మెయిన్ ఫీచర్

మహిళా హితైషిణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళా చైతన్యానికి మార్గదర్శిగా నిలిచిన వరలక్ష్మమ్మగారు సమాజం స్ర్తిలపట్ల అనాదిగా చూపుతున్న వివక్షతను ఖండిస్తూ వారి అభ్యుదయానికై 1931లో 3స్ర్తి హితైషిణి మండలిని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా మహిళా చైతన్యాన్ని మహోన్నతంగా కలిగించారు.

పందొమ్మిదో శతాబ్దపు తొలి రచయిత్రి శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారు. ఆడపిల్ల గడపదాటి బయట అడుగుపెడితే తప్పుగా భావించే ఆ కాలంలో ఆమె తన సోదరుడు పాలపర్తి నరసింహంగారి సహకారంతో ఇంట్లోనే ఉంటూ పలు గ్రంథాలు చదివి, 1911లో నరసాపురం తాలూకా అభివృద్ధి సంఘం స్ర్తిల కోసం నిర్వహించిన పరీక్షలో స్వర్ణపతకం గెలుచుకున్నారు. తన పెద్దన్న రామమూర్తిగారు గుంటూరులో స్థాపించిన 3వనితా గ్రంథ మండలిలో పనిచేస్తూ వెయ్యికిపైగా పుస్తకాలను చదివి సాహిత్యాన్ని ఆకళింపు చేసుకున్నారు. ఆమె భర్త హనుమంతరావుగారు కూడా ఆమెను ఎంతగానో ప్రోత్సహించేవారు. తన భర్త ఉద్యోగరీత్యా మదనపల్లిలో ఉండగా ఆమెకు శ్రీమతి సరోజినీ నాయుడుతో పరిచయం ఏర్పడింది. ఇంగ్లీషులో ప్రచురించబడ్డ ఒక కథను తెలుగులోకి అనువదించి ‘‘సౌదామిని’’2 అను కలం పేరుతో ఆమె ‘‘అనసూయ’’ అనే పత్రికకు పంపగా అది ప్రచురితమయ్యింది. ఆ స్ఫూర్తితో ఆమె 3లక్కబరిణి, ప్రేమలత, కనకవల్లి2 మొదలైన కథలు రచించారు. భారతి, శారద, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వినోదిని, ఆంధ్రవాణి, ఆంధ్రమహిళ, ఆంధ్రపత్రికలలో ఆమె కథలు ప్రచురితమయ్యాయి. అనసూయ పత్రికలో వీరి కథలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. 1922లో ‘లీలావతి’ అను కలం పేరుతో ‘మా చెట్టు నీడ ముచ్చట్లు’2 అను వ్యాసావళిని ఆంధ్రపత్రికకు ధారావాహికంగా అందించారు. 3వసుమతి2 వీరి తొలి పుస్తకము. ఇంకా 3అపరాధి2 అను సాంఘిక నవలను, ‘వరదరాజేశ్వరి’2అను చారిత్రక నవలను, ‘పునఃప్రతిష్ఠ’2 అను చారిత్రక నాటకమును, పలు ప్రహసనాలను వీరు రచించారు. 1926లో ‘ద్రౌపదీ మాన సంరక్షణము, 3సత్యా ద్రౌపదీ సంవాదము’2 అను రెండు ద్విపద కావ్యాలను రచించారు. ‘లక్ష్మి’ అను మకుటముతో ఒక శతకమును రచించారు. భావనారాయణ స్వామి వారిపై 3‘్భవనారాయణ శతకము’ను రచించారు. 