మెయిన్ ఫీచర్

‘నిర్భయ నిధి’... అందనిది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లైంగికదాడి, అత్యాచార బాధితులను ఆదుకునే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం ఏర్పాటుచేసిన ‘నిర్భయ నిధి’లో దాదాపు రూ. 3,409 కోట్ల నిధులు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. లైంగిక దాడులు, అత్యాచార ఘటనల్లో బాధితులకు వైద్య, చట్టపరమైన సహాయంతో పాటు మానసిక సాంత్వన కలిగించేందుకు ప్రభుత్వం ‘వన్ స్టాప్ సెంటర్ల’ ఏర్పాటును ప్రతిపాదించింది.
నాలుగేళ్ల క్రితం 2013లో పారా మెడికల్ విద్యార్థినిపై ఆరుగురు యువకులు దేశరాజధాని హస్తినలో అర్ధరాత్రి వేళ లైంగికదాడికి పాల్పడిన సంగతి అందరికీ తెలిసిందే. బాధితురాలు ‘నిర్భయ’ సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి కూడా విదితమే.. ఇది దేశవ్యాప్తంగా సామూహిక నిరసనలకు దారితీసింది. అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘నిర్భయ’ పేరుతో ఓ చట్టాన్ని రూపొందించి, దాని అమలుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి, ఆడపిల్లలను ఆదుకుంటామని హామీ ఇచ్చింది. అప్పుడే ఈ చట్టం ఆచరణలోకి వచ్చింది. దీనితో పాటు దాదాపు 660 వన్‌స్టాప్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదించి, 151 కేంద్రాలకు నిధులను కేటాయించారు. అధికారిక లెక్కల ప్రకారం దేశ రాజధాని హస్తినలో మహిళలపై లైంగిక దాడుల కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన వన్‌స్టాప్ సెంటర్లలో తొమ్మిది మాత్రమే పనిచేస్తున్నాయి. ఇందులో ఒకటి ప్రభుత్వ ఆధ్వర్యంలో సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో కొనసాగుతోంది. కానీ ఇప్పటికీ ఎవరికీ అత్యంత ప్రతిష్టాత్మకమైన అఖిత భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కి సైతం ఈ ‘వన్‌స్టాప్ సెంటర్’ అన్నది సమాధానం దొరకని ప్రశే్న అయ్యింది.
2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నిర్భయ నిధి కింద రూ.1000 కోట్లు కార్ఫస్ ఫండ్‌కు కేటాయించారు. రెండేళ్ళు తిరిగేసరికి అంటే 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆ నిధిని రూ. 450 కోట్లు కోత విధించి రూ. 550 కోట్లు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే రీతిలో కేటాయింపులు చేశారు. ఇప్పుడు ఆ కార్పస్ ఫండ్ దాదాపు రూ. 3,409 కోట్లకు చేరుకుంది.
దేశవ్యాప్తంగా మహిళలకు భద్రత, రక్షణ పెంచాలన్న లక్ష్యంతో ఈ నిధులను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. కానీ నాలుగేళ్లుగా ఈ నిధుల వినియోగంలో ప్రభుత్వం తీరు చాలా నిర్లక్ష్యంగా ఉంది. నిర్భయ ఫండ్ వినియోగంపై ఇటీవల పార్లమెంటులో జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం ఇస్తూ ఈ పథకం కింద 18 ప్రాజెక్టులను ఆమోదించామని చెప్పారు. అయితే ఈ 18 ప్రాజెక్టులకు ఈ కార్ఫస్ ఫండ్‌ను కేటాయించలేదని పేర్కొన్నారు.
కేంద్ర హోంశాఖ ఇచ్చిన ప్రకటన ప్రకారం వివిధ శాఖల ఆధ్వర్యంలో మహిళల భద్రత కోసం చేపట్టిన పలు ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో యాభై శాతం కూడా ఖర్చుకాలేదు. అలాగే మహిళలు, బాలలపై సైబర్ నేరాల నివారణకు ఖర్చు చేయాలని హోంశాఖ రూ. 195.83 కోట్లు ఆమోదించింది. కానీ రూ. 82 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. అలాగే లైంగిక నేరాలపై దర్యాప్తు కోసం విచారణ యూనిట్ ఏర్పాటుకు రూ. 324 కోట్లు కేటాయించింది హోంశాఖ. ఆసక్తికరమైన విషయం ఏంటంటే హోంశాఖ ఎటువంటి కారణాలు చెప్పకుండానే ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకుంది. అత్యధిక నేరాలు జరుగుతున్న జిల్లాల్లో కేసుల దర్యాప్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని నిర్దేశించింది. లైంగికదాడి, వరకట్నం, హత్య, యాసిడ్ దాడి, మహిళల అక్రమ రవాణా వంటి కేసుల దర్యాప్తుకు ఈ నిధులను ఖర్చు చేయాలని సంకల్పించింది. కానీ వ్యవస్థీకృత నేరాల దర్యాప్తు సంస్థకు రూ. 83.20 కోట్లలో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభయ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్‌లో మహిళల, బాలికల సురక్షిత ప్రయాణానికి రూ. 138.49 కోట్లు కేటాయిస్తే కేవలం రూ. 58.64 కోట్లు ఖర్చయ్యాయి.
ఈ లెక్కలన్నీ కేవలం పాలకులకు తప్ప సామాన్య ప్రజలకు అర్థం కావు. ఇంటి బడ్జెట్ గురించి అయితే యజమాని పట్టించుకుంటాడు కానీ.. తానూ సమాజంలో ఒక భాగమని, బడ్జెట్‌లో కేటాయించే సొమ్ము తమదేనని.. ఆ సొమ్ము సరిగా ఖర్చవుతోందా? అని ఆలోచించే తీరిక, ఓపిక సామాన్యుడికి ఎక్కడ ఉంది? ఒకవేళ తెలుసుకోవాలనుకున్నా లెక్కలు చెప్పే వాళ్లు ఎవరు? అందుకే ఇదే అదనుగా కోట్లకు కోట్లు మాయమవుతున్నాయి. ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యానికి కేటాయించిన కోట్ల నిధులు కంటికి కనిపించని నేటి సమాజంలో- మహిళల సంరక్షణకు, అభివృద్ధికి కేటాయించిన నిధులు మాత్రం కనిపిస్తాయా? వెర్రితనం కాకపోతే..!

-విశ్వ