మెయిన్ ఫీచర్

స్ఫూర్తి ప్రదాతలు చర్ల సోదరీమణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్యాగగుణానికి మారుపేరు భారతీయులు. ఇక్కడ పుట్టిన వారికి బాధ్యతను, త్యాగగుణాన్ని వేరొకరు నేర్పించాల్సిన అవసరంలేదన్నది వాస్తవం. దీనిని ఎవరూ నేర్పించరు ఇది పిల్లల విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. మరి పిల్లలు ఏమి నేర్చుకుంటారో ఏమి చేతల్లో చూపిస్తారో వారిష్టం కదా.
*
ఆమె పేరు చర్లమృదుల కుమారి- సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సాహితీ సానువుల శిఖర శ్రేణులను స్పృశించి వృద్ధజన సేవల సెలయేటి వడ్డున సేదతీరుతున్న ఆమె గురించి...
మా కుటుంబం.. కళాప్రపూర్ణ, శతాధిక గ్రంథకర్త, స్వాతంత్య్ర సమరయోధులు, ఆర్ష విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ చర్ల గణపతి శాస్ర్తీ నిత్యాన్నదాత, స్ర్తిజనోద్ధరణవాది, సనాతన బ్రాహ్మణ ధర్మానికి, మానవతా విలువలను జోడించిన, మానవతామూర్తి శ్రీమతి చర్ల సుశీల దంపతుల ఐదుగురు సంతానంలో కనిష్ఠపుత్రిక.
వారి సోదరుడు, డా చర్ల బుద్ధనారాయణశాస్ర్తీ ఎం.ఏ, పిహెచ్‌డి ఆనర్స్ చేసి ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. వారి వదినమ్మ డా.చర్ల కమలా శాస్ర్తీ ఎం.ఎస్‌సి, పిహెచ్‌డి చదివి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫిజికల్ కెమిస్ట్రీలో ప్రొఫెసర్‌గా సేవలు అందించారు. ఇక వారి ప్రధమ సోదరి డా ఆకుండి విమల సంస్కృతంలోను, హిందీలోను ఎం.ఏ చదివి, లిటరేచర్ చేసి అధ్యాపకురాలిగా సేవలను అందించి విశ్రాంత జీవితాన్ని గడుపుచున్నారు. తరువాత వారి ద్వితీయ సోదరి డా వేదుల కమల ఆంగ్లంలోను, హిందీలోను ఎంఏ చదివి ఎం.్ఫల్, పిహెచ్‌డి పట్టాలు పొంది అధ్యాపకురాలిగా సేవలనందించినది. వారి తృతీయ సోదరి అవివాహిత డా చర్ల విదుల కుమారి ఎం.ఏ బిఇడి చదివి హిందీ సాహిత్యంలో ఎంఫిల్ పట్టా పొంది హిందీ అధ్యాపకురాలిగా సేవలనందించినారు.

