మెయిన్ ఫీచర్

దండన సరికాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల పెంపకమనేది ఓ కళ. పెంపకాన్ని అనుసరించే పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం. పిల్లల చిన్న చిన్న తప్పులకు కఠినంగా శిక్షించకుండా ప్రేమ, ఆప్యాయతలతో వారి మనస్సులో మార్పు తీసుకురావచ్చు. ప్రేమతో కూడిన పెంపక విధానాలతోనే వారి భావి జీవిత పునాది ఏర్పడుతుంది పరిశోధకులు గట్టిగా చెబుతున్నారు.
తల్లిదండ్రులు పిల్లలతో ఆడుతూ, పాడుతూ ఉంటే అలాంటి పిల్లలు సమాజ మెప్పును పొందుతారని చెబుతున్నారు పరిశోధకులు. పసిపిల్లలపై ప్రతికూల ప్రవర్తన చూపించినట్లయితే వారు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడేవారిగా మారతారట. ఐదు సంవత్సరాల వయస్సు లోపు ఇలాంటి తత్త్వం ఉంటే వారిలో కచ్చితంగా మార్పు తీసుకురావాలి. అలాగని పిల్లలను దండించి తల్లిదండ్రులు అనుకున్న విధంగా పిల్లలను పెంచాలి అనుకోకూడదు. ముందుగా పిల్లలను అర్థం చేసుకోవాలి. కఠినంగా ఉండే తల్లిదండ్రుల పిల్లలకంటే, మృదుస్వభావం కలిగిన తల్లిదండ్రుల పిల్లలకు చింత, వ్యాకులత, ఆందోళనపరమైన సమస్యలు చాలా తక్కువగా ఉండి, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. తల్లిదండ్రుల పెంపక విధానాల్లో లోపాలు ఉన్నట్లయితే వాటి దుష్పరిణామాలను పిల్లలు అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతీ తల్లిదండ్రులకు పిల్లల పెంపక విధానాల గురించి, వాటి పరిణామాల గురించి తెలుసుకోవాలి.
పెంపకవిధానాలు పరిణామాలు
* విమర్శలతో పెరిగిన బిడ్డ ఎప్పుడూ తనను తాను దోషిగా తలుస్తాడు.
* పరిహాసాలతో పెరిగిన బిడ్డ పిరికివాడిగా తయారవుతాడు.
* కోపతాపాలతో పెరిగిన బిడ్డ గొడవలు చేస్తాడు. ఎప్పుడూ కయ్యాలకు కాలు దువ్వుతూ ఉంటాడు.
* అవమానాలతో పెరిగిన బిడ్డ ఎప్పుడూ అభద్రతా భావానికి లోనవుతూ ఉంటాడు.
* సహనంతో పెరిగిన బిడ్డ క్షమాగుణాన్ని కలిగి ఉంటాడు.
* ప్రోత్సాహంతో పెరిగిన బిడ్డ ఆత్మవిశ్వాసంతో పెరుగుతాడు.
* అభినందనలతో పెరిగిన బిడ్డ ఎదుటివారిని ఎప్పుడూ గౌరవిస్తాడు. మానవత్వం ఎప్పుడూ ఎదుటివారికి విలువనిస్తూ ఉంటాడు.
* తల్లిదండ్రుల రక్షణ తనకెప్పటికీ ఉంటుంది అనుకుంటూ పెరిగిన బిడ్డ జీవితంపై దృఢనమ్మకంతో ఉంటాడు.
* నిష్పక్షపాతంగా పెరిగిన బిడ్డ నీతి, నిజాయితీలతో ఉంటాడు.
* స్నేహంతో పెరిగిన బిడ్డ ఇతరులపట్ల ప్రేమ, ఆప్యాయతలను కలిగి ఉంటాడు.
ప్రతీ తల్లిదండ్రులు పై విధానాలు,
వాటి పరిణామాలను తెలుసుకుని, తమ పెంపకంలోని లోటుపాట్లను సరిదిద్దుకోవడం అవసరమని చెబుతున్నారు పరిశోధకులు.
సూచనలు
పిల్లల వయస్సును బట్టి వారి శారీరక అవసరాలు, ప్రవర్తన, అభిరుచులు మారుతుంటాయి. వాటిని తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోవడం వల్లనే అసలు సమస్యలు మొదలవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల పెరుగుదలను అనుసరించి వారి వయస్సుతో వచ్చిన మార్పులను అర్థం చేసుకుని ప్రవర్తించాలి. కనుక పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు పరిశోధకులు చేసిన సూచనలు ఇలా ఉన్నాయి.
* ముందుగా తల్లిదండ్రులు పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చాలి. అలాగే పిల్లలు వారి పనులు వారే స్వతహాగా చేసుకోవడం అలవాటు చేయాలి.
* తల్లిదండ్రులు పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించాలి. వారు చెప్పింది విని వారి ఆలోచనలను, అంతరంగాన్ని అర్థం చేసుకోవాలి. వారికి తగిన సూచనలను ప్రేమతో చెప్పాలి.
* పిల్లల్లోని సృజనాత్మకతను ప్రోత్సహించాలి.
* పిల్లలందరినీ సమానంగా చూడాలి. పక్షపాత వైఖరి పనికిరాదు.
* ఇతర పిల్లలతో పిల్లలను పోల్చకూడదు. ఇలా పోల్చడం వల్ల వారిలో ఆత్మన్యూనతాభావం పెరిగిపోతుంది.
* పిల్లల్లోని లోపాలను నెమ్మదిగా చెప్పాలి తప్పితే, వాటిని అదేపనిగా ఎత్తిచూపి ఎగతాళి చేయడంగానీ మందలించడం కానీ చేయకూడదు. అలాచేస్తే వారు మొండిగా తయారవుతారు.
* పిల్లలకు స్వేచ్ఛ, క్రమశిక్షణ సరైన పాళ్ళలో ఉండాలి. ఈ విషయంపై తల్లిదండ్రులు ప త్యేక దృష్టిని పెట్టాలి. పిల్లలకు స్వేచ్ఛను ఇస్తూనే వారిపై దృష్ట్టిని నిలపాలి.
* పిల్లలను ఆడనివ్వాలి. ఆడనివ్వకుండా చదువు.. చదువు అని వెంటబడితే చదువుపై వారికి విరక్తి కలుగుతుంది. అంతేకాక ఆటలు పిల్లల శారీరక, మానసిక వఋద్ధికి దోహదపడతాయి.
* పిల్లలపైనే కాకుండా పిల్లల స్నేహితులను కూడా తల్లిదండ్రులు గమనించాలి. వారి స్నేహాన్ని గౌరవించాలి.
* పిల్లల ప్రవర్తనలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆ సమస్యను సహృదయంతో అర్థం చేసుకుని దానికి నివారణోపాయాన్ని ఆలోచించాలి. ఏది చేసినా పిల్లలపె ప్రేమను మాత్రం మరువకూడదు.
* యుక్త వయస్సు పిల్లలను తల్లిదండ్రులు స్నేహితుల్లా చూడాలి. వారి అభిప్రాయాలను, అభిరుచులనూ గౌరవించాలి.
ఇలా.. పెద్దవాళ్లమనే అనవసర ఈగోలకు పోకుండా, చిన్న చిన్న సూచనలు పాటిస్తూ పిల్లలతో ప్రే మగా ఉంటే తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య అవగాహన ఏర్పడి పిల్లలు చక్కగా, బాధ్యతగా పెరిగి సమాజంలో గొప్ప వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు.
*