3‘మహిళా ప్రబోధం’2 అను బుర్రకథను కూడా వీరు రచించారు. తన రచనలలో జాతీయమైన భాషను వాడేవారు. పద్య వాఙ్మయమునందు ప్రవేశమున్నప్పటికీ గద్య రచనకే వీరు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. ఆమె రచనలలో 3‘్శరధ లేఖలు’2 మిక్కిలి ప్రసిద్ధిచెందింది. 1928 నుంచి 1934 వరకు ప్రచురితమైన 3‘్శరధ లేఖలు’2 ద్వారా ఆయా కాలమందలి మూఢ విశ్వాసాలు, బాల వితంతువుల బాధలు, వరకట్నాల బెడద, పురుషాధిక్యత వంటి బహువిధ సమస్యలను పాఠకులకు తెలియజెప్పారు. అంతేకాకుండా ఆ లేఖల ద్వారా స్వాతంత్య్ర సమరోద్యమ విశిష్టతను భావోద్వేగంగా వర్ణించారు. శారద లేఖలు చదివేందుకు పాఠకులు తహతహలాడిపోయేవారు. తెలుగులో లేఖల రచనలకు వీరే ఈ విధంగా ఆద్యులయ్యారు. నిండా పాతికేళ్ళయినా నిండని ప్రాయంలో ఆమె వ్రాతలలోని విజ్ఞాన వైదుష్యానికి అందరూ ఆశ్చర్యపోయేవారు. 1929లో విజయవాడలో జరిగిన మహిళా సభలో తొలిసారిగా ప్రసంగించారు ‘స్ర్తి అబలకాదు’2 అనే గృహలక్ష్మి వ్యాస రచనల పోటీలో వీరు 1930లో స్వర్ణపతకం గెలుచుకున్నారు. 1930లో ‘గృహలక్ష్మి’2పత్రికకు సంపాదకురాలిగా పనిచేశారు. తన కవితా సామ్రాజ్యాన్ని ఆంధ్ర దేశమంతటా విస్తరింపజేసిన శ్రీమతి వరలక్ష్మమ్మగారికి డాక్టర్ కె.ఎన్.కేసరిగారు శారదలేఖలు2 రచనకుగాను 1934లో గృహలక్ష్మి2స్వర్ణకంకణం2ప్రదానం చేశారు. వీరు అనేక రేడియో ప్రసంగాలు కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. 1967లో ‘కవితా ప్రవీణ’2 అను బిరుదు పొందారు. 1975లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో స్వర్ణ ఫలకాన్ని, తామ్రపత్రాన్ని అందుకున్నారు. ఆంధ్రదేశం తొలి తరం రచయిత్రుల్లో ప్రథమ రచయిత్రైన శ్రీమతి వరలక్ష్మమ్మగారి బహుముఖ ప్రజ్ఞ మహాత్మాగాంధీని సైతం ఆకర్షించింది. స్వస్థాన దేశ భాషాభిమానంగల వీరు స్వాతంత్ర సమరంలో పాల్గొని ఖద్దరు వ్యాప్తికి కృషి చేశారు. దాదాపు ఆరు దశాబ్దాలపాటు అవిశ్రాంతంగా కథలు, కథానికలు, పద్యాలు, గేయాలు, లేఖలు వంటి అన్ని సాహిత్య ప్రక్రియలను అత్యద్భుతంగా రచించిన వరలక్ష్మమ్మగారు ఆంధ్ర సాహిత్యావనికి అసలు సిసలు చిరునామా.
స్ర్తి హితైషిణి మండలి...
