మెయిన్ ఫీచర్

సత్వర న్యాయం అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసిపిల్లలు దేవుళ్ళతో సమానం, బాల వాక్కు బ్రహ్మవాక్కు అని ఆర్యులు నిర్దేశించారు. అలాంటి పిల్లలకు నేడు భద్రత, భవిష్యత్, భరోసా కరువైపోయింది. ముఖ్యంగా బాలికల విషయంలో భద్రత అనేది పూర్తిగా కొరవడిందనే చెప్పాలి. బాలికలపై శారీరక, లైంగిక, మానసిక, భావోద్వేగ సంబంధమైన హింసతోపాటు వేధింపులు పెచ్చరిల్లుతున్నాయి. ఆడపిల్ల కడుపులో పడినప్పటి నుంచీ పెరిగి పెద్దదయ్యే వరకు మానవ మృగోన్మాదుల కిరాతక అత్యాచార చర్యలు ఎక్కువవుతున్నాయి. భారతదేశంలో దాదాపు యాభై మూడు శాతం బాలికలు లైంగిక వేధింపుల బారిన పడి నిస్ససాయులై కుమిలిపోతున్నారు. ఈ సంఘటనలు వారి శారీరక, మానసిక స్థితిపై చాలా ప్ర భావం చూపుతున్నాయి. చాలాకేసుల్లో దగ్గరి బంధువులు, రక్త సంబంధీకులు, ఇరుగుపొరుగు వారే ఈ దారుణాలకు కారణం కావడం గమనార్హం.
డెబ్భై, ఎనబయ్యేళ్ళ వృద్ధులు కూడా పాలుగారే పసి బాలికలపై కనే్నసి వారి తల్లిదండ్రులు జీవనోపాధికోసం బైట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాయమాటలతో తాయిలాల ఆశజూపి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. సత్‌సంబంధాల్ని ఎరవేసి ఇండ్ల పక్కనే ఉన్న మానవమృగాలు అదునుచూసి ఘోర అఘాయిత్యాలకు తలపడ్డం ఒక మానసిక రుగ్మతగా మారిపోయింది.
ఏరకుమీ కసుగాయల, దూరకుమీ బంధుజనుల అంటూ శతకకారుడి సహేతుకమైన నీతివంతమైన పద్యాలు పదాలు వీరు వంట బట్టించుకోకుండా క్షణికావేశాలకు, ఆనందాలకు గురియై వ్యర్థులుగానూ, మానవతకు దూరమై కటకటాలపాలవుతున్నారు. ఏ పరమార్థాన్ని ఆశించి ఈ పైశాచికానందానికి తలపడుతున్నారో వారికే తెలియాలి. ఒకవైపు సామాజిక వివక్షత, మరోవైపు కుటుంబ వ్యవస్థలో నిరాసక్తత కలిసి ఆడ పిల్లల పాలిట అంటకత్తెర వేస్తున్నాయి. జనాభాలో సగం మంది ఆడవారున్నా అడుగడుగునా అభద్రతా, వివక్షత, అబలలనే చిన్నచూపూ వారి మనోస్థైర్యాన్ని కుంగదీస్తున్నాయి. ఇంటా బయటా, బడి, వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాప్‌లు, ప్రయాణించే వాహనాలు.. ఒకచోటేమిటి? ప్రతీచోటా ప్రతి అడుగులో మహిళలు మానసిక వేదనకు గురికావాల్సి వస్తుంది. మనఃశాంతిగా మనకేటి భయం అనే నిబ్బరంతో ముందుకు సాగలేని దుస్థితి నేటి సమాజంలో దాపురించడం విస్మయాన్ని కలిగించే పరిణామం.
నేడు రక్తసంబంధీకులే స్నేహాల నెపంతోముంచి మూలన కూర్చోబెడుతున్నారు. అన్ని విధాలా ఒత్తిళ్లకులోనై ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో నమ్మబలికిన వారే నిట్టనిలువునా ముంచడం నేడు ఆనవాయితీగా మారిపోయింది. ఇంటాబయటా మానసిక చిత్రహింసలు, అపహరణ, మానవ రవాణా, వెట్టిచాకిరీ, మాట వినలేదని దౌర్జన్యాలకు పాల్పడి హత్యలు, యాసిడ్ దాడులు, కిరాతక హింసలతో ఆడవారి ఉసురుపోసుకున్న ఉదంతాలు కోకొల్లలు. జన్మనిచ్చిన తండ్రి కూడా కన్నకూతురి మీదకు ఎగబడడం మానవీయతను ఛిద్రం చేయడం కాకుండా మరేమిటి?!
అత్యాచారాలు, హత్యలు, మహిళా నిర్బంధం లాంటి నేరాల విషయంలో త్వరితగతిన న్యాయ సహాయం అందించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం. కాలాపహరణతో నిందితుడు అపమార్గాలను అనే్వషించి శిక్షనుండి తప్పించుకొనే ప్రమాదం కూడా ఉంది. సత్వర న్యాయమందించేందుకు పోలీసుశాఖ త్వరితగతిన స్పందించాల్సిన అవసరం ఎంతైనావుంది. అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసిన నిందితుల్ని తనా, మనా అనే భావం వీడి పలుకుబడులతో నాయకులు తప్పింపజూచే స్వభావాన్ని పూర్తిగా విడనాడాలి. తప్పిదానికి తగిన శిక్ష అనుభవించడమే న్యాయమనే భావం నేతలలో నాటుకుపోవాలి. సమాజం కూడా చోద్యంలా చూడకుండా స్పందించాల్సిన అవసరం ఎంతైనాఉంది. తమదాకా వస్తే చూసుకుందామని ఉపేక్షిస్తే సామాజిక తప్పిదమవుతుందనే విషయాన్ని ప తి ఒక్కరూ గుర్తిస్తే న్యాయానికి చేరువుగా సమాజం మసిలే వీలుంటుంది.

- దాసరి కృష్ణారెడ్డి