మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాభ్యాసము నాటినుండియు- చిన్ననాటినుండియు- సహనము నలవరచుకొనవలయునని మనకివి తెలుపుచున్నవి. మానవులకు సహనమే ముఖ్యమైన సుగుణము.
405. ఆ కమ్మరివాని దాగలిని జూడుము,- దానిని సమ్మెటతో నెట్లు కొట్టుచున్నారో కనుము! ఐనను ఇసుమంతయు అది కదలుటలేదే? శాంతిని, ఓరిమిని మానవులీ దాగలినుండి నేర్చుకొందురుగాక!
406. నీ భక్తి విశ్వాసములను, మనోభావములను రహస్యముగ నుంచుకొనుము. నలువురియెదుటను వానిని వెల్లడిచేయకుము. చేసితివేని నీకు గొప్ప నష్టము వాటిల్లును.
407. నరుడు తన పారమార్థిక సాధనలను ఎంత గోప్యముగ నుంచిన నంత శ్రేయస్కరము.
వినయము: ఆత్మగౌరవము
408. అహంభావమునకు పతనమే ఫలము. కాకిని జూడుడు. - అది తా నెంతయో బుద్ధిశాలిననుకొనును. అది యెన్నడును వలలో చిక్కదు. ఏమాత్రము అపాయము కాన్పించినను తప్పించుకొనిపోవును. కడు నేర్పుతో దొంగిలించి మేత సంపాదించుకొనును. కాని, పాపము, ఆ జంతువు అశుద్ధము తినక తప్పదయ్యె! మితిమీఱిన దాని తెలివితేటలకిది ఫలము! వంచనకిదియే పర్యవసానము!
409. ఘనతను బొందవలయుననిన వినయముగలిగి యుండవలయును. ధరద్వాజపక్షి యొక్క గూడు క్రిందుగా నేలదాపుననే యుండును. కాని యది యెంతయెత్తున కెగురునో చూడుడు. మిట్టనేల వ్యవసాయమునకు పనికిరాదు; అందులకై వలయు నీరు నిలుచుటకై పల్లపునేలయే కావలయును. (అటులనే గర్వముచే మిట్టిపడు హృదయము సాధనకు పనికిరాదు. చూ.412.)
410. పండ్లచే భారవంతమైన ఎట్లెప్పుడు వంగియుండును. నీవు ఘనుడవు కాదలచెదవేని (వీనివలె) అడకువ గలిగియుండుము.
411. గౌరవసూచకముగా ఇతరులు కేవలము తలవంచునెడల మనము సాగిలబడి పూజింపవలయును. ఇదియే మన ధర్మము.
412. ‘‘నేనుపన్యసించుచున్నాను, కావున మీరందఱును వచ్చి వినవలయును’’అని యహంభావముచెందు ప్రచారకునివలె మనము అహంభావము పొందరాదు. అహంభావమునకు నిలయము అజ్ఞానము. జ్ఞానాగ్నియందది నిలువజాలదు. ఎవ్వడు అహంకార రహితుడో, నిష్కపట చిత్తుడో, వానికే జ్ఞానలాభముగలుగును. వాననీరు పల్లపు నేలలందు నిలుచును, మిట్టనుండి కొట్టుకొనిపోవును. (మిట్టిపడువారి హృదయమునుండి జ్ఞానము కొట్టుకొనిపోవను. (చూ.105, 409.)
413. తక్కెడలో భారవంతమైన సిబ్బి క్రిందికిబోవ తేలికయైనది పైకిలేచును. నిపుణుడును సమర్థుడును ఎప్పుడును అణకువ కలిగియుండును: మూర్ఖుడో, మిట్టిపడుచుండును. (చూ.462)
414. పెనుగాలిచే గొనిపోవబడు పులివిస్తరివలె గర్వశూన్యుడవై యుండుము. (చూ.525.)
415. సూదిలోదారము ఎక్కింపదలతువేని, సరిగాలేని పోగులను తొలగించి, దారమును కొనతేలునటుల పేనవలయును. అప్పుడు దారము సులభముగా సూది బెజ్జములోనికెక్కగలదు. నీ మనోబుద్ధులను భగవంతునిపై ఏకాగ్రము చేయగోరెదవేని, కకావికలగు కోరికలను తొలగద్రోసి, అహంకారమును వీడి, వినమ్రుడవై దీనభావము వహింపుము.అపుడు నిశ్చలముగా దేవునిపై చిత్తమునుంచుము. సర్వ భారాన్ని భగవంతునిపై నిలిపినపుడు మాత్రమే అపారకరుణాంతరంగునిపైన మనస్సు నిలుస్తుంది.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి