మెయిన్ ఫీచర్

‘వేదాంత’ జ్ఞానం...12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న. ఇతర వృత్తులలో ప్రమాదాలు లేక ప్రయోజనాలు ఏమిటి?
సామెత చెప్పినట్టు ‘‘అవతలివైపు గడ్డి మరింత పచ్చగా అనిపిస్తుంది’’.
సామాజిక సోపాన క్రమంలో బ్రాహ్మణులు అధికులని భావిస్తారు. చిన్న వయసులోనే అంటే బహుశా ఎమిదేళ్ళ ప్రాయంలో తలవ్రెంటుకలు తీయించుకుని సంస్కృత భాష, వేదవిద్య అభ్యసించటం మెదలుపెడతారు. మరియు బహుశా ఎనిమిదేళ్ళ తరువాత మతపరమైన సంప్రదాయాలు నిర్వహించే బాధ్యతలు చేపట్టవచ్చు. ఇతర వృత్తులవలే విజేతలు మరియు పరాజితులు ఉంటారు. ప్రజలు ఇచ్చే విరాళాల మీద ఆధారపడతారు కాబట్టి వారిలో కొందరు ధనవంతులు మరియు పేదవారు కూడా ఉండేవారు. మరణించిన వారికి అంత్యక్రియలు చేసే బ్రహ్మణులను వివాహాది శుభకార్యాలకు పిలవరు ఎందుకంటే మానవసహజమైన పొరపాట్లు వల్ల మంత్రాలు కలగాపులగం అవుతాయేమోనన్న సందేహం, భయం వల్ల. బ్రహ్మాణులు చేసే కర్మక్షతువుల ద్వారా వచ్చే ధనంతో కుటుంబం పోషించడానికి చాలనప్పుడు స్వచ్ఛంద దానాలపై ఆధారపడి వారు భిక్ష యాచించవచ్చు. ఇప్పటికీ అటువంటి భిక్షాటన విధానాన్ని చూస్తున్నాము. సమాజంలో బిచ్చగాడి హుదా ఏమిటి? విషయ వాంఛలతో మునిగే ఈ భౌతిక ప్రపంచంలో అటువంటి హుదా గురించి అసూయ పడవలెనా?
సమాజం ఇచ్చే హోదా మరియు కట్టుబాట్ల కోసం ప్రాపంచిక ఆనందాలను వదులుకోవలెనని ఒక బ్రాహ్మణ కుటుంబం లేక ఆ కుటుంబంలోని పురుషుడు, స్ర్తీ మరియు సంతానం నుంచి సమాజం ఆశిస్తుంది. తండ్రి అడుగుజాడల్లో నడవమని, ఇతరులు ఇచ్చే స్వచ్ఛంద దానాలతో సంతృప్తి చెందమని మరియు వస్త్ధ్రారణలో సంప్రదాయాన్ని అనుసరించమని సంతానానికి చెప్పినప్పుడు పిల్లలకు నీ మీద గౌరవం ఉండటం ఎంత కష్టం? తన సంతానం కోసం ఒక తల్లి కోరుకునేది ఇదేనా? ఆమె తన సంతానాన్ని వైదిక పాఠశాల కాకుండా అధునాతన విద్యాసౌకర్యం గల పాఠశాలకు పంపాలని కోరుకోదా?
ఇప్పుడు వ్యాపారవృత్తిని పరిగణిద్దాం. వ్యాపారానికి పెట్టుబడి, సరుకు నాణ్యత మరియు వెల గురించిన జ్ఞానం అవసరం. సంవత్సరాల తరబడి సంపాదించుకున్న నమ్మకంపై నిరంతర విజయం ఆధారపడి ఉంటుంది. అందుకు వారికి జనాలని ఆకట్టుకొనే నైపుణ్యత ఉండాలి. వ్యాపార కుటుంబానికి సంబంధించని వారు క్రొత్తగా వ్యాపారం మెదలుపెడితే పూర్తిగా పెట్టుబడిని కోల్పోయే అవకాశం ఉంది. ప్రస్తుత కాలంలో వ్యాపారంలో పెట్టుబడి చేసేముందు ఆరోపణలు, అపోహలు కలుగకుండా జాగ్రత్త వహించమని వ్యాపార సంస్థలు పెట్టుబడి పెట్టేవారికి సలహాని హెచ్చరిక ఇస్తారు. కొన్ని గణాంకాల ప్రకారం అమెరికాలో 95 శాతం కొత్త వ్యాపారాలు విఫలమవుతున్నాయి. వారు బ్రతుకు తెరువు కోసం వ్యాపారమైనా మార్చాలి లేదా వేరే పని ఏమైనా చేయవలసి వుంటుంది.