బాల్యం - విద్యాభ్యాసం
1944 ఫిబ్రవరి 4వ తేదీ శుక్రవారంనాడు చర్లవారి ఇంట 5వ సంతానంగా జన్మించారు. వారి నాన్నగారు సాంప్రదాయ సేద్యంతోపాటు సాహితీ సేద్యంలో కూడా అనుభవజ్ఞులు. స్వాతంత్య్ర సమరయోధులు కావడంతోపాటుగా జన్మతః వచ్చిన సేవా గుణములవల్ల వారి తండ్రిగారివల్ల ఆమెకు చదువు, వ్యవసాయం సేవా కార్యక్రమాలతోపాటు సాహిత్యంలో కూడా చిన్నతనంలోనే మక్కువ ఏర్పడింది కాని అప్పటి సామాజిక కుటుంబ పరిస్థితుల ప్రభావంతో తండ్రి ప్రోత్సాహ లేమితో చదువులోను, వారి ఇతర అభిలాష నందు వారి అన్నగారు డా చర్ల బుద్ధనారాయణశాస్ర్తీ మరియు తల్లి శ్రీమతి చర్ల సుశీల గారి ప్రోత్సాహంతో వారి విద్యాభ్యాసం కొనసాగింది. వారి విద్యా పరంపరలో డిగ్రీ పూర్తికాగానే ఎం.ఏ బిఇడి చదివి హిందీ సాహిత్యంలో డాక్టరేటు పట్ట పొందారు.
వృత్తిగత జీవితం
ఎం.ఏ బిఇడి చదివి హిందీ సాహిత్యంలో డాక్టరేటు పట్టాను పొందిన ఆమె విశాఖపట్నంలోని విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వారి విద్యాపీఠ్ డిగ్రీ కళాశాలలో జూనియర్ అధ్యాపకురాలిగా మరియు డిగ్రీ అధ్యాపకురాలిగా పనిచేస్తూ వైస్ ప్రిన్సిపాల్‌గా రిటైర్డ్ అయ్యారు.
ఉద్యోగ జీవితంలో అధ్యాపకురాలిగానే కాక భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగంలో గైడ్‌గా సేవలనందించి ఎందరో భావి భారత పౌరులైన విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనం చేయడంలో ఎనలేని తృప్తిని పొందారు.
సాహితీ సాంస్కృతిక జీవితం
అధ్యాపకురాలిగా వృత్తి కొనసాగిస్తూనే నాన్నగారినుండి వచ్చిన సాహితీ పరంపరను, అమ్మగారి నుండి వచ్చిన సేవా ధర్మాన్ని కొనసాగించే పరంపరలో సాహిత్య సామాజిక సేవలలో భాగంగా ఆర్ష విజ్ఞాన పరిషత్తుకు కార్యదర్శిగా, శ్రీమతి చర్ల సుశీల వృద్ధాశ్రమానికి కోశాధికారిగా, ఆత్మవిద్యాశ్రమానికి ఉపాధ్యక్షురాలిగా సేవలనందిస్తూ విశాఖ సాహితీ, విశ్రాంతి వృద్దుల సేవా సంస్థ, గాంధీ స్మారక నిధి, వింటెజ్ విశాఖ బాపు భవన్, లయన్స్ క్లబ్, వివిధ స్థాయిలలో సేవలనందిస్తూ, విశాఖ రేడియోలో ప్రసారమయ్యే బంగారు తల్లి, వాత్సల్యం, దేవుడొచ్చాడు వంటి నాటికలకు సంధానకర్తగా వ్యవహరించేవారు. అంతేకాకుండా సామాజిక సేవాంశంతో కర్తవ్యం, స్ర్తి సంక్షేమం ఇతివృత్తంగా భానురేఖ, వృద్ధాప్యపు విలువలతో పదోన్నతి వంటి రచనలు, నవమినాటి చంద్రుడు (ఆధ్యాత్మికం), రాష్ట్రీయ భావనా (దేశభక్తి), శబరి (స్వచ్ఛమైన భక్తి), ఇంకా హిందీలోనే బ్వులా, గోపి కి కామ్నా, దయాల్ స్వామి వంటి హిందీ సంకలనాలు వారి రచనల్లో మచ్చుతునకలు. ప్రొఫెసర్ పిల్లలమఱ్ఱి వేదవతిగారి ‘తమాషా రామాయణానికి’ నేను చేసిన సాహితీ సమీక్ష, ప్రొఫెసర్ బంగారేశ్వర శర్మగారి ‘బంగారు లేడి’ పద్యకావ్యానికి అభిప్రాయం రావడం నా సాహితీ సేవకు గీటురాళ్ళుగా భావిస్తారు.
తెలుగు ఆచార్యులు డా. పులిగడ్డ విజయలక్ష్మిగారి నారాయణ ద్విశతిని హిందీ ఆచార్యులు డారంగయ్య గారి హిందీ అనువాదానికి పురోవాక్కు (ముందుమాట) వ్రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. వీటితోపాటు వృత్తిపరమైన, సాహితీపరమైన శిక్షణ కార్యక్రమాలలో యుజిసి సెమినార్లలో వర్క్‌షాపులనందు పాల్గొనడమే కాక, హిందీ- తెలుగు వైష్ణవ చరిత్ర కావ్య వంటి ప్రోజెక్ట్‌లలో పాల్గొనడంతోపాటు హిందీ తెలుగు తులనాత్మక అధ్యయనం వంటి పరిశోధనా పత్రాలను సమర్పిస్తూ విద్యా, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య సేవా రంగాలలో వారికంటూ ఒక స్థానాన్ని పదిలపరచుకున్నారు.
అనువంశికంగా వచ్చిన ఈ సేవ చతుర్వేదాల్లా నలుగురు ఆడపిల్లల్ని సమాజ సేవకోసం, జ్ఞానజ్యోతిని వెలిగించడానికి అన్నార్తులను ఆదరించడానికి వీరిని తల్లిదండ్రులు ప్రోత్సహించారు. వీరు ఇరువురు (చర్లమృదుల, చర్ల విదులు) సమాజంలోకి ముందడుగు వేసి, అనాధలను అక్కున చేర్చుకుని, అమ్మలాగా కడుపులు తడిమి, వారి జీవిత సమస్యలకు దోవ చూపుతున్నారు. దీనికి ఎంతోమంది మిత్రులు వారిని వెన్ను తట్టి సహాయపడుతున్నారు.
నేటి సభ్య సమాజంలో తల్లిదండ్రులు పిల్లల యొక్క ఎదుగుదలను కాంక్షిస్తున్నారే తప్ప వృద్ధాప్యంలో వారిని చూడాలని ఎవరూ కూడా వారి పిల్లలకు నేర్పించట్లేదు. విద్యావంతులైన ఈ యువతులు ఇద్దరు విద్యాలయాలు స్థాపించాలని నిడదవోలు వచ్చినపుడు పలువురు వృద్ధులు వారి దీన స్థితిని వివరించడంవల్ల వృద్ధాశ్రమాల స్థాపనకు శ్రీకారం చుట్టారు. వృద్ధులకు తమ చేతనైనంతలో సాయం అందిస్తూ ఇతరులను కూడా ఆ దిశలో అడుగులు వేయాలని కోరుకుంటున్నారు.
*

-వాణి