మెయిన్ ఫీచర్

తత్త్వజ్ఞానార్జన ముక్తికి మార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
‘‘ఋగ్వేదో యజుర్వేదః సామవేదో‚ ధర్వవేదః దీక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి’’అనేవి అపరావిద్యలుగా నిర్ధారించి, ‘‘అథ పరా యయా తదక్షర మధిగమ్యతే’’ అక్షరుడైన పరమాత్మతత్త్వమును తెలిసికొనుటకు, ఆత్మసాక్షాత్కారము చేసికొనుటకు పరావిద్య నిర్దేశింపబడినది - ము.ఉ.1-1-4,5)
పరావిద్యతో పరమాత్మ తత్త్వమును ఆకళించుకొనిన ఆత్మవేత్త నిర్గుణ పరబ్రహ్మ ప్రాప్తిని పొంది, అందే లయమగును. తత్కారణంగా, ఆత్మవేత్తకు ఆత్యంత సుఖమునిచ్చే మోక్షము వెనె్వంటనే లభించును. కాని, మాయాస్వరూపమైన హిరణ్యగర్భుని(సగుణబ్రహ్మను) సంపదుపాసనా ఫలితముతో చేరినవారికి క్రమముక్తి యుగాంతములోనే వారు పరబ్రహ్మములో లయమగుదురని ప్రస్తావించబడింది
(బ్ర.సూ.3.3.29).
59. వీణాయా రూపసౌన్దర్యం తస్ర్తివాదన సౌష్ఠవమ్‌
ప్రజారంజనమాత్రం తన్న సామ్రాజ్యాయ కల్పతే॥
వీణ ఎంత అందముగా ఉన్నను, వీణావాదన వినుటకు ఎంత మృదుమధురంగానున్నా, అది జనులను రంజింపజేయునే కాని సామ్రాజ్యమును ప్రసాదించదు. అట్లే, ఆత్మైకత్వమును బోధించని విద్యలు మోక్షప్రాప్తికి ఉపయుక్తము కావు.
60. వాగ్వైఖరీ శబ్దఝరీ శాస్త్ర వ్యాఖ్యానకౌశలమ్‌
వైదుష్యం విదుషాం తద్వ ద్భుక్తయే న తు ముక్తయే॥
పండితులు అనర్గళ వాక్చాతుర్యం, వ్యాఖ్యాన కౌశలం వాగ్ధాటీ, ఇత్యాదులను ప్రదర్శించి కీర్తిప్రఖ్యాతలను గడించినా అది వీణావాద్య ప్రావీణ్యములే భుక్తికే ఉపయుక్తవౌను కాని ముక్తిని ప్రసాదించదు.
61. అవిజ్ఞాతే పరే తత్త్వే శాస్త్ధ్రాతిస్తు నిష్ఫలా
విజ్ఞాతే‚ పి పరే తత్త్వే శాస్త్ధ్రాతిస్తు నిష్ఫలా
పరబ్రహ్మతత్త్వమును తెలిసికొని ఆత్మసాక్షాత్కారము పొందనిచో శాస్త్ధ్య్రాయనము యొక్క ప్రయోజనము శూన్యము. అదే విధముగా, ఆత్మసాక్షాత్కారము పొందిన తరువాత శాస్త్ర అధ్యయనము కొనసాగించవలసిన పనిలేదు. తత్త్వజ్ఞాన ఫలము నిరవధిక ఆనందము, శాశ్వత బంధవిముక్తి. జీవన్ముక్తిని పొందిన సాధకుడు ఇహములో ఉన్ననూ, బ్రహ్మానందమును అనుభవిస్తునే జీవనయానం కొనసాగిపోవును. వానికి శాస్తజ్ఞ్రానావశ్యకత లేదు.
62. శబ్దజాలం మహారణ్యం చిత్తభ్రమణకారణమ్‌
అతః ప్రయత్నాత్ జ్ఞాతవ్యం తత్త్వజ్ఞాత్తత్త్వమాత్మనః॥
శబ్దసమూహమైన శాస్తమ్రు ఒక మహారణ్యము వంటిది. అంతు తెలియని అందులో చిక్కుకున్న వారికి చిత్తవిభ్రాంతి భయాదులు కలిగే అవకాశమున్నది. అందువలన, కృతనిశ్చయుడైన జిజ్ఞాసువు. ఆత్మతత్త్వమును తెలిసికొనుటకు, తత్త్వజ్ఞానియైన ఆత్మవేత్తద్వారా సమ్యక్ జ్ఞానమును పొందవలెను.
63. అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మజ్ఞానౌషధం వినా
కిము వేదైశ్చ శాస్రె్తైశ్చ కిము ముంత్రైః కివౌషధైః॥
అజ్ఞానమనే సర్పము కాటువేసిన వానికి బ్రహ్మజ్ఞానమునే ఔషధమును సేవించుటయే ఒకే ఒక మార్గము. వేదములు, శాస్త్ర అధ్యయనము, మంత్రములు, ఇతర ఔషధములు అజ్ఞానమనే పాము కాటువలన కలిగిన అపాయమును తొలగించలేవు.
