మెయిన్ ఫీచర్

సహించే తత్త్వమే తితిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము అనేవి షట్సంపత్తులు. వైరాగ్య ప్రవృత్తి, అంతరేంద్రియ సముదాయమైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారములను నియంత్రించి కామక్రోధాదులను అరికట్టి శాంతిని సమకూర్చును. ఇదియే శమము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను తెలిపే ఐదు జ్ఞానేంద్రియముల నిగ్రహమే దమము. అంతఃకరణ శుద్ధిని శాంతమనస్కుడై సాధించిన వ్యక్తియే దాంతుడనబడును. స్వధర్మ అనుష్ఠానమే ఉపరమ అని తత్త్వబోధ గ్రంథంలో ఆచార్యులవారు నిర్వచించారు. కావున, స్వధర్మ నిరతియే ఉపరముగా పరిగణింపబడుతుంది. తితిక్ష అనగా శీతోష్ణములను, సుఖదుఃఖములను, జయాపజయములను సహించే గుణము. గురువులు బోధించిన వాటిపైన, వేదాంతము తదితర శాస్త్ర వాక్యములపైగల విశ్వాసమే శ్రద్ధ. చిత్త ఏకాగ్రతయే సమాధానము. ఉమదమాది షట్కములను పొందిన వ్యక్తియే మోక్షేచ్ఛ కలిగినవాడగును. అందువలన, వివేకము, శమదమాది సంపత్తులు జిజ్ఞాసువునకు అనివార్యము.
20. బ్రహ్మసత్యం జగన్మిథ్యే త్వేవంరూపో వినిశ్చయః
సో‚ యం నిత్యానిత్య వస్తువివేకః సముదాహృతః॥
త్రికాలములలో ఉండే బ్రహ్మమే సత్యమైనది. ప్రపంచము భ్రమను కలిగించే మిథ్యారూపము. ఇట్టి దృక్పథమే నిత్యానిత్య వివేకము.
మిథ్యారూపములు అనిత్యమైనవి. ఎడారి ప్రదేశములో జలాశయము ఉన్నదని భ్రమకలిగిస్తుంది మృగతృష్ణ. స్వప్నావస్థలో చూచిన దృశ్యాలు, వినిన మాటలు జాగ్రదవస్థకు వచ్చిన వెంటనే కరిగిపోతాయి. అట్టి భ్రమను కలిగించేవి అసద్వస్తువులు. సర్వదా ఉండే బ్రహ్మపదార్థమే సత్యమైనది. తత్కారణంగా నిర్మితమైనది యావద్విశ్వం. కార్యరూపమైన జగత్తులో కన్పించే దృశ్యములు, వినిపించే శబ్దములు సమస్తమూ నశించే గుణము కలవే. ‘‘యత్ దృశ్యతే తత్ నశ్యతే’’. ఇట్టి నిశ్చయాత్మక బుద్ధికల్గి ఉండుటమే నిత్యానిత్య వివేకము.
21. తద్వైరాగ్యం జుగుప్సా యా దర్శనశ్రవణాదిభిః
దేహాది బ్రహ్మపర్యనే్త హ్యనిత్యే భోగ్యవస్తుని॥
ఈ జగత్తులో భోగ్యవస్తువులు ఎన్నియో ప్రత్యక్షముగ కార్యరూపములో కన్పడుతున్నవి. ఇవన్నియు సత్యములే. ప్రకృతి, ప్రకృతితోపాటు హిరణ్యగర్భుని (ప్రజాపతియొక్క) శరీరము కూడ అశాశ్వతమైనదేనని వేదవాక్యములు తెలియజేస్తున్నవి. ‘‘పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్’’అని తత్త్వవిచారణ చేసిన మహాత్ముల బోధనలు భజగోవింద స్తోత్రంలో వినిపిస్తున్నవి. మాతృగర్భంలో మలమూత్రముల మధ్య జీవించటం, ఏ ప్రాణికీ సుఖకరము కాదు. ‘‘గర్భవాసాది దుఃఖమ్’’ ఎన్నడూ ఉండరాదనే ఉద్దేశ్యంతో తనకు ముక్తిని ప్రసాదించమని మహావిద్వాంసుడైన కులశేఖర మహారాజు ముకుందమాల స్తోత్రంలో వేడుకున్నాడు. ఇహ పరలోకాల్లో సుఖానుభూతిపై విరక్తి, జుగుప్స కలిగినప్పుడే జన్మరాహిత్యాన్ని మానవుడు కోరుకొనును. అదియే వైరాగ్యము.
22. విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహుః
స్వలక్ష్యే నియతావస్థా మనసః శమ ఉచ్యతే॥
చిత్తచాపల్యమును కలిగించే విషయములకు నిత్యత్వము లేదు. విషయలాలస కీడును కలిగించును. అది సన్మార్గములో ఎన్నడూ నడవనీయదు. ఇంద్రియ జనిత విషయవాంఛ దుర్గతికి మూలకారణమని తెలుసుకున్న వ్యక్తి, వైరాగ్యభావనతో తన లక్ష్యసిద్ధికి మనస్సును ముందుగా కైవశము చేసుకొనుటకు ఉపక్రమించును. చిత్తవిభ్రమము లేకుండగ మనస్సును స్థిరముగా ఉంచుకొను శక్తియే శమము. శమమునకు వైరాగ్యమే హేతువు అని ఈ శ్లోకంలో గ్రహించగలము. నిరన్తర అభ్యాసము మరియు వైరాగ్యము ద్వారానే మనోనిశ్చలత సాధించబడుతుందని ‘‘మనో దుర్నిగ్రహం చలమ్, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే’’అని గీత బోధిస్తున్నది (్భ.గీ.6-35).
23. విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోలకే
ఉభయేషా మిన్ట్రియాణాం స దమ. పరికీర్తితః
జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు తమంతట తాము ప్రవర్తించలేవు. మనోబుద్ధుల ప్రేరణతో వ్యక్తి కోరికను తీర్చుటకు అవి కార్యనిర్వహణలో నిమగ్నవౌతాయి. అంతఃకరణ శుద్ధితో బాహ్యేంద్రియముల వ్యాపారాన్ని పూర్తిగా నిగ్రహించి, వాటివాటి స్థానములకు పరిమతము చేయటమే దమము.
24. బాహ్యానాలమ్బనం వృత్తే రేషోపరతి రుత్తమా
బాహ్యేంద్రియములను నిగ్రహించి వ్యవహరించినచో అగోచరమైన అంతఃకరణమను (మనోవృత్తిని) నియంత్రించ శక్యము. దీనినే ఉపరతి అందురు. ఉపరతి, చక్షుశ్రోత్రాది ఇంద్రియముల ద్వారా బాహ్య వస్తువులవైపు మనస్సుమరలకుండా అంతఃకరణను వశము చేసుకొని, సమాధి స్థితిలో నిశ్చలముగానుండి, బ్రహ్మైక్యత సాధించుటకు దోహదపడును.
25. సహనం సర్వదుఃఖానా మప్రతీకారపూర్వకమ్‌

