మెయిన్ ఫీచర్

ఆత్మ విశ్వాసానికి ప్రతిరూపం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ప్రాంతంలో చాలామంది మహిళలు రైళ్లలో ప్రత్యేక కంపార్టుమెంట్లు కావాలని కోరుకుంటారు. అందరూ ఇలానే అనుకుంటే జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే మహిళల పరిస్థితి ఏంటి? అందుకే ముందు మహిళల ఆలోచనా విధానం మారాలి. ఇప్పుడిప్పుడే మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇంకా పెరగాల్సి ఉంది. మహిళలు కెరీర్‌లో ఉన్నతిని సాధించాల్సిన అవసరం ఉంది. పోలీస్ కమీషనర్ ఫీల్డ్ ఆఫీసర్‌గా నేను చాలామంది పురుషుల్ని కలవాల్సి వస్తుంది. అలాంటివాటన్నింటికీ సిద్ధపడే కదా నేను ఈ ఉద్యోగంలోకి వచ్చాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తొణక్కుండా నిలబడాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రతీ మహిళ ఓ ఉద్యోగాన్ని ఎంచుకున్నప్పుడు.. ఆమె మనసులోని ప్రభావమే పనితీరులోనూ కనిపిస్తుంది. నేను ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడకు వచ్చా.. అందుకే సేవ తాలూకు ప్రభావమే నా పనితీరులోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇక భయం.. అనేదాన్ని ఈ ఉద్యోగంలోకి వచ్చేముందే వదిలేశాను’’

