మెయిన్ ఫీచర్

మహిళాలోకానికే ‘మణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైనస్ నలభై డిగ్రీల సెల్సియస్..
చలికి గడ్డకట్టిపోయే ప్రాంతం..
తొంభై నాటికల్ మైళ్ళ వేగంతో వీచేగాలులు..
ఎటుచూసినా చిన్నప్రాణి కూడా కనిపించదు..
అడుగడుగునా ప్రమాదమే..
అనుక్షణం భయం భయమే..
ఒకరోజు కాదు.. రెండు రోజులు కాదు.. 403 రోజులు.. అంటే పదమూడు నెలలపాటు.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో.. విధులు నిర్వహించిన తొలి భారత ఇస్రో మహిళ మంగళమణి. అంటార్కిటికాలో 2013లో మనదేశం ‘్భరతి’ పేరుతో ఓ కేంద్రా న్ని ఏర్పాటుచేసింది. అత్యాధునికంగా ఏర్పాటుచేసిన అయిదు కేంద్రాల్లో మన భారతదేశం ఒకటి. కక్ష్యలో తిరుగుతున్న ఉపగ్రహాల నుంచి వాతావరణ, విపత్తుల సమాచారం చేరవేయడమే దీని ప్రధాన లక్ష్యం. రోజులో పది నుంచి పనె్నండు కక్ష్యల సమాచారాన్ని అంటార్కిటికా స్టేషన్‌నుంచి సేకరించి భారతదేశానికి చేరవేయాలి. యాభై ఆరు సంవత్సరాల వయస్సులో.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో.. పదమూడు నెలలపాటు విజయవంతంగా పనిచేసి భారతదేశానికి తిరిగివచ్చిన మంగళమణి విజయయాత్ర ఆమె మాటల్లోనే..
దక్షిణధ్రువంలో ‘్భరతి’ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది ఇస్రో. ఇరవై మూడుమంది బృందంగా కలిసి అక్కడకు వెళ్ళాం. అందులో నేను ఒక్కదానే్న మహిళను. నేను భారతిలో పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇది నాకు లభించిన గొప్పవరం. దాన్ని నేను ఒక సవాల్‌గా స్వీకరించి నాకిచ్చిన పనిని విజయవంతంగా పూర్తిచేశా.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్.ఆర్.ఎస్.సి)లో ఒక శాటిలైట్ లాంచ్ అయిన తర్వాత దాని జీవితకాలంలో దాని నుంచి వచ్చే సమాచారాన్ని మేము సేకరిస్తాం. ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేసి, అర్హమైన సమాచారాన్ని తరువాత వినియోగదారులకి పంపిస్తాం. మిగతా సెంటర్లన్నీ చేసే పని ఒక ఎత్తయితే.. ఇక్కడ నుంచి సమాచారాన్ని పంపడం ఒక ఎత్తు. ఒకప్పుడు రెండు సంవత్సరాలకు ఒకసారి శాటిలైట్ వెళ్ళేది. కాబట్టి సమాచారం తక్కువ. కానీ ఇప్పుడు రెండు నెలలకు ఒకసారి శాటిలైట్ వెళుతోంది. దాంతో రోజురోజుకీ సమాచారం పెరిగిపోతోంది. దీన్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. అంటార్కిటికాలో ‘్భరతి’ రాకముందు మనం నార్త్‌పోల్‌లోని స్వాల్‌బర్డ్ అనే స్టేషన్ నుండి సమాచారాన్ని తీసుకునేవాళ్ళం. అలాకాకుండా అంటార్కిటికాలో సొంత స్టేషన్ పెట్టుకుంటే సమాచారాన్ని మనమే సేకరించుకోవచ్చు అనుకుని భారతిని ఏర్పాటుచేశారు. అలా వనరుల్ని ఉపయోగించుకోవడానికి, ఈ-గవర్నెన్స్‌కి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. భారతదేశంలో కేవలం భౌగోళిక స్థానాన్ని బట్టి రెండు మూడు కక్ష్యలు మాత్రమే కనిపిస్తాయి. కానీ అంటార్కిటికాలో భౌగోళిక స్థానాన్ని బట్టి దాదాపు 10 నుండి 12 కక్ష్యలు కనిపిస్తాయి. అలా భారతదేశంలో కనిపించకుండా, తీసుకోలేకపోయిన సమాచారాన్ని అంటార్కిటికాలో తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా అత్యవసర మద్దతు కావాలన్నా కూడా అది మన చేతుల్లోనే ఉంటుంది. బయటి దేశాల వాళ్ళు అంటే గ్లోబల్ యూజర్స్‌కి మద్దతు కావాలన్నా ఇవ్వవచ్చు అన్నమాట.
