మెయిన్ ఫీచర్

విషానికన్నా మిన్న విషయవాంఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
ఐదు స్థూల భూతములను పంచీకరణ ప్రక్రియలో ఏర్పరచి జగదావిర్భావం జరిగింది. పృథివ్యాది భూతపంచకమే స్థూలశరీరం నిర్మాణానికి హేతువు.
76. మాత్రాస్తదీయా విషయా భవన్తి
శబ్దాదయః పంచ సుఖాయ భోక్తుః॥
ఆకాశాది భూతపంచకము వాటి తన్మాత్రల ద్వారా, భోక్తయైన శరీరధారుని శ్రోత్రాది పంచ జ్ఞానేంద్రియములకు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధమనే పంచవిధ సుఖానుభూతిని కల్గించే విషయ లోలత్వమును కల్పిస్తున్నది.
‘‘శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ
అధిష్ఠాయం మనశ్చాయం విషయానుపసేవతే॥
(చెవి, కన్ను, చర్మము, నాలుక, నాసిక అనే జ్ఞానేంద్రియాలకు, మనస్సును ఆశ్రయించి ఈ జీవుడు శబ్దాది విషయములను అనుభవిస్తున్నాడని భగవద్గీత బోధన- భ.గీ.15-9)
77. య ఏషు మూఢా విషయేషు బద్ధా
రాగోలుపాశేన సుదుర్దమేన
ఆయాన్తి నిర్యాన్త్యధ ఊర్ధ్వముచ్చైః
స్వకర్మదూతేన జనేన నీతా.॥
మూఢులు, విషయాసక్తిని నిగ్రహించుకోలేక, అనురక్తి అనే పాశముతో బంధింపబడతారు. వారు చేసిన కర్మ అనే దూత చేతనే వారు అతిశీఘ్రముగా అధోలోకమునకు తీసుకొనిపోబడతారు. అచ్చట కర్మఫలం క్షయం అయిన పిదప మరల పైలోకాలకు తీసికొని రాబడతారు.
మొసలి నదిలోనుంచి - నది ఒడ్డునిచేరి మరల నదిలోకిపోతున్నట్లు వివేకహీనులు, జనన మరణముల వలయంనుండి తప్పించుకొనలేక ఇలా అధోలోకములకు, ఊర్ధ్వలోకములకు తిరుగుతుందురు. స్మృతి ‘‘కర్మానుబంధీని మనుష్యలోకే’’అని బోధిస్తూ మనుష్యులను కర్మానుసారముగా సంసారవలయంలో బంధించేవి విషయవాంఛ, మమకారాది వాసనలేనని సూచిస్తున్నది. (్భ.గీ.15-2). జన్మకు కారణం కర్మ. కర్మశేషం ఉన్నందువలననే ఇహజన్మ కల్గుతుంది. శ్రుతి ఇలా నిర్ధారిస్తున్నది ‘‘ప్రాప్యంతం కర్మణస్తస్య యత్కించేహ కరోత్యయం తస్మాల్లోకాత్ పునరేతి అస్మైలోకాయ కర్మణే’’(కర్మఫలాన్ని పూర్తిగా అనుభవించే మరల ఇహలోకంలో జన్మనెత్తి కర్మ అనుభవించటానికి తిరిగి వచ్చెదరు...బృ.ఉ.4-4-6). ఊర్ధ్వలోకాలకు పోయేవారికి అతివాహకులు (అమానవ దూతలే) విద్యుతాది లోకాలకు తీసుకొనిపోదురని కూడా శ్రుతిలో విన్పిస్తున్నది (్ఛ.ఉ.4-15-5).
78. శబ్దాదిభిః పంచభిరేవ పంచ
పంచత్వమాపుః స్వగుణేన బద్ధాః
కురంగ మాతంగ పతంగ మీన
భృంగా నరః పంచభి రన్చితః కిమ్‌॥
లేడికి చెవులకింపైన వేణు వాద్యము, మధురమైన గానము వినుటయందు ఆసక్తి స్వతఃసిద్ధగుణము. బోయవాడు లేడిని వేణుగానముతో పాశములో బంధిస్తాడు. శ్రవణాసక్తియే లేడి మరణమునకు కారణవౌతున్నది. అట్లే, ఆడ ఏనుగు, మగ ఏనుగు స్పర్శకుపోయి పాశబంధమునుంచి బయటపడలేదు. మిడత దీపపు కాంతిచే ఆకర్షింపబడి అగ్నివశమై మరణిస్తున్నది. చేప ఎరకు ఆశపడి మరణిస్తున్నది. తుమ్మెద సుగంధ పువ్వులను ఆఘ్రాణించే వ్యామోహముతో అట్లే మృత్యుపాశములో పడుతున్నది. ఇలా ఒక్కో ప్రాణికి ఒక విషయవాంఛ వినాశానికి కారణవౌతుండగా, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనే ఐదింటి భోగములను వాంఛించే మానవుడికి దుర్గతి, వినాశము ఎట్లు తప్పును?
