మెయిన్ ఫీచర్

పెద్దలమాట చదువుకు బాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్వం పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రుల పాత్ర తక్కువగానూ, ఉపాధ్యాయుల పాత్ర ఎక్కువగానూ ఉండేది. కానీ అప్పటి, ఇప్పటి చదువుల విషయంలో చాలా మార్పు ఉంది. ఇప్పుటి చదువులన్నీ అడ్వాన్స్ వర్షెనే్స.. ఫలితంగా తల్లిదండ్రులకు పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచే ఎక్కువ బాధ్యత తీసుకోవలసిన అవసరం ఏర్పడింది. జాగ్రత్తలు, శ్రద్ధ మరింతగా పెరిగాయి. అవేంటో చూద్దాం.
* పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించి వారిచేత చదివించడం, హోం వర్కు చేయించడం చేయాలి. అంతేకానీ దగ్గరుండి ప్ర తీదీ పెద్దవారే చేయకూడదు. దానివల్ల పిల్లలకు లాభం కంటే నష్టం ఎక్కువ.
* పిల్లలు ప్రాజెక్టు వర్కులు చేసేటప్పుడు దగ్గరుండి గైడ్ చేయాలే కానీ వారికి అన్నీ తల్లిదండ్రులే చేసి పెట్టకూడదు.
* పిల్లలు ఏకాగ్రతగా చదువుకోవటానికి ఇంటి వాతావరణం ఆహ్లాదంగా ఉండాలి. అలా ఉంటేనే పిల్లలు శ్రద్ధగా చదువుకోగలుగుతారు.
* కొంతమంది పిల్లలు కొన్ని పాఠాలను చదవడానికి కష్టపడుతుంటారు. వాటిపై ఇష్టం చూపించరు. అలాంటివారికి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన శిక్షణను ఇవ్వాలి. అంతేకానీ వారిని కించపరిచి హేళన చేయకూడదు. అలా చేస్తే వారు ఆత్మన్యూనతాభావానికి గురవుతారు.
* చిన్నప్పటి నుంచి పిల్లలకు పాఠ్యాంశాలే కాక, లోకజ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలను చదివే అలవాటు చేయాలి.
* పిల్లలను విజ్ఞానప్రదేశాలకు తీసుకువెళ్ళడం, కొత్త కొత్త ప్రదేశాలకు తీసుకువెళ్లడం వల్ల వారిలో కుతూహులం, శ్రద్ధలు పెరుగుతాయి.
* ఎప్పటికప్పుడు పాఠశాలకు వెళ్ళి ఉపాధ్యాయులను కలిసి వారితో పిల్లల గురించి చర్చించాలి.
* పిల్లలు దేనిలోనైనా విశేష ప్రతిభ కనబరిచినప్పుడు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలి. అప్పుడే వారిలో శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసాలు పెరుగుతాయి.
* పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు లింగబేధాలను చూపకూడదు. అంటే అమ్మాయిలను, అబ్బాయిలను సమానంగా చదివించాలి.
* పిల్లల మార్కుల విషయంలో వారి శక్తి సామర్థ్యాలను మించి ఫలితాలను ఆశించకూడదు.
* చదువుతో పాటు పిల్లలకు ఆటలు, వ్యాయామం కూడా అవసరమే. ఆటల వల్ల పిల్లలకు శారీరక, మానసిక అభివృద్ధి ఉంటుంది. మెదడు చురుగ్గా పనిచేయడమే కాక ఏకాగ్రత పెరుగుతుంది.
* పిల్లలపై ఎప్పుడూ వివక్ష చూపకూడదు. అలా చూపకుండా చదివిస్తే వారు కచ్చితంగా బాగా చదివి మంచిపేరును తెచ్చుకుంటారు.
ఇలా చిన్నతనంలో పిల్లలకు ఇచ్చే శిక్షణపైనే వారి భావి జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులను పిల్లల పెంపకం విషయంలో శ్రద్ధ వహిస్తే పిల్లలు బాగా చదువుకుని వారి భవిష్యత్తుకు బంగారుబాటను వేసుకుంటారు.

- ఉమామహేశ్వరి