మెయిన్ ఫీచర్

సౌహార్ద్ర వంతెనే.. గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టిన ప్రతి ప్రాణికి మొదటి గురువు అమ్మ. మనుషుల్లోనయితే కొంచెం ప్రాయం వచ్చాక బుడిబుడి అడుగులతో, నాన్న చిటికెనవేలు పట్టుకుని నడుస్తూ, బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు. ఐదేళ్ళు దాటగానే, అక్షరాభ్యాసం కోసం గురువు దగ్గరకువెళ్లి అ ఆ, ఇ, ఈలతో మొదలుపెట్టి ప్రపంచానే్న తెలుసుకోగలిగినంత జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు.
అమ్మ, నాన్న, ఉపాధ్యాయుడు మొదటిశ్రేణి గురువులు. చదువయ్యాక, ఉద్యోగంలో ప్రవేశించి, చదువుకు అనుభవం జోడించి, బ్రతుకు బడికి అవసరమైన పాఠాలు నేర్చుకోవటంతో రెండవ శ్రేణి గురువుల ఆవశ్యకత మొదలవుతుంది.
ఉద్యోగంలో చేరాక, పైఅధికారి, సహోద్యోగులు మరియు తన క్రింద పనిచేసేవారు (సబ్-ఆర్డినేట్స్) వీరందరి దగ్గరనుండి నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉంటాయి. మరోవిధంగా చెప్పాలంటే ఉద్యోగంలో చేరిన మొదటిరోజు నుండి, రిటరయ్యే వరకూ, నిరంతర అవగాహనతో నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో!
జీవనోపాధికి, జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవటానికి, తోటివారితో మరియు తన క్రింది వారితో కలిసిమెలిసి మెలగటానికి ఉద్యోగం ఎన్నో పాఠాలు నేర్పుతుంది.
సి.ఏ చదువు అవగానే, నా మొదటి ఉద్యోగంలో నేర్చుకున్న పాఠాలు ఎంతో అమూల్యమైనవి మరియు అపురూపమైనవి కూడా. నా పైఅధికారి భమిడిపాటి గణపతిశాస్ర్తీగారు (బి.జి.శాస్ర్తీగారు). శాస్ర్తీగారిని పైఅధికారి అనే బదులు ‘పితృతుల్యులు’ అనటం సబబు. క్రొత్త వాతావరణం, క్రొత్త ఉద్యోగం, ఇదివరకు చూడని పరిసరాలు- అన్నీ క్రొత్తే!
వారు నా యెడ ఎంతో వాత్సల్యం కనబరుస్తూ, ప్రతి విషయాన్ని విపులంగా, విడమర్చి సోదాహరణంగా చెప్పేవారు. వారివద్ద నేను ఉద్యోగానికే కాదు; జీవితానికి కూడా పనికివచ్చే పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. మరోవిధంగా చెప్పాలంటే, వారివద్ద ఉద్యోగం చేయగలగటం నా అదృష్టం అని గర్వంగా చెప్పుకోగలను.
నేను వారి సహచర్యంలో నేర్చుకున్న పాఠాలు.. టూకీగా-
* నీవు చేస్తున్న పనిలో నాణ్యత (క్వాలిటీ) ముఖ్యం. నాణ్యతలో ఎప్పుడు కాంప్రమైజ్ కావద్దు.
* నీవు చేస్తున్న పనిలో నాణ్యత కనబర్చాలంటే సరియైన సాధనాలు / పనిముట్లు (టూల్స్) తప్పనిసరి. కంప్యూటర్‌తో చేయాల్సిన పనిని కాలిక్యులేటర్‌తో సరిపెట్టుకోవద్దు. క్యాలిక్యులేటర్‌తో చేయగలవేమో.. కాని ఎక్కువ సమయం పడుతుంది.
* చేస్తున్న పనిలో వందశాతం నిర్దిష్టత కంటే వందశాతం సమయపాలన అతి ముఖ్యం.
* నీ పైఅధికారుల యెడ ఎంత వినయం, విధేయత కనబర్చుతావో, అంతే వినయ విధేయతలు నీ క్రిందివారి (సబ్ ఆర్డినేట్స్) యెడ చూపించు. అప్పుడప్పుడు వారి కుటుంబ క్షేమసమాచారాలు కనుక్కుంటుండు. వీలైనంత సాయం చేయటానికి ప్రయత్నించు. నీ క్రిందివారికి నీకు మధ్య సౌహార్ద్రపూర్వక వంతెన (బ్రిడ్జ్)ను ఏర్పర్చుకో.
* ఒక ఉద్యోగిగా నీవు ఖర్చుచేస్తున్న ‘వనరులు’ నీవి కావు. కనుకనే నీ స్వంత వనరులు ఖర్చుచేస్తున్న దానికంటే రెట్టింపు జాగ్రత్త వహించు.
* గ్రూప్ డిస్కషన్‌ల్లోగాని, నీ క్రిందివారికి వివరించేప్పుడుగాని నీకు తెలిసి ఉండటం ముఖ్యంకాదు, ఎదుటివారికి తెలిసేట్లు చెప్పడం ముఖ్యం. ఎదుటివారు కార్మికులు, చిరుద్యోగులు అయితే వారి స్థాయికి దిగివచ్చి చెప్పు.
* నీకు నీ ఉద్యోగం ఎంత ముఖ్యమైన అవసరమో, నీ యజమానికి నువ్వు అంత అవసరం. చెప్పా పెట్టకుండా, ఉద్యోగంలోంచి తీసేసారని కొందరు యజమానుల మీద నింద మోపుతుంటారు. ఎవరికీ ఎవరితోనూ వ్యక్తిగత కక్షలుండవు. నిన్ను క్షోభపెట్టే ఉద్దేశం యజమానికి ఎప్పుడూ ఉండదు.
* నీ కాంట్రిబ్యూషన్‌ను ఎవరూ గుర్తించటం లేదా? ఫర్వాలేదు, నీ అంతరాత్మ గుర్తిస్తే చాలు. కాలానుగుణంగా నీ ప్రతిభ ఏనాడో ఓనాడు తప్పక గుర్తించబడుతుంది.
శాస్ర్తీగారికి ఇప్పుడు 91 ఏళ్ళు. వయసుకంటే మెరుగైన జ్ఞాపశక్తితో, ఎప్పుడు కలిసినా, మాటాడినా మొదటిరోజు కలిసినపుడు కనబర్చిన ఆప్యాయత, ఆదరణతో పలుకరిస్తారు. పేరు పేరునా, నా పిల్లలు, వారి పిల్లల క్షేమసమాచారం కనుక్కుంటారు.
ఈ పావన గురుపూర్ణిమ సందర్భంగా వారు నిండు నూరేళ్ళూ, పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండి నా లాంటి శిష్యకోటికి ఆనందం చేకూర్చాలని ఆ పరాత్పరుని ప్రార్థిస్తూ.. వందనాలర్పిస్తూ..

- కూర చిదంబరం 8639338675