బాల్యం.. చదువు
మేము ఐదుమంది ఆడపిల్లలం. ఒక మగపిల్లవాడు. మా నాన్న మాకు ఎంతో స్వేచ్ఛను ఇచ్చేవాడు. నేను చదువుకునే రోజుల్లో నాసా వాళ్ళను చూసి ప్రేరణ పొందేదాన్ని. పత్రి కల్లో ‘నాసా’ గురించి వ్యాసాలు వస్తే వాటిని కత్తిరించి సేకరించేదాన్ని. అప్పుడప్పుడు ఆ వ్యాసాలను చదివి ఎలాగైనా సైంటిస్టును కావాలనుకునేదాన్ని. నాకు ఇప్పుడు భూమి గురించి కొద్దిగానే తెలుసు.. ఇంకా తెలుసుకోవాలనే తపన, ఆతృత నాలో ఎప్పుడూ ఉండేది. పదోతరగతి తరువాత హైదరాబాద్ పాలిటెక్నిక్‌లో ఎలక్ట్రానిక్స్‌లో చేరాను. అప్పుడు కూడా ఎనభైమంది అబ్బాయిల్లో నేనొక్కదానే్న అమ్మాయిని. అంటే మా నాన్నగారు ఎంతగా మద్దతునిచ్చేవారో చూడండి. అమ్మాయికి ఎలక్ట్రానిక్స్ కోర్సు ఎందుకు? అని ఎప్పుడూ అనలేదు. చాలా స్వేచ్ఛను ఇచ్చేవారు. అమ్మ చాలా సహనంగా ఉండేది. ఎప్పుడూ మమ్మల్ని ప్రోత్సహించేది. చదువులో ఎలా ప్రోత్సహించేవారో.. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా అలానే ప్రోత్సహించేవారు. నాకు చిన్నప్పటినుంచీ సాహసాలంటే చాలా ఇష్టం. అలా పాలిటెక్నిక్ తరువాత బీటెక్.. తరువాత మాస్టర్స్ చేశాను. నాకు పెళ్ళయిన తర్వాత భర్త, అత్తగారింటి మద్దతు కూడా చాలా ఉంది. అందుకే నేను ఇవన్నీ చేయగలిగాను.
ఇస్రోలో అవకాశం
నేను హైదరాబాద్ బాలానగర్‌లో హెచ్.ఎ.ఎల్‌లో పనిచేసేటప్పుడు నాకు షార్/ ఇస్రో నుండి ఇంటర్వ్యూకు ఫోన్ వచ్చింది. అలా నేను ఇంటర్వ్యూలో ఎంపికకావడం.. నా కలను నేను నిజం చేసుకోవడం జరిగింది. ఒకసారి నేను టెలీమెట్రోలో టెలీకమాండింగ్ సపోర్టు ఇస్తూ ఉండేదాన్ని. ఆ సమయంలో ఎస్.ఎల్. వి.3కి ప్రాజెక్ట్ టెస్టింగ్ జరుగుతూ ఉండేది. దానికి అబ్దుల్ కలాంగారు ప్రాజెక్ట్ డైరక్టర్‌గా ఉండేవారు. ఒకప్పుడు ఆయనే నాకు ప్రేరణ. అలాంటిది ఆయన అలా నా కళ్లముందు.. చాలా సంతోషం వేసేది. ఒకానొక సమయంలో ప్రాజెక్ట్ ఫెయిలైనప్పుడు కలాంగారు చాలా ఊరడించేవాడు. ఈ ఓటమిని బలమైన విజయానికి పునాదిగా మార్చుకోమని చెప్పేవారు.. అలా ఆయన నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.
