మెయిన్ ఫీచర్

వివేకబుద్ధితో జ్ఞానమావిర్భావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
శిష్యుడు అడిగిన ప్రశ్నలు
శిష్య ఉవాచ:-
50. కృపయా శ్రూయతాం స్వామిన్
ప్రశ్నో‚ యం క్రియతే మయా
యదుత్తర మహం శ్రుత్వా
కృతార్థః స్యాం భవన్ముఖాత్‌॥
స్వామీ! నాపై దయచూపి నేను అడుగుతున్న ప్రశ్నను వినుము. దానికి సమాధానమును మీవద్దనుండి పొంది నేను కృతార్థుడనౌదును.
51. కో నామ బన్ధః కథమేష ఆగతః
కథం ప్రతిష్ఠాస్య కథం విమోక్షః
కో‚ సావనాత్మా పరమః క ఆత్మా
తయోర్వివేకః కథమేతదుచ్యతామ్‌॥
శిష్యుని ప్రశ్న
‘‘బంధమనగా ఏమి? ఇదెట్లు సంభవించింది? ఎట్లు స్థిరపడింది? బంధమునుండి విముక్తిని ఎట్లు పొంద శక్యము? అనాత్మ-ఆత్మ అనే ఈ రెండు ఏవి? వాటి భేదమేమి? ఏది పరమాత్మ? ఈ విషయమై వివేకము ఎట్లు లభిస్తుంది? నా సందేహనివృత్తిని తమరు తప్పక చేయుదురుగాక!’’
గురువు ప్రశంసించి సమాధానమీయుట
శ్రీ గురురువాచ:-
52. ధన్యో‚ సి కృతకృత్యో‚ సి పాలితం తే కులం త్వయా
యయదవిద్యాబన్ధముక్త్యా బ్రహ్మీభవితు మిచ్ఛసి॥
శిష్టా! నీవు ధన్యుడవు, కృతార్థుడవు అయినావు. నీ కోరిక తీరుగాక! నీవలన నీ వంశమెల్ల పవిత్రమై తరించినది. అవిద్య కారణముగా ఏర్పడిన ఈ సంసార బంధమును నీవు అధిగమించి, బ్రహ్మత్వసిద్ధితో మోక్షమును ఆకాంక్షిస్తున్నావు.
స్వయంకృషి అనివార్యము
53. ఋణ విమోచనకర్తారః పితుస్సన్తి సుతాదయ.
బన్ధమోచనకర్తా తు స్వస్మాదన్యో న కశ్చన॥
పితృ ఋణమును పలువిధములుగా తీర్చుకొనే కార్యమును పుత్రాదులు నిర్వర్తించవచ్చును. కాని, సంసార బంధవిముక్తి ఇతరులవలన శక్యముకాదు. తానే స్వయముగా తన ఆత్మబంధవిముక్తికై ప్రయత్నించవలెను. దీనిని నిరూపించుటకు రానున్న శ్లోకములలో కొన్ని దృష్టాంతములు ప్రస్తావించబడినవి.
54. మస్తకన్యస్త్భారదేః దుఃఖమన్యై ర్నివార్యతే
క్షుధాదికృత దుఃఖం తు వినా స్వేన న కేనచిత్‌॥
తలపై మోస్తున్న భారమువలన కలిగే దుఃఖమును ఇతరులు కొంత భారమును మోసి నివారించగలరు. కాని ఆకలిదప్పులు ఇత్యాదివలన కలిగిన బాధను తనకుతానే నివారించుకొనవలెను, అది ఇతరుల భోజనాదులవలన తీరేది కాదు కదా!
55. పథ్యవౌషధసేవా చ క్రియతే యేన రోగిణా
ఆరోగ్యసిద్ధిః దృష్టాస్య నాన్యానుష్ఠితకర్మణా॥
అనాగ్యంతో బాధను అనుభవిస్తున్నవారే పథ్యాదులుచేసి ఔషధం తీసుకొనినప్పుడే అతని ఆరోగ్యము కుదుటపడుట కన్పిస్తున్నది. ఇతరులు ఔషధ సేవాది కార్యములుచేసినా రోగముతో బాధపడుతున్న వానికి ఆరోగ్యసిద్ధి కలుగదుకదా!
