మెయిన్ ఫీచర్

కంటేనే అమ్మ అని అంటే ఎలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో తియ్యని పదం ‘అమ్మ’అనిపించుకోవటం. అలాంటి తియ్యనైన అమ్మతనాన్ని ఆస్వాదించాలనుకునే అతివలకు ఈ బిల్లు కన్నీళ్లను మిగులుస్తుంది. అమ్మతనాన్ని అంగట్లో సరుకుగా చేసి సరోగసీ వ్యాపారాన్ని మూడు పువ్వు లు ఆరు కాయలుగా సాగిస్తున్న ధనవంతులు, విదేశీయుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుపై అద్దెకడుపు అమ్మలు సైతం పెదవి విరుస్తున్నారు. తమను మరింత ఆర్థిక కష్టాలలోకి నెట్టేసిందని వాపోతున్నారు. ముఖ్యంగా పేద మహిళలు దీన్ని ఓ వృత్తిగా స్వీకరించి ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తున్నారు. ఇపుడు వారికి ఆశనుపాతంగా మారింది. దేశంలో రెండు వేల ఆసుప్రతులలో ఇది వ్యాపారంగా సాగు తుందనే సాకుతో కేవలం ధనవంతుల మహిళలు, విదేశీ మహిళలను నెపం గా చూపిస్తూ అమ్మతనాన్ని ఆస్వా దించాలనుకునే సగటు మహిళకు ఈ బిల్లు బోలెడంత దుంఖాన్ని మిగులుస్తోంది.
ఫ్యాషన్‌గా మారిన అమ్మతనం
అమ్మ అనిపించుకోవటానికి ఇపుడు చాలామంది విదేశీస్ర్తిలు, మనదేశంలోని ధనవంతులైన మహిళలు సరోగసీ పద్ధతిని అవలంభిస్తూ వ్యాపారమయం చేశారు. వాస్తవానికి కొంతమంది మహిళలకు గర్భం నిలవదు. గర్భధారణ జరుగుతుంది కానీ అబార్షన్ అవుతుంది. కారణాలు అనేకం. అటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో భార్య అండం, భర్త వీర్యం ఈ రెండూ కలిపి ప్రయోగశాలలో పిండోత్పత్తి జరుపుతారు. కణజాల రూపంలో ఉన్న ఈ పిండాన్ని ఆరోగ్యపరంగా ఏ సమస్యలూ లేని స్ర్తి గర్భంలోకి ప్రవేశపెడతారు. ఈమె నెలలు పూర్తయిన తరువాత డెలివరీ అవుతుంది. ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగించి కొంతమొత్తం తీసుకుంటుంది. ఈ బిడ్డపై తల్లికి ఎటువంటి హక్కు ఉండదు. ఇలా బిడ్డను తన గర్భంలో పెంచి ఇచ్చిన తల్లిని ‘‘సరోగేట్ మదర్’’ అని అంటారు. ఇది వ్యాపారంగానూ, ఫ్యాషన్‌గా మారటంతో మనదేశంలో దాదాపు 2మిలియన్ల డాలర్ల వ్యాపారం జరుగుతున్నట్లు అంచనావేశారు. ఇందులో 80మంది విదేశీయులే ఉండటం గమనార్హం. రష్యా, ఉక్రేన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి విదేశీ జంటలు ఇక్కడి సరోగేట్ మదర్ ద్వారా పిల్లల్ని కనిపించుకుని వెళుతున్నారు.
ఇలా పుట్టిన పిల్లలకు జపాన్ వంటి దేశాలలో లీగల్‌గా ఇబ్బందలు కూడా వస్తున్నాయి. గతంలో జపాన్‌కు చెందిన ఓ జంట గుజరాత్‌లో ఆరోగ్యవంతమైన బిడ్డను పొందారు. కాని
తదనంతర కాలంలో ఈ జంట విడాకులు తీసుకున్నపుడు ఈ చిన్నారి పెంపకం సమస్యగా వచ్చింది. చివరకు ఆ చిన్నారిని అమ్మమ్మ దగ్గర పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఓ ఆస్ట్రేలియా జంట చెన్నైలో సరోగేట్ మదర్ ద్వారా బిడ్డను పొందిన తరువాత రిక్షాపుల్లర్‌కు చెందిన భార్య చేతిలో కేవలం రూ.75, 000 చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. కనీసం ఒక్క పండు కూడా కొనిపెట్టలేదు. అలాగే ప్రసవ సమయంలో సరోగేట్ మదర్ చనిపోతే కనీసం ఆ ఇళ్లు దిక్కులేకుండా పోతుంది. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు భారతీయ సరోగేట్ మదర్స్ చవిచూశారు. గుజరాత్‌లో నారాయణ పటేల్ అనే వైద్యుడు దాదాపు వెయ్యిమంది సరోగేట్ తల్లులకు పురుడు పోశాడు. ఆకాంక్ష అనే ఆసుపత్రిలో 35 సంవత్సరాల మనీషా అనే సరోగేట్ మదర్ దాదాపు రూ.10 లక్షల ఇంటి రుణాన్ని తీర్చుకోవటమేకాదు, ఇంకా కొంత డబ్బును తన పిల్లల పేరుమీద వేసుకుని ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవిస్తోంది. ఇలా చాలా పేద మధ్యతరగతి మహిళలకు వరంగా మారటంతో వారంతా ఈ బిల్లుతో ఆర్థిక ఇబ్బందులను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మాతృత్వ మమకారం
కొందరికే పరిమితమా?