సవాల్‌గా..
ఇస్రో స్పాన్సర్స్ ప్రోగ్రాం, ఎన్.ఆర్. ఐ.సిలో కూడా నేనొక్కద్దానే అమ్మాయిని. అంటార్కిటికాలో ఇరవై మూడు మందిలో కూడా నేనొక్కదానే్న మహిళని అయినా నాకేమీ కొత్తగా అనిపించలేదు. బహుశా.. చిన్నప్పటి నుండి అలవాటు అయినందువల్ల అనుకుంటాను. పనులు కూడా వాళ్ళతో సమానంగానే పూర్తిచేసేదాన్ని. అంటార్కిటికాకు వెళ్ళేముందు బృందం ఎంపిక జరిగింది. ముందుగా వారికి మనం హామీ ఇవ్వాలి. అలాగే మనకు టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉండాలి. మన ఆరోగ్యం బాగుండాలి. సవాళ్ళను ఎదుర్కోవడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. సాహసంగా ఉండాలి. కనీసం ఒక సంవత్సరమైనా సర్వీస్ ఉండాలి. ఇవి వారికి కావాల్సిన లక్షణాలు. ఇవన్నీ పూర్తి అయిన తరువాత ఎంతమంది హామీ ఇస్తున్నారు అనేదాన్ని బట్టి మళ్ళీ ఎంపిక ఉంటుంది. తర్వాత ఎన్.సి.ఎ.ఓ.ఆర్ (నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటికా అండ్ ఓషన్ రీసెర్చ్) వాళ్ళ నోడల్ పాయింట్. వాళ్ళకు మా గురించి తెలిపినప్పుడు వాళ్ళు మొదటగా మెడికల్ చెకప్ చేస్తారు. ఇది ఓ వారం ఉంటుంది. తర్వాత వారం శ్రీనగర్ దగ్గరలోని ఔలీలో ఫిజికల్ ట్రై నింగ్ ఉంటుంది. అక్కడ పర్వతారోహణ ఉంటుంది. మొదట నెమ్మదిగా తర్వాత దూరాన్ని పెంచుతూ కిట్‌తోపాటు పర్వాతారోహణ చేయిస్తారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ బయటపడిపోతాయి. కిట్‌లో మంచుప్రాంతాల్లో ఉపయోగించే వస్తువులు, మెడికల్ కిట్ ఉంటుంది. దీని గురించి మాకు ప్రత్యేక క్లాసులు ఉంటాయి. తరువాత వారం మమ్మల్ని బద్రీనాథ్ తీసుకెళతారు. అక్కడ వాళ్ళిచ్చిన సామాగ్రితో మంచుపర్వతాలు ఎలా ఎక్కాలి, దిగాలి.. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి.. వంటివన్నీ నేర్పుతారు. అసలు మంచులో నడవాలంటేనే భయం వేస్తుంది. అలాంటి భయాలన్నీ ఈ శిక్షణతో దూరమవుతాయి. తరువాత వారం రోజులు ఆఫీసులో శిక్షణ ఉంటుంది. అక్కడున్న కంట్రోల్ సిస్టమ్స్‌పై ఎలా పనిచేయాలి అనేది నేర్పిస్తారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడైనా, ఏ అవసరం అయినా రావచ్చు. కాబట్టి అన్నీ నేర్చుకుని ఏ సవాల్ ఎదురైనా స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండాలి. అలా ముందుగా శిక్షణ తీసుకుని తయారుగా ఉన్నందున ఎటువంటి సవాల్ ఎదురైనా సంసిద్ధంగా ఉండి దూసుకెళ్ళాం. అంటార్కిటికాలో యాభై రోజులపాటు సూర్యోదయం, సూర్యాస్తమయాలు కూడా కనిపించవు. మూడు లేయర్ల జర్కిన్స్ వేసుకున్నా బయట రెండు మూడు గంటల కంటే ఎక్కువ సమయం ఉండలేము. కానీ ఒక్కోసారి తరచుగా ఇన్‌పుట్స్ ఇస్తూ మానిటర్ చేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో కొద్దిసేపు బయట విధులు నిర్వహించి, కాసేపు స్టేషన్లోకెళ్ళి వేడిని పీల్చుకుని మళ్ళీ విధుల్లోకి వచ్చేవాళ్ళం. స్టేషన్లో ఎప్పుడూ 22 డిగ్రీల వాతావరణం ఉంటుంది. అలా మా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాళ్ళం.
