మెయిన్ ఫీచర్

తొలిగురువు మాతృమూర్తే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు ముక్తకంకఠంతో తల్లియొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. ‘నాస్తి మాతృ సమో గురుః’- మాతృమూర్తితో సమానమైన గురువు ఎవ్వరూ లేరని వక్కాణించారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే సూక్తిలో మొదటగా తల్లినే పేర్కొన్నారు. ఎందుకంటే తల్లి నుంచి బిడ్డలకు లభించే ప్రేమ, మమకారం, ఉపదేశం, ఉపకారం మరెవరినుంచీ లభించదు.
అసలు తల్లి గర్భంలోనే శిశువు వున్నప్పటినుంచే శిశువు యొక్క ఆలనా పాలనా మొదలవుతుంది. పుష్టికరమైన ఆహారం తింటూ, ఆరోగ్యకరమైన ఆలోచనలతో ఉంటూ తనకు పుట్టబోయే బిడ్డ గురించి ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మనకు పురాణాలలో ఎన్నో దృష్టాంతరాలు కన్పిస్తాయి. సుభద్రాదేవి గర్భములో అభిమన్యుడు పద్మవ్యూహ ఛేదనాన్ని నేర్చుకోవడం, అష్టావక్రుడు వేదవేదాంగాలు నేర్చుకోవడానికి కారణం వారి తల్లుల దినచర్య, ఆలోచనల ప్రభావం మూలంగానే జరిగింది.
పిల్లలకు యుక్తవయస్సు వచ్చేవరకు తల్లి యొక్క పర్యవేక్షణలోనే పెంపకం ఉండాలి. అప్పుడే వారికి మంచి భవిష్యత్ కలిగి ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు.
తల్లి తన పిల్లలకు చిన్నప్పటినుంచీ గురువుగా తన బాధ్యతలు నెరవేరుస్తుంది. మాటలు వచ్చేటప్పుడు స్పష్టంగా మాట్లాడేటట్లు నేర్పుతుంది. ప్రతి మాటకు ఉచ్ఛారణ స్థానమేదో తెలియజేస్తుంది. హ్రస్వాలు, దీర్ఘాలు, వత్తులు ఎలా పలకాలో నేర్పుతుంది. అక్షరాలను, పదాలను, వాక్యాలను వేరు వేరుగా ఎలా పలకాలో నేర్పుతుంది. తండ్రితో, తనతో, పెద్దవారితో, చిన్నవారితో, తనతోటి సావాసగాళ్ళతో ఎలా సంభాషించాలో నేర్పుతుంది. వారితో ఎలా కలిసిమెలిసి ఉండాలో, ఎవరిదగ్గరగా కూర్చోవాలో, ఎవరికి దూరంగా కూర్చోవాలో నేర్పుతుంది. పెద్దలవద్ద అనుచితంగా ప్రవర్తిస్తే ఎటువంటి ప్రమాదాలు వస్తాయో తెలియజేస్తుంది. వ్యర్థమైన చేతలు, అకారణంగా ఏడవటం, వెకిలిగానవ్వడం, ఈర్ష్యాద్వేషాలు, పంతాలు, పట్టింపులు, గొడవలు, చాడీలు-ఇలాంటి విద్వేషాలకు లోనుకాకుండా చూస్తుంది. సదా మంచి బుద్ధి, శౌర్యం, ధైర్యం, అందరితో కలిసిపోయి జనించే సద్గుణాలు పిల్లలకు అబ్బేటట్లు తల్లి నేర్పుతుంది. చదివించడంలో, లాలించకుండా దండించకుండా, అదిరించి బెదిరించి సుశిక్షితులను చేస్తుంది. గారాబం చేస్తే చెడిపోతారు. అందుకే భయపెట్టి చదువు నేర్పినా మనస్సులో మాత్రం ప్రేమ ఉంచుకుంటుంది. చిన్నప్పటినుంచే నిండైన వస్తధ్రారణ, మన సంస్కృతి సంప్రదాయాలపట్ల అభిరుచిని అలవాటు చేస్తుంది. ఆడవారైనా, మగపిల్లలైనా వారికి శీలానికి వున్న విలువ, ప్రాధాన్యత వివరిస్తుంది.
ఈ విధంగా మంచి మాతృమూర్తి పెంపకంలో పెరిగిన పిల్లలు సానబెట్టిన వజ్రాలవలె ప్రకాశిస్తూ మన దేశమునకు గౌరవం, కీర్తి ప్రతిష్ఠలు సాధించి పెడతారనడంలో ఎటువంటి సందేహం లేదు.

- జన్నాభట్ల నరసింహప్రసాద్