చిన్నావిలాపరహితం సా తితాక్షా నిగద్యతే॥
ఎటువంటి ప్రతీకార భావన, కక్ష, వైషమ్యాదులు లేక, సుఖదుఃఖములను ఓర్చుకునే సహనత, శీతోష్ణములందు, జయాపజయములందు, మానావమానములందు ద్వంద్వవైఖరి లేక సర్వసహిష్ణుత కల్గిఉండుటయే తితిక్ష అని చెప్పబడుతున్నది. స్థిరబుద్ధికలవాడు, ప్రియాప్రియములందు సమభావనకలవాడు, పరబ్రహ్మమందు ఏకీభావ స్థితుడై ఉండునని స్మృతి బోధిస్తున్నది. ‘‘స ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియమ్‌
స్థిరబుద్ధి రసమ్మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితిః॥
26. శాస్తస్య్ర గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణా
సా శ్రద్ధా కథితా సద్భిః యయా వస్తూపలభ్యతే
గురువుపైన, శాస్త్ర వాక్యములలోను సంపూర్ణ విశ్వాసముతో, సత్యనిష్ఠతో యథార్థజ్ఞానమును గ్రహించుటయే శ్రద్ధ అని చెప్పబడుతున్నది.
‘‘శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః
జ్ఞానం లబ్ధ్వా పరామ్ శంతిమచిరేణాధిగచ్ఛతి॥
(శ్రద్ధ, బ్రహ్మతత్పరత గల జితేంద్రియుడైన సాధకునకే తత్త్వజ్ఞానము లభ్యమగును. జ్ఞానముకల్గిన అచారకాలములోనే, ఆ వ్యక్తి పరమ శాంతిని ప్రసాదించే ముక్తిని పొందును- భ.గీ.4-39).

- ఇంకావుంది...