మహిళా చైతన్యానికి మార్గదర్శిగా నిలిచిన వరలక్ష్మమ్మగారు సమాజం స్ర్తిలపట్ల అనాదిగా చూపుతున్న వివక్షతను ఖండిస్తూ వారి అభ్యుదయానికై 1931లో 3స్ర్తి హితైషిణి మండలి2ని స్థాపించారు. ఆ సంస్థ ద్వారా మహిళా చైతన్యాన్ని మహోన్నతంగా కలిగించారు. అంతేకాకుండా మండలికి అనుసంధానంగా సీతా పుస్తక సదనాన్ని ఏర్పాటుచేశారు. 1942 నాటికి మండలికి సొంత భవనాన్ని ఏర్పాటుచేశారు. దానికి గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటుచేశారు. దాని ద్వారా కుల మత విచక్షణ లేకుండా మహిళలకు కుట్టు, సంగీతం హిందీ తరగతులు నిర్వహించారు. స్ర్తి జనాభ్యుదయానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలను సమసమాజం పట్ల జాగృతం చేసేందుకు సమావేశాలు ఏర్పాటుచేశారు. శిక్షణ పొందిన మహిళలచే రూపొందించబడిన వివిధ రకాల వస్తువుల ప్రదర్శనలను ఏర్పాటుచేశారు. వారికై చేతివృత్తుల తరగతులను నిర్వహించారు. 1931 సంవత్సరంలో ‘స్ర్తి హితైషిణి మండలి డ్రమటిక్ సెక్షన్’ను స్థాపించి, దాని ద్వారా అనేక నాటకాలను వేయించారు. హరికథలు చెప్పించారు. పెక్కు మహిళా మండలుల ఆవిర్భావానికి విశేషంగా కృషిచేశారు. ప్రతి శనివారం మండలిలో భజనలు చేయించేవారు. భద్రాచలంలో జరిగిన అఖిల భారత మహిళా సభ శాఖయైన ఆంధ్ర రాష్ట్ర మహిళా సభకు వీరు అధ్యక్షత వహించారు. హిందీ భాషాభిమానిగా కూడా వీరు ప్రఖ్యాతి వహించారు. స్ర్తి విద్య పట్ల, స్ర్తి అభ్యుదయం పట్ల అకుంఠిత దీక్షతో కృషి చేసి, స్ర్తిలలో పఠనాభిలాషను పెంపొందింపజేసిన వీరికి నారీజనం నాటికీ, నేటికీ, ఏనాటికీ రుణపడే ఉంటుంది.
మహాత్ముని సందర్శనము - ఖద్దరు దీక్ష
1921వ సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన వరలక్ష్మమ్మగారి జీవితాన్ని మరోమలుపు తిప్పింది. బాపూజీ స్వరాజ్య నిధికోసం ఆంధ్రదేశంలో పర్యటిస్తూ బందరు చేరుకుని అక్కడ జాతీయ కళాశాలలో బస చేశారు. ఆ సమయంలో బందరులోని తమ నాల్గవ అన్నగారి ఇంట వున్న వరలక్ష్మమ్మ, ఆమె తల్లిగారు బాపూజీని దర్శించటానికి వెళ్లారు. అప్పటికే వరలక్ష్మమ్మ రాట్నము తెప్పించుకొని నూలు వడికినది. తాను వడికిన నూలును, ఒక ఉంగరమును స్వరాజ్య నిధికిగాను బాపూజీకి సమర్పించింది. ఆమె ఇచ్చిన నూలు తీసుకొని బాపూజీ సంతోషించి ‘‘రోజూ నూలు వడుకుతున్నారా?’’ అని ప్రశ్నించారు. ఆమె వడుకుతున్నానని చెప్పింది. అపుడు వరలక్ష్మమ్మ ఖద్దరు చీర కట్టిలేదు. 3ఇక ఖద్దరు కట్టుకుంటారా?2 అని మహాత్ముడు అడిగారు. 3అలాగే కట్టుకుంటా2నని చెప్పి మహాత్మునికి నమస్కరించింది. అప్పటినుంచి ఆమె ఖద్దరు చీర కట్టడం ఆరంభించినది.
ఆమె ధరించిన ఆ మొదటి ఖద్దరు చీర ఎంతో బరువుగా వున్నదట. ఎఱ్ఱమట్టితో తడిపిన నూలుతో నేయబడిన ఆ పల్నాటి ఖద్దరు మైజారు చీరె కొంచెం సేపు కట్టుకొనగా ఆమె శరీరమంతా చీరిపెట్టినది. అంతవరకు ఎంతో సున్నితమైన చీరలకు అలవాటుపడిన శరీరము ఆ ఖద్దరు చీర ఒరిపిడిని భరించలేకపోయినది. అయినా ఆమె ఖద్దరు ధరించుట మానలేదు. 1921వ సంవత్సరం మొదలుకొని 1955వ సంవత్సరం వరకు 34 సంవత్సరాలు ఖద్దరు ధరించినది. తరువాత వార్థక్యంలో ఆరోగ్యం చెడినందున ఖద్దరు మోయలేని పరిస్థితి ఏర్పడినది. అందువలనే చేనేత వస్తమ్రులను ధరించుటకు అలవాటుపడినది.

- పాలపర్తి సంధ్య