మెయిన్ ఫీచర్

పరమానందభరితమైన స్వేచ్ఛ మీ జన్మహక్కు( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ, అంత విలువైన స్వేచ్ఛ గురించి ఏమాత్రం ఆలోచించలేనంతగా, దానిని ఏమాత్రం అర్థం చేసుకోలేనంతగా మనిషి తన బాధలను ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే, స్వేచ్ఛగా ఉండాలంటే బాధలను వదులుకోవాల్సి వస్తుంది. మనిషి ఆ పని చెయ్యలేడు. అందుకే తనని రక్షించేందుకు, తన బాధలు తీర్చేందుకు, కనీసం తన ఫిర్యాదులు, ప్రార్థనలను స్వీకరించేందుకు శాశ్వతమైన తండ్రి లాంటి ‘దేవుడు’ఆకాశంలో ఉండాలని కోరుకుంటాడు. లేకపోతే అతను తప్పిపోయిన పిల్లాడిలా భావిస్తాడు. అది తండ్రి విషయంలో మానసికంగా స్థిరపడ్డ నిర్ణయం.
మీకు తండ్రి లాంటివాడు శాశ్వతంగా కావాలి. అందుకే మీరు దేవుణ్ణి సృష్టించుకున్నారు. అది మీ సృష్టికాబట్టి, ఏదో విధంగా చుట్టుతిరిగే పద్ధతిలో మిమ్మల్ని మీరు పూజించుకుంటారు. అద్దంముందు నిలబడి చేతులుజోడించి మీకు తెలియని భాషలో- సంస్కృతం, హీబ్రూ, అరబిక్, గ్రీకు, లాటిన్- ప్రార్థించడం సులభమైన పద్ధతి. పైగా, తెలియని భాషలో చేసే ప్రార్థన ఎప్పుడూ మైమరపిస్తుంది. కాబట్టి, మీకు తెలిసిన భాషలో ఎప్పుడూ ప్రార్థించకండి. ఎందుకంటే, తెలిసిన భాషలో చేసే ప్రార్థనలో పస ఉండదు.
మనుషులను మానవత్వంనుంచి బానిసత్వంలోకి లాగిన నిరంకుశుణ్ణి బానిసలు పొగిడినట్లుగా ఉంటుంది మీ పూజ. పైగా, నిరంకుశుడు బానిసలను ఎప్పుడైనా చంపగలడు. ఎందుకంటే, వాడి దృష్టిలో బానిసలు ఒక ఆస్తి తప్ప మనుషులు కారు.
పరమానందభరితమైన స్వేచ్ఛ మీ జన్మహక్కు. కానీ, అనేక వేల సంవత్సరాలుగా అనేక రకాల బానిసత్వాలు ‘‘మీరు స్వేచ్ఛగా ఉండేందుకు భయపడేలా’’మిమ్మల్ని తయారుచేశాయి. మీరనుకుంటున్నట్లుగా ఈ చర్చిలు, సినగాగులు, దేవాలయాలు, మసీదులు మీ స్వేచ్ఛకు సంకేతాలు కావు. అవి మీ బానిసత్వానికి, మీ మృత నిరంకుశులకు సంకేతాలు. చివరికి తెలివైనవారు కూడా అదే పని చేస్తున్నారు. అందుకే మనిషి అంధత్వం అనంతమనిపిస్తుంది.
దేవుడి పేరుమీద అనేక వేల సంవత్సరాలుగా అనేక రకాల సంకెళ్ళతో మీరు బంధించబడ్డారు. అందుకే వాటిని మీరు దేవుడిచ్చిన ఆభరణాలుగా భావిస్తున్నారు.
మీ తల్లిదండ్రులు మీ శత్రువులు కారు, ఎందుకంటే, వారు మిమ్మల్ని ప్రేమిస్తారు. అందుకే వారితోపాటు మిమ్మల్ని ఏ దేవాలయానికో, చర్చికో, మసీదుకో తీసుకెళ్తారు. కానీ, వాస్తవమేంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళను అలాగే తీసుకెళ్ళారు. అలా తరతరాలుగా యాంత్రికంగా జరుగుతూ వచ్చింది. అందుకే బానిసత్వ భావన మీ రక్తంలోకి, మీ ఎముకల్లోకి, వాటి మజ్జల్లోకి కూడా చొచ్చుకుపోయింది.
కాబట్టి, ఎవరైనా కృష్ణుడు, జీసస్, మహమ్మద్‌లకు వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే మీరు వారితో పోరాడతారు. ఎందుకంటే, వాళ్ళు మీ దేవుళ్ళుకాబట్టి. కానీ, మీ దేవుళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు మీ బానిసత్వపు సంకెళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న సత్యాన్ని మీరు ఏమాత్రం గుర్తించలేరు.
నిజానికి, మీ దేవుళ్ళే మీ బానిసత్వానికి చాలా అందంగా మెరుగుపెట్టి అలంకరించబడిన సంకెళ్ళు. మీ తల్లిదండ్రులు ఆ బానిసత్వంలోనే జీవించారు. వారే కాదు, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల తల్లిదండ్రులు... అలాంటి సుదీర్ఘ బానిసల వరుసలో ఉన్నవారే. ఆ వరుస వారసత్వాన్ని వారు వదులుకోలేరు.
అందుకే వారి బానిసత్వానికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నాను. అందువల్ల ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని మతాలు నన్ను ఖండిస్తున్నాయి. మీరు కూడా ఆ బానిసత్వ వారసత్వంలోకి ప్రవేశిస్తారు. ఒకవేళ మీరు దానిని తీవ్రంగా పరిగణించకపోయినా అది తీవ్రంగా పరిగణించే విషయమే.
నేనొకటి విన్నాను:
ముగ్గురు రబ్బీలు వారి సినగాగుల (యూదుల దేవాలయము) గొప్పలు చెప్పుకుంటున్నారు. వారిలో ఒకడు ‘‘మా సినగాగు చాలా అధునాతనమైనది. ఎందుకంటే, నేను ధర్మోపదేశాలు చేస్తున్నప్పుడు ఎవరైన హాయిగా సిగరెట్లు కాలుస్తూ, సొల్లుకాబుర్లు చెప్పుకునే స్వేచ్ఛ కల్పించాను’’ అన్నాడు.

ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్