వ్యాపారకుటుంబం నుంచి వచ్చిన వారు, సంవత్సరాల తరబడి పెంచుకున్న వ్యాపార పరిజ్ఞానం మరియు పరిచయాల సహాయంతో, వ్యాపారంలో రాగలిగే అనిశ్చిత పరిస్థితులు, అప్పులు మరియు దోపిడి వల్ల కలిగే నష్టాలని ఎదుర్కోగలరు. ఇప్పుడు ఉన్నంత సురక్షితంగా అప్పుడు వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఉండేవి కావు. ఇప్పటికీ కొన్ని గ్రామాలకి వెళ్ళేందుకు బస్సు సౌకర్యం లేనందున అక్కడికి వెళ్ళడం సురక్షితమని భావించలేము. ఆ రోజుల్లో ‘‘వ్యాపార భీమా’’ అనేది ఎరుగరు. ఇతర వ్యాపార సంస్థలో ఉద్యోగం చేయాలన్న ఆసక్తి ఉంటే మీరు ఎక్కువ డబ్బు సంపాదించక పోవచ్చు. కానీ యితర వృత్తులతో పోలిస్తే హాని కలిగే అవకాశం తక్కువే. ఈ విధమైన ఎంపిక వలన కుటుంబ జీవనం మెరుగుగా ఉంటుంది. ఎందుకుంటే యితర వృత్తులతో పోలిస్తే ఉద్యోగం చేసేవారికి ఇంట్లో ఎక్కువ సమయంగడిపే అవకాశం ఉంటుంది. నీ కుటుంబ సభ్యులతో గడిపే సమయం, కలిసి భోంచేయడం, ఒకే ఇంటికప్పు క్రింద నిద్రించడం వాటిల్లో ఉన్న విలువ ఏమిటి?
పై ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, జీవనభృత్తి కోసం భార్య, చిన్నపిల్లలని ఇంటి దగ్గర వదిలి చాలా కాలం ఎక్కడో దూరంగా ఉండటాన్ని ఊహించుకోండి. చివరి దశలో ఉన్న తల్లిదండ్రుల దగ్గర లేకుండా ఉండడం ఊహించుకోండి. మానవ స్వభావం గురించి తెలుసుకోవటానికి ఒక మానసిక పరీక్షని పరిగణిద్దాం. మధ్యతరగతికి చెందిన ఒక తండ్రి పొదుపు చేసిన డబ్బు గాని ఆస్తిలో భాగాన్ని వృత్తి లేక వ్యాపారం చేసుకోమని తన కుమారుడికి యిస్తాడు. సంస్కృతం మరియు వేదాలు నేర్చుకోవాలంటే అతి చిన్న వయసులోనే అభ్యసించడం మె4దలెట్టాలి మరియు ఆ వృత్తిలో భౌతికానందాలు తీరే అవకాశం ఉండదు కాబట్టి ఈ పరీక్ష ఒక 18 సంవత్సరాల యువకుడు మీద జరుగున్నట్లయతే అతను ఆ వృత్తిని పరిగణనలోకి తీసుకోవటానికి అవకాశం లేదు. ఇతర వికల్పాలు మరియు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకొనే అవకాశాలు అందుబాటులో ఉంటాయి. నీ కోసం ఏ వృత్తిని ఎంచుకుంటావు మరియు నీ కుమారుని ఏ వృత్తి చేయమని ప్రోత్సాహిస్తావన్నది ప్రశ్న.
ఇటువంటి ప్రశ్నలకు సరైన లేక తప్పు సమాధానం అని ఉండదు. ఈ ఎంపికలు చేయవలసి వచ్చినప్పుడు మీరు నిర్ణయం తీసుకొనే ముందు దాని వల్ల వచ్చే పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని మీకు స్పష్టంగా తెలుస్తుంది. మంచి అవగాహన కోసం, పై ప్రశ్న ప్రత్యామ్నాయకంగా చెప్పవచ్చు. పైన పేర్కొన్న చర్యలు లేదా వృత్తులలోనున్న ప్రజలు పాల్గొన్నప్పుడు, వేదాలు చదివే మరియు పఠించే ప్రజలకు వేదాంతము లేదా ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మరియు సమాజ రక్షణలో పాల్గొన్నవారికి విజయాన్ని, వ్యాపారాన్ని ఎంచుకునేవారికి ధనాన్ని మరియు కార్మికులకు సుఖాన్ని, వేదాలు దీవిస్తాయి. క్రింది కారణాలవల్ల పైన దీవెనలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి.
ఇది ఆసక్తికరంగా లేదా? శ్రీకృష్ణుడు గోవులను ఎంతగా ప్రేమించాడంటే అతనిని ‘గోవిందుడు’, ‘గోపాలుడు’ అని పిలుస్తున్నారు. కేవలం ఈ మాటలు ఉచ్చరిస్తేనే శ్రీకృష్ణుడు సంతోషపడతాడు. ఎవరైతే గోవులను పెంచి పాలిస్తారో వారిని వేదాలు దీవిస్తాయి. ఐశ్వర్యంతో, మీకు ‘ఇహము’ మరియు ‘పరము’ రెండూ ఉంటాయి.
అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఐశ్వర్యం సంపాదించటం. హిందూ విశ్వాసం ఒక సామాన్య మానవుని గురించి పట్టించుకుంటుందా అనే సంశయం కొందరికి. మీ అంతట మీరే నిర్ణయించుకోండి. వేదాలు నేర్చుకుని పఠించేవారికి ‘వేదాంతం’ యొక్క జ్ఞానంతో దీవించబడతారని అనేది ఒక వేదవాక్కు. కానీ వేదాంతాన్ని ప్రాపంచిక సుఖాలను ఇచ్చే ఐశ్వర్యంగా మార్చటం కష్టం కానీ గోవు ఆ రెంటీని ఇస్తుంది.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562