56. వస్తుస్వరూపం స్ఫుటబోధచక్షుషా
స్వేనైవ వేద్యం న తు పండితేన
చన్ద్రస్వరూపం నిజ చక్షుషైవ
జ్ఞానవ్య మన్యైరవగమ్యతే కిమ్‌॥
ఆత్మదర్శనము తనయొక్క జ్ఞాన నేత్ర ఉన్మీలన ద్వారా స్పష్టమగును. కృతనిశ్చయముతోను, శ్రవణమననాదులతోను ఆత్మవిచారణ చేయకపోయిన, ఇతరులెంత విద్వాంసులైనా తనకు ఆత్మసాక్షాత్కారము కాదు. ఆత్మబోధ కేవలము శాస్తప్రఠనము వలననూ కలుగదు. చంద్రుని స్వరూపమును తన నేత్రములతోనే చూచిన స్పష్టమగును. ఇతరులు చూచి వర్ణించినంతమాత్రమున చంద్రుని యథార్థరూపము తెలిసికొనబడదు.
57. అవిద్యాకామకర్మాది పాశబన్ధం విమోచితుమ్‌
కః శక్నుయాద్వినాత్మానం కల్పకోటి శతైరపి॥
కోరికలు పెంచుకొని చేసిన కామ్యకర్మల వలన అజ్ఞానము ఆవరించును. అవిద్యాకృత అజ్ఞానము నాశనమగుటకు, తద్వారా బంధవిముక్తిని పొందుటకు, తత్త్వజ్ఞానము శ్రేష్ఠసాధనమని ముందు స్పష్టము చేయబడినది. తత్త్వజ్ఞానము గురుముఖేన పొందినా, స్వయంగా శ్రవణమననాదులందు శ్రద్ధలేనివానికి, స్థిరబుద్ధితో నిరంతర ఆత్మవిచారణ చేయనివానికి, అపరోక్షానుభూతి ఏనాటికి కలుగదని ఇచ్చట స్పష్టము చేయబడుతున్నది. ఎవడైతే ఆత్మజ్ఞాన విహీనుడో, వానిని శతకోటి యుగములు గడచినా సంసారబంధమునుండి విడిపించుట అన్యులెవ్వరికీ సాధ్యము కాదు. అతడే స్వయముగా ఆత్మజ్ఞాన తత్పరుడై భవబంధ విముక్తికి తగుప్రయత్నము చేయవలెను.
ఆత్మజ్ఞాన సాధనము
58. న యోగేన న సాంఖ్యేన కర్మణా నో న విద్యయా
బ్రహ్మాత్మైకత్వ బోధేన మోక్ష స్సిద్ధ్యతి నాన్యథా॥
యోగశాస్తమ్రు, సాంఖ్యశాస్తమ్రు, యజ్ఞయాగాది కామ్యకర్మలు, మరియు దేవతలను, హిరణ్యగర్భుని ఆశ్రయించి పొందే సంపద్విద్యలు ముక్తిని చేకూర్చవు. మోక్షసిద్ధికి ఏకైక మార్గము ఆత్మైకత్వజ్ఞానము.
ఆత్మైకత్వ జ్ఞానము అనగా పరమాత్మ-జీవాత్మల ఐక్యతకు ఉపయుక్తమైన జ్ఞానము. పరమాత్మ జీవాత్మల ఏకత్వమును నిరూపించుటకు తత్త్వమసి, సో‚ హం ఇత్యాది ఉపనిషద్విదిత మహావాక్యములను పలు ఉదాహరణలతో వేదాంత జ్ఞానమున్నవారు బోధించెదరు. ఈ ఉపదేశ సారమే సత్స్వరూపమైన బ్రహ్మమే హృదయ స్థిత ఆత్మ. ఆత్మయొక్క స్వస్వరూప జ్ఞానమును పొంది పరమాత్మ చింతనలో నిమగ్నమైన వానికి బ్రహ్మత్వసిద్ధి తప్పక లభించును. శ్రుతి ఈ విధముగా తెల్పుతున్నది ‘‘ద్వే విద్యే వేదితవ్యే ఇతి’’ హ స్మ యద్ బ్రహ్మవిదో వదంతి పరాచైవాపరా చ’’ (రెండు విద్యలు తెలిసికొనవలసినదని బ్రహ్మవేత్తలు నిర్దేశించినారు. అవియే పరావిద్య మరియు అపరావిద్య).
- ఇంకావుంది...