మెయిన్ ఫీచర్

‘అమ్మలు’ రక్షించుకోవలసిన పుత్తడి బొమ్మలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారులను వికృత లైంగిక వాంఛా రాక్షసత్వంతో, చిదిమివేసే పాశవిక మనస్తత్వ నేరప్రవృత్తి, ప్రస్తుత సమాజానికి తీవ్ర ఆందోళన, వేదన కలిగిస్తోంది. అభం శుభం తెలియని ఆడపిల్లలు, అమాయకంగా తమల్ని పలకరించే వాళ్ళని నమ్మే పసివయసులో ఒంటరిగా నిస్సహాయంగా వుంటే, ఏ సమయంలో శారీరకంగా హానికి గురిఅయి, ప్రాణాలు సైతం కోల్పోయే విషాద మృత్యు సంఘర్షణ ఎదుర్కోవలసి వస్తుందో ఊహించలేని పరిస్థితులు తలఎత్తాయి. ఒక ప్రాంతంకాదు, ఒక రాష్ట్రం కాదు ఈ వికృత హేళ సర్వత్రా జడలువిప్పి తాండవిస్తోంది. మురికివాడలలో, నిరుపేద మారుమూల దూరంగావుండే జనావాసాలలో ఎందరో ఆడపిల్లలు అసంఖ్యాకంగా ఈ మృత్యు సంక్షోభానికి గురిఅవుతున్నారు. వెలుగులోకి రాని కథనాలు ఎన్నో వున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో ఆదరణకు నోచుకోని పిల్లలు, తల్లిదండ్రులు బతుకుతెరువుకోసం పిల్లల్ని వదిలి కూలి పనులకు వెళ్ళిన సమయాలలో, పొట్టనింపుకోవటానికి ఇంటి చాకిరీ చేసుకొనేవారు, నిరాశ్రయ, నిర్భాగ్య, నిరుపేద, నిర్వాసిత కుటుంబాల పిల్లలు నిస్సహాయంగా లైంగిక దాడులకు గురిఅవుతున్నారు. ఆడపిల్లలను సాధ్యమైనంత లేత వయసులో వ్యభిచార కూపాలలోకి దింపే అమానుష వికృత నేపథ్యం, ఆడతనం కేవలం సెక్స్ వ్యామోహం కోసమే అన్నట్టుగా వ్యవహరించే సినీ సాంస్కృతిక వినోద ప్రచార మాధ్యమాలు, ఆడతనం గుట్టువిప్పి రచ్చకెక్కుతున్న ఆకర్షణ వ్యామోహాలు, అరచేతిలో అందుబాటులో వుండే సెక్స్ లైంగిక క్రీడల వెసులుబాటు సమాజంలోని అన్నివర్గాలను సతమతంచేసి సతాయిస్తున్నాయి. వయసుతో నిమిత్తంలేకుండా కోర్కెలు తీర్చుకోవాలనే తాపత్రయం, అవకాశాలను అనే్వషించే లేదా ఎదురుచూసే నిరంతర ఉన్మత్త తాపత్రయం సర్వత్రా బహిర్గతమవుతోంది. బలీయమైన వాంఛలు, పీడించే కోర్కెలు నేరప్రవృత్తి పెరగటానికి కారణం అవుతున్నాయి. సమాజం, చట్ట్భయాలు, నలుగురిలో గౌరవం, కోర్కెలను అణచివేస్తున్నా అవకాశం దొరికితే, విశృంఖలత్వం దాడిచేసే నేర ప్రవృత్తి ఇంటాబయటా రాజ్యంచేస్తోంది. కామాంధత కళ్ళుకప్పుతోంది.
ఈ లైంగిక అత్యాచార ఘోర నేరప్రవృత్తికి అధిక శాతం అట్టడుగు ఆర్థికంగా, సామాజికంగా అణచివేతలకు గురిఅవుతున్న కుటుంబాలకే పరిమితం కావటంలేదు. సంపన్న, మధ్యతరగతి విద్యాసంస్థల బాలికలు కూడా పీడ ఎదుర్కొంటున్నారు. విద్యార్థినులు, గృహిణులు, ఉద్యోగినులు అన్ని వర్గాల మహిళలు ప్రస్తుత సమాజ నిర్మాణంలో స్వేచ్ఛగా భాగస్వామ్యులయ్యే అవకాశాలు పెరగటంతో బాహాటంగా వేధింపులు తప్పటంలేదు. హాలీవుడ్‌నుంచి టాలీవుడ్ వరకు దశాబ్దాలనాటి కథనాలు ‘మిటూ’ ఉద్యమ చైతన్యంతో వెలుగుచూస్తున్నాయి. 21వ శతాబ్ది ప్రస్తుత ద్వితీయ దశాబ్దం నగ్నసత్యాల ఆవిష్కరణలతో సతమతమవుతోంది.
ప్రాచీన భారతీయ సమాజంలో 8 సంవత్సరాల వయసు పుత్తడి బొమ్మలెందరో, గృహిణులుగా, వితంతువులుగా పురుష సమాజాన్ని నాడు అణచివేతల ఆధిపత్యంతో అనుసరించారు. ఉంచుకొన్న వాళ్ళుగా, భోగం ఉంపుడు కత్తెలుగా, వేశ్యలుగా సుఖాలందించారు. శవాలతో సహగమనం చేసే కాలంనుంచి మహిళ, స్వేచ్ఛగా ధిక్కార స్వరంతో సమాన హక్కులకోసం నిలదీసే అధునాతన చైతన్యం వెల్లివిరుస్తోంది. అయినా ఆడతనం అన్యాయం, అణచివేత, వంచన, మోసాలకు బలిఅవుతూనే వుంది. హింస, అకృత్యాలు, శారీరక మానసిక వేధింపులు, అత్యాచారాల నేర శాతం పెరుగుతూనే వుంది. గురజాడ మహాకవి సృష్టించిన పుత్తడి బొమ్మ బలవన్మరణానికి పాల్పడితే, ప్రస్తుతం పుత్తడిబొమ్మలు తమకు పరిచితులు, సన్నిహితులు నమ్మినవారి అకృత్య వాంఛల బలి ఎదుర్కొంటున్నారు. చాప కింద నీరులా ఈ విష సంస్కృతి పాకుతోంది. క్రమేపీ మరణ దండనల భయభ్రాంతులు కూడా నిర్వీర్యం అవుతున్నాయి. చట్టాలు, పోలీసులు, కేసులు, జైలుశిక్షలు సర్వసాధారణం అవుతున్నాయి. మహిళాలోకం అమ్మలుగా సంఘటితంగా గళం విప్పి ఆడపిల్లల్ని రక్షించుకొనే నిర్భయ ధిక్కార ప్రజ్వలనంతో తమ రెక్కల చాటున పొదిగి కాపాడుకోవాలి. ఏ వర్గం, మతం, కులం, కుటుంబం ఎవరికి చెందినా, చెందకపోయినా ప్రతి మహిళా ఒక అమ్మగా ఆడపిల్లలను వారి జీవితాలు ఛిద్రంచేసే వికృత శక్తులను మట్టుపెట్టాలి. ఆయుధం చేపట్టాలి.

- జయసూర్య