మెయిన్ ఫీచర్

సత్యం అంటే నమ్మకమేనా...?-6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: సత్యం అంటే ఏమిటి? నమ్మకం అంటే ఏమిటి మరియు వాటి మధ్య తేడా ఏమిటి ?
ఒకవేళ మీరు ‘సత్యం అంటే ఏమిటి’ అని ఇతర మతస్తులను ప్రశ్నించితే వారి సమాధానం చాలా మట్టుకు ‘వారి నమ్మకమే’ అని లభిస్తుంది. ఒక వేళ మీరు ‘సత్యాన్ని ఎలా కనుక్కుంటారు?’ అని అడిగితే, వారి సమాధానం మళ్ళీ వారి నమ్మకం వల్లే అని వస్తుంది. సత్యం మరియు నమ్మకం ఒకటే అయితే అప్పుడు, వేలాది సంవత్సరాలుగా వారి నమ్మికలో ఎందుకు ఇన్ని వర్గాలు మరియు విభేదాలు ఉన్నాయి ? స్పందన ఉండదు.
అందరినీ చూడడానికి కళ్ళద్దాలు అవసరమయ్యే వ్యక్తి నుండి ఈ స్పందనలు వస్తున్నట్లు అనిపిస్తుంది. దానికి కారణం ప్రశ్న వేరైనా సమాధానం ఒక్కటే. ఆ వ్యక్తులే ఇతరులను ఒప్పించటానికి ప్రయత్నిస్తారు, వారు సత్యాన్ని కనుగొనటానికి సహాయపడగలరని చెబుతారు. ఒక వ్యక్తి వారి మార్గాలను కనుగొనడానికి కళ్ళద్దాలు అవసరమైనప్పుడు, వారి సహజ దృష్టి బాగా లేదు అన్నది స్పష్టంగా విశదవౌతుంది.
విశ్వాసం మరియు తర్కం సహజ శత్రువులుగా కనిపిస్తాయి. ఏ మత విశ్వాసము కూడా రాజకీయ పరిణామాలకు భయపడి తమ విశ్వాసాన్ని తర్కం చేయాలని కోరుకోదు. వారి విశ్వాసమే సత్యం అని కూడా వారు వాదిస్తారు. కానీ విశ్వాసం కన్నా సత్యం తర్కానికి దగ్గరగా ఉంటుంది. సత్యం నిర్థారణ చేయకపోతే, న్యాయం చేకూర్చబడదు.
సత్యం తెలుసుకోవడానికి కావలసింది విశ్వాసం కాదు, సమగ్రత కావాలి. నిఘంటువుల నిర్వచనం ప్రకారం సమగ్రత అంటే నిజాయితీ మరియు నిష్పక్షపాతము. విశాల దృక్పదం ఉన్న ఎవరికైనా భగవద్గీత ఈ అభిప్రాయం కలుగజేస్తుంది. భగవద్గీత నుండి క్రింది మూడు శ్లోకాలని పరిగణిద్దాం. ఈ క్రింద ఉన్నవి సంస్కృత పదాలు మరియు ప్రొఫెసర్ డి నికోలస్ చేసిన ఆంగ్ల అనువాదం.
ఇచ్చా ద్వేషసముత్తేస ద్వంద్వమోహేన భారత:
సర్వభూతాని సమ్మోహం సర్గేయాంతిపరంతప !
జన్మించినప్పుడు అన్నీ జీవులు మాయకు గురవుతాయి. ఓ భరత వంశస్తుడా రాగ, ద్వేషములనే ద్వందముల నుండి పుట్టే భ్రాంతి నుండి, ఓ శత్రువులని జయించేవాడా.
కర్మణ్యేవాధికారస్తే మాఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూ: మాతేసంగోస్త్వ కర్మణి !
నువ్వు కర్మ చేయడానికి మాత్రమే గానీ, ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయరాదు. అలాగని నువ్వు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు.
పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
శిష్ట రక్షణ కోసం మరియు దుష్ట శిక్షణ కోసం, ధర్మ స్థాపనార్థం, నేను యుగయుగాలుగా అవతరిస్తుంటాను.
మానవ జాతికి అందించబడిన అపూర్వమైన పత్రం భగవద్గీతను పైన చెప్పిన ఈ మూడు శ్లోకాలు మాత్రమే చాలు అత్యున్నతమైన స్థానానికి చేర్చటానికి. మహా విష్ణువు మారు పేరైన ‘సత్యనారాయణ’ స్వామి నిజం లేదా ‘సత్యం’ కోరుకునే వారి పక్షాన ఉంటారు.