ఆహారం
అంటార్కిటికాలో ఎటువంటి ఆహారం దొరకదు. కనీసం అక్కడ చెట్లు కూడా పెరగవు. జంతువులు కూడా వేసవికాలంలో మాత్రమే బయటకు వస్తాయి. కనుచూపుమేర తెల్లగా కనిపిస్తుంది అంతే! ఇంకేమీ కనిపించదు. అందుకని మాకు కావాల్సిన ఆహారం, ఇంధనాలు షిప్‌లో పంపిస్తూండేవాళ్ళు. మాకు వంటవాళ్ళు కూడా ఉండేవారు. ఇక్కడ ఏమి తినేవాళ్ళమో అంటే పప్పు, అన్నం, చపాతి, ధాన్యాలు, ఫో జెన్ చికెన్, రొయ్యలు, కూరగాయలు.. ఇలా అన్నీ తినేవాళ్ళం.
మహిళల గురించి..
పురుషులతో సమానంగా మహిళలు కూడా

అన్నీ చేయగలరు. శారీరకంగా వారి కంటే కొద్దిగా బలహీనంగా ఉంటాం అంతే.. కానీ మహిళ మానసికంగా మగవారికంటే వందరెట్లు శక్తివంతురాలు. జీవితంలో ఏవైనా కష్టాలు ఎదురైనప్పుడు మనం వౌనంగా ఓర్చుకుంటాం. అదే మన శక్తి. మనకు సహనం ఎక్కువ. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం దూసుకెళ్ళాలి. చిన్నప్పటి నుంచి ఆడపిల్ల ఎలా మెలగాలో మన తల్లిదండ్రులు, గురువులు చెబుతూనే ఉంటారు. దాన్ని బట్టి మనకో స్టైల్ ఏర్పడుతుంది. చిన్నప్పటి నుంచీ అన్నీ తెలుసుకుంటూ ఉంటాం కానీ అడుగు ముందుకు వేయడానికి మాత్రం సాహసం చేయం. అవకాశం వచ్చినప్పుడు అనుమానాలను, ఆలోచనలను పక్కనపెట్టి ముందడుగు వేయాలి. అవకాశం అందిపుచ్చుకున్నప్పుడు దాన్ని చేసేందుకు మనం నూరుశాతం శక్తిని ఉపయోగిస్తాం. అప్పుడే మనలోని శక్తి మనకు తెలుస్తుంది. మనలో ఇంత శక్తి ఉందా? అని మనమే ఆశ్చర్యపోతాం.
ఇలా.. చలికి గడ్డకట్టే ప్రా ంతలో.. ఉద్ధృతంగా వీచేగాలుల్లో.. వయసును లెక్కచేయకుండా సాహసోపేతమైన పనిని విజయవంతంగా పూర్తిచేసి మరొక్కసారి యావత్ భారతదేశం గొంతెత్తి మహిళా జయహో! అనేలా చేసిన మంగళమణికి శతకోటి వందనాలు.

-సన్నిధి