బతూల్ అసదీ..
ఎన్నో ఏళ్లుగా దాడులతో మారు మోగిపోతున్న పాకిస్తాన్ క్వెట్టాలోని హజారా తెగకు చెందిన ఓ మహిళ..
ఈమె గురించి ఇలా చెబితే అస్సలు సరిపోదు..
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌కు తొలి మహిళా అసిస్టెంట్ కమీషనర్..
ఇలా చెబితే చాలామందికి అర్థమవుతుంది.
ఎన్నో ఏళ్లుగా హజారా తెగకు చెందిన వేలాదిమంది పౌరులు బలూచిస్తాన్‌లో హత్యలకు గురవుతున్నారు. అలాంటి తెగ నుంచి వచ్చిన ఓ మహిళ.. పోలీసు ఉన్నతాధికారిగా మారి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. అలాంటి చోట మహిళలు బయటకు రావడమే అక్కడివారు జీర్ణించుకోలేని విషయం. అలాంటిది ఓ మహిళ నగర శాంతి భద్రతలను కాపాడుతూనే తనను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఈ విషయం ఎందుకు గట్టిగా చెబుతున్నానంటే.. పాకిస్తాన్‌లో బాలికల విద్య గురించి, ఉగ్ర వాద అరాచకాలపై గళమెత్తిన మలాలాపై తీవ్రవాదులు చేసిన దాడి అందరికీ తెలిసిందే..
క్వెట్టాలో ఎప్పుడూ దాడులు.. హింస.. అలాంటి ప్రాంతానికి అసదీ తొలి ఫీల్డ్ అసిస్టెంట్ కమీషనర్.. ఎప్పుడూ ప్రశాంతంగా, అమాయకంగా కనిపించే ఆమెలోని ధైర్యసాహసాలను గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందమైన అసదీ క్వెట్టాలోని షియా హజారా తెగకు చెందిన మహిళ. భారతదేశం, పాకిస్తాన్ విభజనకు ముందే ఆమె పూర్వీకులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలూచిస్తాన్‌కు వలసపోయారు. హజారా తెగను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో వేలాదిమంది చనిపోయారు. స్థానికులతో పోలిస్తే మధ్య ఆసియాకు చెందిన హజారా వాసుల రూపం భిన్నంగా ఉంటుంది. దాంతో ఈ హజారాలను సులువుగా గుర్తించి వారిపై స్థానికులు దాడులు చేస్తుంటారు. ఒకవైపు తమ తెగవారు దాడుల్లో చనిపోతుంటే.. అదే తెగకు చెందిన అసదీ అసిస్టెంట్ కమీషనర్‌గా బాధ్యతలు చేపట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది స్థానికులు.
పాకిస్తాన్‌లోని మహిళలు చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలనుకున్నా చాలా కష్టం. ఎంతో ఇష్టమున్నా కూడా కెరీర్‌లో రాణించాలంటే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తప్పనిసరి.. అది కూడా ఒక్కోసారి సరిపోదు. కానీ అసదీ విషయం వేరు. ఆమెకు చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రుల ప్రోత్సాహం లభించింది. అందుకే చక్కగా చదువుకుంది. వివాహం తర్వాత భర్త కూడా ఆమెకు అండగా నిలిచాడు. ఇంగ్లీషు లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తున్న ఆమెను సివిల్స్‌వైపు మళ్ల్లించింది అసదీ భర్తనే.. ఆమెకు సీఎస్‌ఎస్ పరీక్షల గురించి వివరించి.. ఆ పరీక్షలు రాయమని ప్రోత్సహించింది అసదీ భర్తనే.. అతని సూచనలతోనే అసదీ పరీక్షల్లో అర్హత సాధించి సివిల్స్‌కు ఎంపికయ్యింది.
ఆఫీసులో కూర్చుని పనిచేయడం కంటే బయట తిరిగే పోలీసు ఉద్యోగం చాలా కష్టమైనది, భిన్నమైనది. మగవాళ్లకైతే ఈ ఉద్యోగం సరైనది కానీ మహిళలు ఈ ఉద్యోగం చేయలేరనే అపోహను దూరం చేసింది అసది. మొదటగా అసదీకి పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో పనిచేసే అవకాశం వచ్చింది. కానీ తన తెగవారికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నో కష్టనష్టాలు, ప్రతికూల వాతావరణమున్నా కూడా బలూచిస్తాన్‌నే ఎంపిక చేసుకుంది అసది.
ఫీల్డ్ ఉద్యోగంలో చాలా సవాళ్లుంటాయి. ప్రతిరోజూ కొత్త కొత్త బాధ్యతలు మీద పడుతుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు తనదైన శైలిలో పరిష్కరించాల్సి వస్తూంటుంది. మార్కెట్ ధరలు, కబ్జాల నియంత్రణ, భవన నిర్మాణ అనుమతులు, తనిఖీలతో పాటు నగరంలో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యకలాపాలపై దృష్టి సారించింది ఈ మహిళా కమీషనర్. హజారా తెగకు చెందీ, ఉన్నత స్థానంలో ఉన్న అసదీని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం లేకపోలేదు. అందుకు ఏనాడు ఆమె భయపడలేదు. చుట్టూ వందలమందీ మగాళ్లు ఉన్నా కూడా అసదీ నేర్పుగా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతారు. ఇలాంటి ప్రా ంతంలో ఓ మహిళ మగవారి ముందుకెళ్లడం, చాకచక్యంగా పనిచేసుకుంటూ వెళ్లిపోవడం అక్కడివారికి కొత్తగా అనిపిస్తోంది. నిజంగా చెప్పాలంటే బలూచిస్తాన్ లాంటి ప్రాంతంలో మహిళలకు గౌరవం ఎక్కువ. వారితో ఎక్కువగా వాదించరు. ఆ అంశాన్ని అసదీ తన బలంగా మార్చుకుంది. అలాగని అక్కడి మహిళలు ఎక్కువగా బయటికి రారు.
మహిళల గురించి అసదీ మాట్లాడుతూ ‘‘ఈ ప్రాంతంలో చాలామంది మహిళలు రైళ్లలో ప్రత్యేక కంపార్టుమెంట్లు కావాలని కోరుకుంటారు. అందరూ ఇలానే అనుకుంటే జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే మహిళల పరిస్థితి ఏంటి? అందుకే ముందు మహిళల ఆలోచనా విధానం మారాలి. ఇప్పుడిప్పుడే మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇంకా పెరగాల్సి ఉంది. మహిళలు కెరీర్‌లో ఉన్నతిని సాధించాల్సిన అవసరం ఉంది. పోలీస్ కమీషనర్ ఫీల్డ్ ఆఫీసర్‌గా నేను చాలామంది పురుషుల్ని కలవాల్సి వస్తుంది. అలాంటివాటన్నింటికీ సిద్ధపడే కదా నేను ఈ ఉద్యోగంలోకి వచ్చాను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తొణక్కుండా నిలబడాల్సిన బాధ్యత నాపై ఉంది. ప్రతీ మహిళ ఓ ఉద్యోగాన్ని ఎంచుకున్నప్పుడు.. ఆమె మనసులోని ప్రభావమే పనితీరులోనూ కనిపిస్తుంది. నేను ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడకు వచ్చా.. అందుకే సేవ తాలూకు ప్రభావమే నా పనితీరులోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇక భయం.. అనేదాన్ని ఈ ఉద్యోగంలోకి వచ్చేముందే వదిలేశాను’’ అని ఎంతో నిర్భయంగా చెబుతుంది అసదీ.
ఆ ఆత్మవిశ్వాసం ముందు ఎవరైనా ఏం చేస్తారు.. తలలు వంచడం తప్ప..

-మహేశ్వరి