బిల్లులో పేర్కొన్నట్లు పిల్లలు లేని దంపతులు తమ సమీప బంధువుల ద్వారా సరోగసీ విధానంతో పిల్లల్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఎంతమందికి దగ్గర బంధువులు ఆదుకునే వారుంటారు. ఒకవేళ అటువంటి బంధువులు లేని దంపతులకు పిల్లలు కూడా లేకుండా చేస్తారా? అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.
సంతానం లేని దంపతులు సంతానం పొం దటం హక్కుగా పరిగణించాలని మానవహక్కుల సంఘాలు కోరుతున్నాయి. నిస్వార్థంతో అమ్మతనాన్ని ఆస్వాదించే మహిళలకు, అందించే మాతృ మూర్తులకు మనదేశంలో కొదవలేదు. అటువంటివారికి ఈ బిల్లు అడ్డంకిగా మారుతోంది.
సరోగేట్ మదర్‌కు న్యాయపరంగా ఎలాంటి హక్కులు ఈ బిల్లులో పొందుపరచలేదు. శారీరకంగా, మానసికంగా ఆమె పొందే భావోద్వేగాలను సైతం పరగణలోకి తీసుకోలేదు.
సహజీవనం చేసే జంటలకు, అలాగే జీవితాంతం ఒంటరిగా జీవిస్తూ..ఎవరిద్వారానైనా ఓ బిడ్డను పొంది తద్వారా ఆ బిడ్డకు సంరక్షకులుగా ఉండాలనుకోవటం తప్పా?
విడాకులు తీసుకున్న జంటలకు ఈ బిల్లు ద్వారా దురదృష్టం వెంటాడుతోంది.
భర్తగానీ భార్యగానీ పోయినవారికి సరోగసీ ద్వారా సంతానాన్ని పొందాలనుకోవటం నేరమా?
స్వలింగ సంపర్కులకు సంతానం పొందే అర్హత లేకుండా చేసింది.
పేద దంపతులకు సంతానప్రాప్తి లేకపోతే వారికి జీవితంలో బిడ్డలను పొందే అవకాశం లేకుండా చేసింది ఈ బిల్లు.
ఇండియాలో పుట్టి విదేశాలల్లో స్థిరపడిన దంపతులు సంతానం లేకపోతే ఇక వారికి సంతానం పొందే భాగ్యమే ఈ బిల్లు కల్పించలేకపోతుంది. ఎందుకంటే వారు విదేశీ పౌరులు అవటం వల్ల వారు తమ అక్క, ఇతర బంధువుల సహాయంతో పిల్లల్ని కనిపించేకునే అదృష్టం వదులుకున్నట్లే.
విడాకులు తీసుకున్న దంపతులకు అంతకుముందు వారికి ఒక సంతానం ఉన్నట్లయితే ..అలాంటివారు మరో సంతానాన్ని పొందాలనుకుంటే ఎలాంటి వివరణ ఈ బిల్లులో పొందుపరచలేదు.
సంతానలేమికి పరిష్కారం దత్తత పొందటమే మార్గం అని సూచించటం జరిగింది. కాని దత్తత సమస్యలను పరిష్కరించే శ్రద్ధ ఈ బిల్లులో కనబరచలేదు.

హిందీ సినీ పరిశ్రమలో
చాలామంది నటులు సరోగసీ ద్వారానే సంతానాన్ని పొందారు. అమీర్‌ఖాన్, కిరణ్‌రావు, షారూక్‌ఖాన్, గౌరీ, సొహాయిల్ ఖాన్, సీమాఖాన్ వంటివారు ఈ పద్ధతిలో సంతానం పొందారు. తాజాగా టాలీవుడ్ నటుడు
మోహన్‌బాబు కుమార్తె లక్ష్మి ఈ పద్ధతినే అనుసరించి తల్లి అయింది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయిల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

-టి. ఆశాలత