ్లూ ఉన్నారు. కాని అవసరమే అవకాశాన్ని కలిగిస్తుంది. ఆ అవకాశమే అన్నింటా గెలిచే శక్తి నిస్తుంది.
అట్లాంటి అవకాశమే ఈ శివంగి కీ వచ్చింది. ఒకప్పుడు ఈ శివంగి ఎవరూ అని అడిగితే అదిగో ఇల్లిల్లు తిరిగి న్యూస్ పేపర్లు అమ్ముతుంటుంది అని చెప్పేవారు ఆ గ్రామ వాసులు. కాని ఇప్పుడు ఆ శివంగినే ఎవరు అని అడిగితే చాలు నోరునొప్పిపుట్టేదాకా ఆ అమ్మాయి గురించి చెప్తునే ఉంటారు. ఆమెను మెచ్చుకోని వాళ్లు ఎవరూ ఉండరు. అంతటి ఘనకీర్తి సాధించిన ఆ శివంగి గురించి మీరూ తెలుసుకొంటే మీ నోటెంటా అదే వస్తుంది.
ఈ శివంగి నిరుపేద ఇంట్లో పుట్టిన ఆడపిల్ల. అమ్మనాన్న ఇద్దరూ కూలీనాలీ చేస్తే కాని పూట గడవని స్థితి ఆ కుటుంబానిది. తల్లిదండ్రులు పడే కష్టాన్ని చూసింది. తాను ఏదో సాధించి అమ్మనాన్నల కష్టాన్ని దూరం చేయాలనే రోజూ అనుకొనేది. కాని చదువుకోవడానికి కష్టంగా ఉన్న ఈ కాలంలో ఏం సాధించగలను అనుకొనేది. కాని ఆ శివంగికి చదువుపట్ల అమితాసక్తి ఉంది. అందుకే కష్టంలో కష్టం అని ప్రతిరోజు న్యూస్ పేపర్లు, మాగ్‌జైన్స్ ఏజెంటు దగ్గర తీసుకొని ఇల్లిల్లు తిరిగి వేసేది. ఆ వచ్చిన డబ్బులతో తనకు కావలసిన పుస్తకాలు, పెన్స్ కొనుక్కొనే్నది. ఈ పేపర్లు వేయడమే శివంగికి మంచి మార్గం కనిపించింది. చదువుపట్ల ఆసక్తి ఉన్న శివంగి తాను ఇల్లిల్లు తిరిగే పేపర్లు వేస్తూనే పేపరులో ఉన్న వార్తలను చదవడం అలవాటు చేసుకొంది. ఒకరోజు పేపరులో ఒక ప్రకటన చూసింది.
కళ్లు మెరిసాయి. అది ఇంజనీరింగు చదువుకొనేవారికోసమే. కాని ఆ ప్రకటన చదవగానే తాను ఎలాగైనా అందులో చేరాలనుకొంది. తాను అనుకొన్నది సాధించడానికి ఇది మంచి మార్గం అని శివంగి మనసుకు అన్పించింది. కాస్త తొట్రుపడింది. తీరా అక్కడి దాకా వెళ్లితే ఏం జరుగుతుందో ఎవరైనా ఏమైనా అంటారేమో అని భయపడింది. కాని ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు కదా. సాహసం చేసి ఈ నిరుపేద బతుకును గట్టున వేయాలని స్థిర నిశ్చయం చేసుకొంది. అందుకే ముందుకు అడుగువేసింది.
ఆ ఇన్‌స్టిట్యూట్ వెళ్లింది. తన గురించి వారికి వివరించి చెప్పింది. తనకున్న పట్టుదల, తనకున్న అవసరమూ వారికి చెప్పింది. వారు ఆమె తమను కలుసుకున్న తీరుకు ముచ్చట పడ్డారు. ఐఐటీ జేఈఈ అనేది ఆషామాషీ వ్యవహారం కాదమ్మా. ఇది నేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి అన్నారు. నీ వల్ల అవుతుందా అని మరీ మరీ అడిగారు. ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు వారి సందేహాలన్నింటినీ శివంగి తీర్చింది.
ఈ శివంగి ఇచ్చే సమాధానాలను ఆ కోచింగ్ సెంటర్ హెడ్ ఆనంద్ తల్లి గమనించింది.
ఆమె శివంగిలోని పట్టుదలను, సాధించాలన్న తపనను చూసింది. శివంగిని మరిన్ని ప్రశ్నలు వేసి తాను అనుకొన్న జవాబులు శివంగి దగ్గర నుంచి పొందింది. అంతే శివంగికి ఆ కోచింగ్ సెంటర్‌లో ప్రవేశం దొరికింది. ఆ కోచింగ్‌సెంటర్ లో ఉన్నవాళ్లందరికీ తల్లో నాలుకగా వ్యవహరించేది. ముఖ్యంగా ఆనంద్‌వాళ్ల అమ్మకు. ఆమె మంచి స్ఫూర్తినిచ్చేది. ఎలా చదువుకోవాలో మెలుకువలు నేర్పింది. శివంగి ఆత్మవిశ్వాసంతో తను అనుకొన్నది సాధించడానికి శాయశక్తులా కృషి చేసింది. అంతే ఆమెకు ఐటి రూర్కీలో సీటు వచ్చేసింది. ఆరోజు శివంగి కన్నా ఎక్కువగా కోచింగ్ సెంటర్ ఆనంద్ ఎంతో సంతోషపడ్డాడు. వారి తల్లి ఎంతో ఆనందించింది. శివంగి తన పేరు నిలబెట్టుకొంటుంది అని అనుకొంది.
అట్లానే రూర్కీ వెళ్లాల్సిన రోజు వచ్చేసింది. శివంగి ఇంట్లో వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. మమ్ముల్ని వదిలి అక్కడికి వెళ్తే ఎలా ఉంటావో ఏమో అక్కడి పరిస్థితులు ఏమిటో అని బాధ పడ్డారు.
శివంగిది అన్నింటికీ ఒకటే సమాధానం.
మరేంఫర్లేదు. నేను సాధించి మీ ముందుకు వస్తాను అని చెప్పింది. అంతే శివంగి రూర్కీ వెళ్లింది. ఐఐటీ జే ఈఈ పూర్తి చేసింది. మంచి ఉద్యోగం వచ్చింది. ఆమె కష్టం తీరింది. తనుకుటుంబాన్ని పేదరికం నుంచి తప్పించింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనే నానుడికి తాను తార్కాణంగా నిలిచింది.
ఇలాంటి శివంగులెందరూ ఉన్నారో. మట్టిలో మాణిక్యాల్లా ఉన్నవారు మన గ్రామ గ్రామాన ఎందరో ఉన్నారు. వారిని చేరదీసి వారిలో ఉన్న నైపుణ్యాన్ని పదును పెట్టితే చాలు. ఉజ్వలంగా వారు ఎదగడం కాదు ఆ ఊరి వారందరినీ తమ బాటలో పయనించేట్టు చేస్తారు.
(యువర్స్‌స్టోరీ సౌజన్యంతో )