మెయిన్ ఫీచర్

నైషధమ్ (హంస దౌత్యం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిషధ దేశాధిపతి అయిన ‘వీరసేన మహారాజు పుత్రుడు, బుద్ధిమంతుడు, పుణ్యశ్లోకుడు అయిన ‘నల మహారాజాకు’ ఈ దమయంతి భార్య. అట్టి నలమహారాజు జూదంలో తన సోదరుని చేత ఓడింపబడి రాజ్యాన్ని కోల్పోయి, ఈ సుకుమారి దమయంతితో కలిసి ఎవరికీ తెలియకుండా నగరాన్ని విడిచివెళ్ళాడు. విదర్భ ప్రభువు వీరిని వెదకటానికై నలుదిక్కులకు బ్రాహ్మణులను పంపించాడు. ఈ సుకుమారి దమయంతికోసం భూమి అంతటా తిరుగుతున్నాము.
నేను ఇచ్చటికివచ్చి మీచే కాపాడబడుచున్న ఈ కోమలి దమయంతిని చూచాను. మేం వెదకుచున్న ఈ దమయంతి మీ పుత్రుని మందిరంలో కనపడింది. మనుషులలో ఈమెతో సమామైన రూపలావణ్యంగల స్ర్తి మరొకతె లేదు. ఈమె కనుబొమల మధ్య ఐశ్వర్యప్రదమైన చిహ్నంగా బ్రహ్మదేవుడు సృష్టించిన పుట్టుమచ్చ దుమ్ముచేత కప్పబడి ఉండటం పరిశీలించి చూచి ఈమెను మా రాకుమారిగా గుర్తింపగలిగాను. పుటం పెట్టని ముడి బంగారంలా ఈమె ప్రకాశిస్తోంది. శరీరం మలినంగా ఉన్నప్పటికీ ఆమె భూమధ్యలోఉన్న పుట్టుమచ్చయే ఆమె ఔన్నత్యాన్ని సూచిస్తోంది.’’ అని వివరింపగా
ఆ మాటలు విన్న సునంద మంచినీళ్ళను తెప్పించింది. దమయంతి కనుబొమల మధ్య కప్పబడియున్న మలినాన్ని తొలగించి శుభ్రపరిచింది. మాలిన్యాన్ని తొలగించడంతో ఆకాశంలో మబ్బులు తొలగిన తరువాత భాసించే చంద్రునివలె ఆ పుట్టుమచ్చ సుస్పష్టంగా ప్రకాశించింది.
రాజమాత, సునంద దమయంతి భ్రూమధ్య ఉన్న పుట్టుమచ్చను చూచి దుఃఖిస్తూ ఆమెను ఆలింగనం చేసికొని క్షణకాలం అలాగే ఉన్నారు. తదుపరి రాజమాత కన్నీరు తుడుచుకొన్నది. దమయంతిని చూచి
‘‘తల్లీ! నీవు నా చెల్లెలి కుమార్తెవు. ఈ పుట్టుమచ్చతో గుర్తించగలిగాను దమయంతీ! నీవుగూడా నా కుమార్తెవే సుమా! నేను, నీ తల్లి ‘దశార్థదేవాధిపతి అయిన ‘‘సుదాముని’’పుత్రికలము. నీ తల్లిని విదర్భ దేశపు రాజైన భీమరాజుకు ఇచ్చి చేయగా, నేను చేధి దేశపు ప్రభువైన ‘వీరబాహుడికి’ సతినయ్యాను. నీవు పుట్టినప్పుడు దవార్ణదేశంలో మా తండ్రిగారింట్లో నిన్ను నేను చూచాను. అమ్మా! దమయంతీ! నీకు నీ తండ్రిగారిల్లు ఎట్లాంటిదో నా గృహంకూడా అట్లాంటిదే. ఈ ఐశ్వర్యాన్నంతా నీదిగానే భావింపుము’’అని అనునయిస్తూ అన్నది.
దమయంతి సంతోషంతో తన పినతల్లి అయిన రాజమాతకు పాదాభివందనం చేసింది. తనకు నమస్కరించిన సునందను లేవనెత్తి కౌగలించుకొన్నది. లాలించింది. తదుపరి రాజమాతను చూచి
‘‘అమ్మా! నేనెవరినో తెలియనప్పటికినీ మీరు నాకు సుఖప్రదమైన ఆశ్రయాన్ని కల్పించారు. సర్వవిధాలా నా కోర్కెను మన్నించారు. నాకు రక్షణ కల్పించారు. అమ్మా! ఇక్కడ ఉండటం నాకెంతో సుఖదాయకం. సందేహం లేదు. నేను చాలాకాలంనుండి బర్తృపుత్ర వియోగంతో ఉన్నాననే విషయం మీకు తెలిసిందేగదా? నా కుమార్తె, కుమారుడు, తాతగారింట విదర్భలో ఉన్నారు. తండ్రిగారి వియోగంతో దుఃఖిస్తున్నారు. నేనుగూడా దూరమయ్యానుగదా? ఇప్పుడు ఆ చింత తీరింది గాబట్టి, నాకు ప్రియాన్ని కలిగించదలచుకొంటే, నన్ను శీఘ్రంగా విదర్భ చేర్చటానికి ఆదేశించండి. నేను అక్కడికి వెళ్ళాలనుకొంటున్నాను’’ అని అన్నది.
అంత రాజమాత విషయాన్నంతా తన కుమారుడైన ‘సుభాహుకుడికి వివరించి చెప్పింది. సుబాహుడు కూడా అంగీకరించాడు. దమయంతిని విదర్భ పంపటానికి తగిన ఏర్పాట్లను చేశాడు. దమయంతితో వెళ్ళడానికి అసంఖ్యాకమైన పరిజనాన్ని, రక్షకబలాన్ని సిద్ధంగావించాడు.
తదుపరి కావలసిన మంచి భోజన పదార్థాలను సిద్ధంచేయించి పరివారంతో సహా దమయంతిని ‘మేనా’మీద విదర్భకు సాగనంపింది రాజమాత. పినతల్లి అయిన రాజమాతకు పాదాభివందనంచేసింది.

- ఇంకాఉంది