ఇది మహా భారతంలో అద్భుతమైన రీతిలో స్పష్టం చేయబడింది. యుద్ధానికి ముందు పాండవులు మరియు కౌరవుల మధ్య సంధి కోసం వచ్చినప్పుడు శ్రీ కృష్ణుడు ధృతరాష్ట్రునికి చెబుతాడు. వేలాది కర్ణులు వచ్చి నా ధర్మానికి సత్యానికి స్వరూపమైన ధర్మజుని గెలవలేరని. వారందరూ నశించగలరని.
ఇతర ఏ మత గ్రంధం ఎప్పటికీ చేరుకోలేనంత ఎత్తుకు ‘మహా భారతం’ని భగవద్గీత పైకి చేర్చింది. అందువలన, మహాభారతం ఒక సుదీర్ఘమైన సాహిత్య రచనగా మాత్రమే కాదు, ప్రతి కోణంలో ప్రధమ స్థాయలో ఉన్న మహాగ్రంథం. మహాభారతం పంచమ వేదంగా పరిగణించబడుతుంది. వేలాది సంవత్సరాలు గడచినా మహా భారతాన్ని పొడవులో గాని, గొప్పతనంలో గాని సరిపోలే సామర్థ్యం ఉన్న గ్రంథాన్ని ప్రపంచం వీక్షించలేదు. ఈ వాస్తవాన్ని కాలం మార్చదు.
నిజంగా ఉన్న దాని కన్నా వారికి ఇష్టమైనది వారు చూస్తారు అనే వాస్తవంలోనే ‘సత్యం’ కు సంబంధించిన సంకేతం లేక రహస్యం ఉంది. వారందరికీ తెలుసు ‘సంపూర్ణ సత్యం’ అనేది ఏదో ఉందని. అందుకే కోర్టులో సాక్షులు ప్రమాణం చేయాలి ‘సత్యం, ‘సంపూర్ణ సత్యం, నిజం తప్ప ఏదీ చెప్పను’అని. అప్పుడు సంపూర్ణ సత్యం అంటే ఏమిటి ?
శ్లోకం 07:27 సంపూర్ణ సత్యాన్ని తెలుపుతుంది. సత్యానే్వషణ కోరుతున్న వ్యక్తి రాగ ద్వేషాలతో లేదా ఇష్టాయిష్టాల వంటి ద్వంద్వములతో ప్రభావితమైన అతని లేక ఆమె మనస్సు యొక్క స్థితి వల్ల సత్యాన్ని చూడలేకపోతున్నారు.
శ్లోకం 02:47 అనేది సత్యాన్ని ఎలా కనుగొనాలో చెప్పే పరమ సత్యం. మీ ఆసక్తి అంతా కర్మ చేయడంలోనే ఉండాలి కర్మ ఫలితం లేదా ప్రతి ఫలం మీద ఉండకూడదు. మీ కర్మకు ప్రతి ఫలాపేక్ష కారణం కాకూడదు. మీరు, మీ ఫలాపేక్ష నుండి విముక్తులు కాకపోతే, మీ కర్మ స్వచ్ఛంగా లేదా నిజాయితీగా ఉండదు. అలాగే, కర్మలు మానుటలో ఆసక్తి లేదా కర్మలు చేయటంలో ప్రతిఘటన లాంటి వాటిలో 07:27 లో చెప్పిన కారణాల వల్ల బద్ధులంకాకూడదు. అకర్మకు దారి తీసేవి ‘ఇష్టాయిష్టాలు’. మీరు చూస్తే, పైన పేర్కొన్న రెండు శ్లోకాల సౌందర్య వర్ణన మాటల కందనిది.
శ్లోకం 04:08 తెలిపినట్టు శిష్టరక్షణ మరియు దుష్టశిక్షణ చేసి ధర్మాన్ని అమలుపరచడం అనేది ‘్ధర్మాధ్యక్షుడు’ గా భగవంతుని కర్తవ్యం. చాలా దేశాలలో, పరిపాలనా సంస్థలు లేదా వాణిజ్య సంస్థల ‘నైతిక నియమాలు’ అని పిలవబడే విధానాలు 02:47 లో ఉదహరించిన ఆలోచనలతో సారూప్యాలు కలిగి ఉన్నాయి. మాత మార్పిడి కోసం చేసే సహాయం పవిత్రమవుతుందా? మహాత్మ గాంధీ అభిప్రాయాలు సెక్షన్ 6 లో చూడండి.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562