79. దోషేణ తీవ్రో విషయః కృష్ణసర్పవిషాదపి
విషం నిహన్తి భోక్తారం ద్రష్టారం చక్షుషాప్యయమ్‌॥
కృష్ణ సర్పము విషముకంటె మిక్కిలి విష పూరితమైనది విషయవాంఛ. నల్లత్రాచు కాటుకి గురియైన వ్యక్తి, భోక్తగా అతడు మాత్రమే మరణించును. కాని, విషయవాంఛ అనే విష పూరిత దృశ్యము చూచిన ద్రష్టకు (చూచే వ్యక్తికి) వినాశము కలుగును. అందువలన, విషయాశక్తిని ప్రేరేపించే ఇంద్రియములను నిగ్రహించుకొని ప్రవర్తించటమే బహు శ్రేయస్కరము.
80. విషయాశామహాపాశాద్యో విముక్తః సుదుస్త్యాత్‌
స ఏవ కల్పతే ముక్యై నాన్యః షట్ఛాస్త్ర వేద్యపి॥
ఎవడు త్రెంచుకోలేని విషయవాంఛ అనే పాశమును సుదృఢ సంకల్పముతో ఛేదించి బయటపడునో అతడే ముక్తిని పొందుటకు సమర్థుడు. తర్కము, వ్యాకరణము, ధర్మము, మీమాంస, వైద్యము, జ్యోతిషము అనే ఆరు ప్రసిద్ధ శాస్తమ్రులలో పండితుడైననూ విషయ లోలత్వమున్న వ్యక్తికి మోక్షము సిద్ధించుట దుర్లభము. ఐహిక భోగములలో ఆసక్తిగలవానికి పారమార్థిక చింతన ఉండదు. అర్థకామములందే సదా మనస్సులగ్నమై ఉండును.
81. అపాత వైరాగ్యవతో ముముక్షూన్
భవాబ్దిపారం ప్రతియాతు ముద్యతాన్‌
ఆశాగ్రహో మజ్జయతే‚- స్తరాలే
నిగృహ్య కణ్ఠే వినివర్త్యవేగాత్‌॥
కొందరు మంద వైరాగ్యభావన కలవారు సహితము దుర్భరమైన సంసార సాగరాన్ని దాటడానికి కొంత ప్రయత్నముచేయవచ్చు. కాని, వారిని ఆశ అనే మొసలి దారిమధ్యనే పట్టుకొని, అగాధమైన సాగరంలో మరల ముంచివేస్తుంది.
82. విషయాఖ్యగ్రహో యేన సువిరక్త్యసినా హతః
స గచ్ఛతి భవాంబోధేః పారం ప్రత్యూహవర్జితః॥
ఎవనికి మోక్షమందు తీవ్రమైన ఆకాంక్ష కలుగునో అతడు పరిపూర్ణ వైరాగ్యమనే కత్తితో ఆశ అనే మొసలిని హతమార్చి, అడ్డంకులను ఎదుర్కొని కృతనిశ్చయముతో మోక్షసాధన చేసి, సంసార సాగరమును దాటివేసి ఆవలి ఒడ్డును చేరుకొనును.
83. విషమ విషయమార్గే గచ్చతో‚ నచ్ఛబుద్ధే.
ప్రతిపద మభిఘాతో మృత్యురప్యేష సిద్ధః
హతనుజనరూక్త్యా గచ్ఛతః స్వస్య యుక్త్యా
ప్రభవతి ఫలసిద్ధిః సత్యమిత్యేవ విద్ధి॥
విషమువంటి విషయ భోగ మార్గము, సరళమైనది కాదు. మృత్యువు కూడా అతి సమీపములో వేచి ఉంటుందిక్కడ.
ఇంకాఉంది