మెయిన్ ఫీచర్

వేడుకల్లో సొగసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైశాఖమాసం సగభాగం పూర్తవుతోంది. శుభకార్యాల సందడి జోరు అందుకుంది. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు అంటూ ఒకటే హడావుడి. అసలే వేసవికాలం.. ఆపై ప్రత్యేక సందర్భం. నగలు, భారీ వస్త్రాలు ధరించాలంటే చిరాకు.. కానీ ప్రత్యేకంగా, అందంగా తప్పక కనిపించాల్సిన పరిస్థితి. ఏం చేయాలి తప్పదంటూ అందరూ వేసవికాలమైన భారీ వస్త్ర ధారణతో చెమటలు కక్కుతూ, మేకప్ అంతా చెదిరి వింతగా కనిపిస్తుంటారు. అలాకాకుండా సౌకర్యంతోపాటు సొగసుకీ ప్రాధాన్యం ఇస్తూనే ప్రత్యేక సందర్భానికి పోచంపల్లి ఇకత్, మంగళగిరి కాటన్, పొందూరు ఖద్దరు దుస్తులకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలి. ఇవి ఒంటికి చల్లదనం ఇవ్వడంతోపాటు చెమటను కూడా పీల్చేసుకుంటాయి.
* వేడుక ఎటువంటిదైనా చాలామంది కంచిపట్టుకే ఓటు వేస్తారు. ఈ వేసవిలో పట్టును కట్టుకోవడం కష్టం కాబట్టి అంత గ్రా ండ్‌లుక్‌ని ఇచ్చే పొందూరు ఖద్దరు, మంగళగిరి చీరలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ చీరలకు కొద్దిగా పనితనాన్ని చేరిస్తే ఇవి మరింత అందంగా కనిపిస్తాయి. తక్కువ బరువుతో సౌకర్యంగా ఉంటాయి.
* ఇకత్, కలంకారీ, మధుబనీ, టై అండ్ డై వంటి రకాలు ఎలాంటి సందర్భంలోనైనా అందంగా, హుందాగా ఉంటాయి.
* ఇప్పుడు కాటన్ సిల్క్‌లో కొత్తకొత్త రకాలు చాలా వచ్చాయి. వీటిపైకి డిజైన్ చేయించిన జాకెట్టు వేసుకుని
ఆహార్యాన్ని మరింత సొగసుగా తీర్చిదిద్దుకోవచ్చు.
* మల్‌కాటన్, మంగళగిరి చీరలకు బ్లాక్ ప్రింట్ చేయించుకుంటే కొత్తగా, అందంగా కనిపిస్తాయి.
* ఏ రకమైన ఖాదీ చీరలను ఎంచుకున్నా దానికి గ్రాండ్‌గా ఉన్న జాకెట్టును మ్యాచ్ చేసి వేసుకుంటే చీర అందం మరింతగా పెరిగిపోతుంది.
* అలాగే త్రెడ్‌వర్క్, అబ్‌స్ట్రాక్ట్, బాతిక్ ప్రి ంట్లు చాలా అందంగా ఉంటాయి.
* మేకప్ కూడా వస్త్రా లకు తగినట్లుగా లైట్‌గా ఉంటే మంచిది. చెమటలు పట్టినా ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
* పెళ్లిళ్లు కదా అని హెవీ మేకప్ వేసుకుంటే చెమటకి అది నిలవకపోగా ఒకవైపు చెరిగిపోయి, ఒకవైపు కారిపోయి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది.
* నగలు మెడనిండా వేసుకోకుండా దుస్తులకు తగినట్లు మెడకు చిన్నచిన్న వాటిని ఎంచుకుని చెవులకు పెద్ద లోలాకులను పెట్టుకోవడం వల్ల చాలా గ్రాండ్‌గా కనిపిస్తారు. *