కేవలము శాస్తప్రఠనము ద్వారా పొందే శబ్దజ్ఞానము వలన మోక్షము లభించదని ఈ ఉదాహరణ స్పష్టము చేస్తున్నది.
64. న గచ్ఛతి వినా పానం వ్యాధి రౌషధశబ్దతః
వినా‚ పరోక్షానుభవం బ్రహ్మశబ్దైర్నముచ్యతే॥
ఔషధమును స్వీకరించకుండా, ఔషధం అన్న మాటను వినినంత మాత్రాన వ్యాధి నివారించదు. అదే విధముగా, తనకు ఆత్మావలోకనము (ఆపరోక్షానుభూతి) కానిదే, బ్రహ్మమనే పదమును పలుమార్లు ఉచ్ఛరించిన మాత్రమున మోక్షము సిద్ధించదు.
65. అకృత్వా దృశ్య విలయ మజ్ఞాత్వా తత్త్వమాత్మన.
బాహ్యశబ్దైః కుతో ముక్తి రుక్తిమాత్రఫలై ర్నృణామ్‌॥
పరబ్రహ్మమునకు వ్యతిరిక్తమైనది నశ్యమయే సమస్త దృశ్యప్రపంచము. జగత్తును బ్రహ్మమందు వ్రిలీనము చేయనిదే పరమాత్మ తత్త్వము అనుభవపూర్వకముగా తెలిసికొనబడదు. అదే విధంగా, ‘సో‚ సం, అహం బ్రహ్మాస్మి’ ఇత్యాది వాక్యముల శబ్దప్రకటన (ఉచ్ఛారణ) చేసినంత మాత్రాన, మనిషికి మోక్షము సిద్ధించుట అసంభవము.
66. అకృత్వా శత్రు సంహార మగత్వాఖిలభూశ్రీయమ్‌
రాజాహమితి శబ్దాన్నో రాజా భవితు మర్హతి॥
శత్రువులను జయించకుండా, సామ్రాజ్య లక్ష్మిని హస్తగతం చేసికొనక ‘‘నేను రాజును’’ అని ఊరకనే ప్రకటించిన మాత్రాన రాజు అయే అర్హత రాదు. శమదమాదులతో జితేంద్రియుడుకాక, అనిత్యమైన జగత్తును విస్మరించక, తత్త్వజ్ఞానార్జనతో బ్రహ్మమందు ప్రపంచముయొక్క విలీనము చేయనిదే, మోక్షప్రాప్తి అసంభవమని బోధించుటకే, ఈ దృష్టాంతము చూపబడినదని గ్రహించవచ్చును.
67. ఆప్తోక్తిం ఖననం తథోపరి శిలాపాకర్షణం స్వీకృతిం
నిక్షేపః సమపేక్షతే న హి బహిః శబ్దైస్తు నిర్గచ్ఛతి
తద్వ ద్బ్రహ్మ విదోపదేశ మనన ధ్యానాదిభిర్లభ్యతే
మాయాకార్యతిరోహితం స్వమమలం తత్త్వం న ఉర్యుక్త్భిః॥
శ్రేయోభిలాషులు ఎవరైనా నిధి నిక్షిప్తమై ఉన్న ప్రదేశము యొక్క సూచనను తగిన సాక్ష్యాధారములతో తెలియజేసిన, ఆత్మీయులను విచారించి ఆ ప్రదేశములో త్రవ్వి, మట్టి రాళ్లు ఇత్యాదులను తీసివేసిన నిధి బయటపడును. అంతేకాని అచ్చట కూర్చొని నిధిని ఆహ్వానిస్తూ, ఎంత పిలిచినా నిధి బయటకు రాదు కదా! అదే విధముగా, తత్త్వవేత్తయైన గురువునాశ్రయించి, పరమాత్మ స్వస్వరూపమైన తన ఆత్మత్త్వమును క్షుణ్ణముగా తెలిసికొనవలెను. తదుపరి శ్రవణ, మనన, నిధి ధ్యాసనముల ద్వారా ఆత్మ విచారణ చేసి, బ్రహ్మైకత్వము పొందుటకు నిశ్చల మనస్సుతో సమాధి స్థితిలో నిరంతర ధ్యానము చేయనిదే ఆత్మసాక్షాత్కారము కాదు. సత్యానే్వషణకు బ్రహ్మతత్పరత, నిర్మలమైన మనస్సు, మరియు కఠోరపరిశ్రమ అనివార్యము.
68. తస్మాత్సర్వప్రయత్నేన భవబన్ధవిముక్తయే
స్వేనైవ యత్నః కర్తవ్యో రోగాదేరివ పణ్డితైః॥
సంసార బంధవిముక్తికొరకు వివేకవంతులు సమస్త ప్రయత్నములను తాము స్వయముగా చేయుటయే కర్తవ్యము.
- ఇంకావుంది...