మెయిన్ ఫీచర్

నలచరిత్రలో అంతరార్థాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే నా పరిశీలనా ఫలితాలను పాఠకుల పాదాలముందు సమర్పించుకుంటున్నాను.
‘‘మహాత్ముడైన శ్రీహర్షుడికీ, పరిశోధకులైన గుంటూరువారికీ, కనిపించిన శ్రీవిద్య మీకెందుకు కనిపించలేదు?’’అని ఎవరూ చర్చించవలసిన పని లేదు.
నలచరిత్రలో శ్రీవిద్య లేదని నేను అనటంలేదు. అది అక్షవిద్యలో అంతర్భాగమే. శ్రీమాత -‘‘అకారాది క్షకారాంత మాతృకావర్ణ రూపిణీ’’అని లలితాసహస్ర నామనిర్దేశం కదా! అదీగాక, దమయంతి దగ్గర దేవీ ఉపాసన వుండే వుంటుంది. దాన్ని ఆధారంగాచేసుకొని శ్రీహర్షాదులు ఈ కథలో మంత్రశాస్త్ర రహస్యాలను కలిపి వుంటారు. కానీ, ఈ నలచరిత్రకు సారాంశం అశ్వాక్షహృదయ విద్యాద్వయమేననీ, ఈ కథకు ఫలితాంశం కలిదోష హరణమేననీ, వ్యాస హృదయంగా కనిపిస్తోందని మాత్రమే మనవి చేస్తున్నాను.
శ్రీ హర్షాదులు కవులు గనుక, కథలోని ఏక దేశాన్ని మాత్రమే స్వీకరించి రసమయం చేశారనీ, నేను మాత్రం వ్యాసుడి కథనం మొత్తాన్ని జీర్ణించుకునే ప్రయత్నం చేస్తున్నాననీ కూడా మనవి చేస్తున్నాను.
ఉభయ మీమాంసాశాస్త్రాలలో షడ్విధలింగ నిరూపణమనే ప్రక్రియ ఒకటి వుంది. లోకంలోగానీ, వేదంలోగానీ, ఏదైనా ఒక ఘట్టంయొక్క తాత్పర్యమేమిటని నిర్ణయించవలసి వస్తే-
‘‘ఉపక్రమోపసంహారౌ అభ్యాసో‚పూర్వతా ఫలమ్!
అర్థవాదోపపతీ చ షడ్భిస్తాత్పర్య నిర్ణయ.॥
- అని చెప్పారు.
అంటే, 1.ఉపక్రమోపసంహారాల సమన్వయం 2. పునరుక్తి 3. విషయంలోని క్రొత్తదనం 4. దాని ఫలితం 5. దానికోసం చెప్పే ఉప కథలు. 6. దాని హేతుబద్ధత- అనేవే తాత్పర్య నిర్ణాయకాలని భావం. ఈ షడ్విద్ధ తాత్పర్యలింగాలలో మొదటి ఐదూ పురాణంలో సూటిగానే కనిపిస్తున్నాయి.
ఆరవదైన హేతుబద్ధతను మనం శబ్దనిరుక్తుల ద్వారా చర్చించుకొని వున్నాం. కనుక, మీమాంసా శాస్త్ర మర్యాదప్రకారం గూడా, ఈ కథలో ఇతరాంశాలు వున్నా, తాత్పర్యం మాత్రం విద్యాద్వయోపదేశము, కలిదోష నివారణము- అనేవి మాత్రమేనని గూడా మనవి చేస్తున్నాను.
అందుకే-
కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనమ్‌॥
అంటూ, వ్యాసప్రోక్త మహామంత్రాన్ని మరోసారి పునశ్చరణ చేస్తూ, ఈ వ్యాసాన్ని ముగిస్తున్నాను. ***

సమాప్తం