మెయిన్ ఫీచర్

చేయాల్సింది చేయకనే అసహనం( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నాతో విసిగిపోయిన నేను నిస్సారమని తెలుసుకున్నాను... ఇప్పుడేం చెయ్యాలి?’’అని నన్ను అడిగావు. అది ఒక గొప్ప ఆవిష్కరణ. అవును, నా భావన అదే. చాలా కొద్దిమంది మాత్రమే తాము చాలా విసిగిపోయామని తెలుసుకుంటారు. అది శుభారంభమే. తమ గురించి తప్ప, అది అందరికీ తెలుసు. ఇప్పుడు మనం కొన్ని అంతర్భావాలను అర్థం చేసుకోవాలి.
చిరాకుపడుతూ విసుక్కునే ఏకైక జంతువు కేవలం మనిషి మాత్రమే. అది మనిషికున్న ఒక గొప్ప ప్రత్యేకమైన హక్కు, మనుషులు ప్రదర్శించే దర్జాలో ఒక భాగం. విసుక్కునే గాడిదలను, దున్నపోతులను మీరెప్పుడైనా చూశారా? అవి ఎప్పుడూ విసుక్కోవు. విసుగు అంటే మీరు జీవించే తీరు సరిగాలేదని అర్థం.
‘‘నాకు చాలా విసుగ్గా ఉంది. అది పోవాలంటే ఏదోఒకటి చెయ్యాలి’’అనుకుంటూ మీరు ఏదో ఒకటి చేస్తారు. చివరికి అది ఒక గొప్ప సంఘటనగా మారవచ్చు. కాబట్టి, మీ విసుగును తప్పుగా భావించకండి. చక్కని శుభారంభానికి అది ఒక మంచి సంకేతం. కానీ, అక్కడే ఆగిపోకండి.ఎవరైనా ఎందుకు విసుక్కుంటారు? ఇతరులు మోపిన మృత విధానాలలో జీవిస్తున్న ఎవరికైనా విసుగ్గానే ఉంటుంది. వాటిని త్యజించి బయటపడి మీకుమీరుగా జీవించడం ప్రారంభించండి. అంతర్గతంగా మీరు చెయ్యాలనుకున్నది ముఖ్యం కానీ, డబ్బు, అధికారం, ప్రతిష్ఠలు ముఖ్యంకాదు. కాబట్టి, ఫలితాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మీరు చెయ్యాలనుకున్నది చెయ్యండి. అప్పుడే మీ విసుగుపోతుంది. ఇతరుల అభిప్రాయాల ప్రకారం మీరు కూడా వారిలాగే అన్నీ సరిగాచెయ్యాలి. అదే మీ విసుగుకు మూల కారణం.
మనుషులందరూ చిరాకుపడుతున్నారు. ఎందుకంటే, మార్మికుడుగా ఉండవలసిన వ్యక్తి గణిత శాస్తవ్రేత్తగా, గణిత శాస్తవ్రేత్తగా ఉండవలసిన వ్యక్తి రాజకీయ నాయకుడుగా, కవిగా ఉండవలసిన వ్యక్తి వ్యాపారవేత్తగా ఉంటున్నాడు. ఇలా అందరూ ఎక్కడో ఉంటున్నారే కానీ, ఎవరూ తమకుతాముగా లేరు. కాబట్టి, ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పుడే మీ చిరాకు అదృశ్యమవుతుంది.
‘‘నాతో విసిగిపోయిన నేను నిస్సారమని తెలుసుకున్నాను... ఇప్పుడేం చెయ్యాలి?’’అని నన్ను అడిగావు. నిజమే, నువ్వు నీతో విసిగిపోయావు. ఎందుకంటే, నీపట్ల నువ్వు గౌరవంతో, చిత్తశుద్ధితో, నిజాయితీగా లేవు. అప్పుడు నీ శక్తి నీకెలా తెలుస్తుంది? నువ్వు చెయ్యాలనుకున్నది చేసినప్పుడే- అది ఏదైనా, ఎలాంటిదైనా కావచ్చు- నీలో ఉన్న శక్తి ప్రవహిస్తుంది.
‘‘వినె్సంట్ వాన్‌ఘోష్’’వేసిన చిత్రాలను ఎవరూ మెచ్చుకునేవారు కాదు. అందుకే వాటిలో ఒక్కటికూడా అమ్ముడుకాలేదు. అయినా అతడు హాయిగా చిత్రాలు వేసేవాడు. అతని దరిద్రాన్ని చూడలేని అతని సోదరుడు అతనికి కొద్దిగా ఆర్థిక సహాయం చేసేవాడు.
ఆ డబ్బుతో అతడు వారానికి మూడురోజులే తిని, నాలుగురోజులు ఉపవాసముండి మిగుల్చుకున్న డబ్బుతో రంగులు, కుంచెలు కొనుక్కునేవాడు. అయినా అతడు ఆనందంగా ఉండేవాడు. ఎందుకంటే, అతనిలో అతని శక్తి ప్రవహిస్తోంది.
అతడు తన ముప్పై మూడవ ఏట ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కానీ, మీరనుకుంటున్న జీవితంకన్నా అతని ఆత్మహత్య ఎంతో మెరుగైనది. ఎందుకంటే, తాను ఎప్పటినుంచో వెయ్యాలనుకుంటున్న ‘‘సూర్యాస్తమయ’’చిత్రాన్ని పూర్తిచేసిన తరువాత అతడు ‘‘నా పని ముగిసింది. నాకు చాలా సంతృప్తిగా ఉంది. చాలా హాయిగా నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను’’అంటూ ఒక లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.