మెయిన్ ఫీచర్

ఇది తగునా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ రోజులలో నగరాల్లో కానివ్వండి, పట్టణాలలో కానివ్వండి, విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ సమస్య ఒక్క యువతను తప్పించి మిగిలినవారందరికీ భయాందోళనలు కలిగిస్తున్న విషయం అందరూ అంగీకరించేదే!
ఇలా ఎందుకన్నానంటే వారికి భయం గియం లేకుండా వారు బస్సుల్లో ప్రయాణించే పద్ధతి చూసి, అతి గారాబంతో కొందరు తల్లిదండ్రులు ద్విచక్రవాహనాలను నడిపించడానికి వారికిస్తున్న అనుమతిని చూసి ...
నేటి కాలప్రవాహవేగంలో ముందుకు త్వరగా వెళ్లడానికి అందరూ ద్విచక్రవాహనాల వాడకం ఎక్కువ చేయడం తప్పదు అని ఒప్పుకోక తప్పదు. ఒక్కోసారి అనుకోండి మరీ ఈ మధ్య మగ పిల్లలు రోడ్లమీద బైక్‌లు నడుపుతూ చేసే విచిత్ర విన్యాసాలు చూసేవారికి గుండె గుభేలుమనక మానదు! ఇదంతా చూస్తుంటే ఈ కుర్రకారు తల్లిదండ్రులు ఏం చేస్తున్నట్టు.. వాళ్ళకి బుద్ధి చెప్పకుండా అనిపిస్తుంది.
అంతేకాదు ఈమధ్య కొద్దిపాటి సమయం, ఖర్చు మిగులుతాయని రాంగ్ రూట్‌లో వచ్చేవాళ్లు ఎక్కువ అయపోయారు. అదేమంటే యూటర్న్ చాలా దూరం ఉంది అనేస్తున్నారు కానీ వీరిది తప్పే. వీరిని కట్టడి చేయడానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఏ ప్రమాదమో జరిగితే ఎవరికి నష్టం? రక్షక భటులు ఏం చేస్తున్నారు? మొదలైనవి జవాబులేని ప్రశ్నలు... ఈ విధమైన బాధ్యత వహించవలసిన పెద్దల నిర్లక్ష్యంవల్ల నిజంగా రూల్స్ పాటించేవారు కూడా బలైపోయే అవకాశం లేదా..
మగా ఆడ ఇద్దరూ కూడా ఈ రోజులలో బైక్‌లు నడుపుతున్నారు. కానీ ఇద్దరికీ తేడా ఉంది. ఆడపిల్లలు దూకుడుగా నడపడం మనం చాలా అరుదుగా చూస్తాం. మగపిల్లలే సినిమాలు చూసీ, స్నేహితుల ప్రోద్బలంతోనూ, మోటార్ బైక్‌లమీద.. ముగ్గుర్నీ, నలుగుర్నీ ఎక్కించుకుని ప్రయాణం చేయడం, రూల్స్ పాటించకపోవడం లాంటివి చేస్తూంటారు.
అసలు వీళ్ళకు బైక్ నడపటానికి అనుమతి (లైసెన్సు) ఉందా అంటే.. అనుమానమే! ఇందుకంతా మూలకారణం కొంత ఈ రోజులలో వచ్చే సినిమాలైతే, కొంత తల్లిదండ్రుల నిర్లక్ష్య వైఖరి కొంత, యవ్వనం తెచ్చిపెట్టే ఉడుకు రక్తం మరికొంతని చెప్పవచ్చు.
అందుకే రోడ్లమీద జరిగే ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ఉండాలంటే మగపిల్లల తల్లిదండ్రులు మేల్కోవాలి. తమ పిల్లవాడు మేజర్ కాకుండానే, లైసెన్సు లేకుండా తోటి పిల్లలతో కలిసి ఎవరినైనా బైక్ తీసుకుని, తమకు తెలియకుండా బైక్ నడపడం లేదు కదాని అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ గనుక అనుమానం వస్తే వారినీ వారి ఫ్రెండ్స్‌నీ పిలిచి గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేసి అసలు విషయం రాబట్టాలి!
ఎటువంటి పరిస్థితులలోనూ మైనర్ పిల్లలు అడిగితే లైసెన్సు లేకుండా బైక్‌లు నడపటానికి అనుమతి ఇవ్వకూడదు. వారు గనుక ఒత్తిడి చేస్తే అదేం కుదరదని నిష్కర్షగా చెప్పేయాలి. అంతేకాదు ప్రతిరోజూ వారి కదలికలను నిశితంగా గమనిస్తూ ఉండాలి.
సినిమాల్లో హీరోలు చేసినట్లు రోడ్లమీద విన్యాసాలు చేయవద్దనీ, ఆ నటుడికి డూప్ ఉంటాడు సర్కస్ ఫీట్లు చేయడానికి. నిజ జీవితంలో
వాళ్ళలా మీరు కూడా చేయడానికి ప్రయత్నిస్తే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందనీ, లేదా ఏ చేయో కాలో పోయే ప్రమాదం ఉందనీ పదే పదే హెచ్చరించాలి! ఇక మద్యం త్రాగి ఆ మత్తులో బళ్ళు నడిపి ప్రమాదం కొనితెచ్చుకొనే యువకుల సంగతి వేరే చెప్పాలా? సో.. మగ పిల్లల తల్లిదండ్రులూ బహుపరాక్!

-మాధవపెద్ది ఉష