మెయిన్ ఫీచర్

అబ్బురపరచే అతివ సాహసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాయువేగంగా.. దూసుకుపోతూ..
ఐదు రోజులు..
నూట ఇరవై తొమ్మిది గంటలు..
కన్యాకుమారి నుంచి లెహ్ వరకు..
విరామం లేదు.. అలుపు రాలేదు.. కానీ భారతదేశంలో దక్షిణం నుంచి ఉత్తరానికి చేరిపోయారు. అదీ విమానంలోనో, స్పోర్ట్స్ కార్లోనో కాదు.. బైక్‌పై.. ఇద్దరమ్మాయిలు ఈ సాహసాయుతమైన యాత్రను విజయవంతంగా పూర్తిచేశారు. ఫలితంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు సంపాదించుకున్నారు. వారే అమృతా కాశీనాథ్, శుబ్రా ఆచార్యలు. మునుపు వీరు దేశం మొత్తం అంటే దాదాపు రెండు లక్షల కిలోమీటర్లు తిరిగారు. ఈ సాహసయాత్ర కోసం వారు ప్రత్యేక శిక్షణను తీసుకున్నారు.
పడి లేచే కెరటంలా అమ్మాయిలను అణిచేకొద్దీ వారు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. మగాళ్ళను మించిపోతున్నారు. సైకిల్ నుంచి విమానందాకా అన్నింటినీ అవలీలగా నడిపేస్తూ మేము ఎందులోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు. నగరాల్లో పద్మవ్యూహాలను తలపించే ట్రాఫిక్‌లోనూ బైకులను రయ్‌మంటూ పోనిచ్చేస్తున్నారు విమెన్ రైడర్స్. బైక్ నడపడం నేర్పించేందుకు ఏర్పాటైన సంస్థ బైకర్ని. కేవలం 15 మంది మహిళలతో మొదలైన ఈ సంస్థలో ఇప్పుడు 700 మంది మహిళలు ఉన్నారు. 2011లో బెంగాల్‌లో ఇద్దరితో మొదలైన సంస్థ పేరు బెంగాల్ లేడీ బైకర్స్. ఇప్పుడు అందులో వందలాది మంది మహిళా బైకర్లు ఉన్నారు. ఇలా ఒకటేమిటి.. ప్రతి రాష్ట్రంలో మహిళా బైకర్ల సంస్థలు వెలుస్తూనే ఉన్నాయి.
ప్రధాని నరేంద మోడీ ప్రవేశపెట్టిన 3బేటీ బచావో.. బేటీ పడావో..2 కార్యక్రమం కోసం నలుగురు మహిళా బైకర్లు కేవలం 39 రోజుల్లో పదివేల కిలోమీటర్లు ప్రయాణం చేసి పది ఆగ్నేయాసియా దేశాలను చుట్టి వచ్చారు. ఇక సీమా భవాని పేరు అందరూ వినే ఉంటారు. భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సీమా భవాని పేరుతో బీఎస్‌ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)కు చెందిన మహిళా బైకర్లు తొలిసారిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్‌పథ్ వేదికగా వీరు చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. సెక్యూరిటీ దళాలకు చెందిన మహిళలు ఇలాంటి ప్రదర్శన చేయడం భారతదేశ చరిత్రలోనే తొలిసారి. మహిళా బైకర్ స్టాంజిన్ గైడెన్స్‌లో బీఎస్‌ఎఫ్ మహిళలు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ అందరినీ అబ్బురపరిచారు. వీరందరూ ముప్ఫై సంవత్సరాల లోపు వారే. బుల్లెట్లపై వీరు చేసిన సాహసోపేతమైన స్టంట్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
మగవారుకూడా నడపడానికి వెనకాడే బుల్లెట్లపై మహిళలు చాలా అవలీలగా మేఘాలలో తేలిపొమ్మన్నది.. అనుకుంటూ సాహసోపేతమైన స్టంట్లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

-సన్నిధి