మెయిన్ ఫీచర్

అనుభూతులు కేవలం స్థూల శరీరానికే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
ఇంద్రియ నిగ్రహముతో, శరీర సుఖములందు జుగుప్స కలగనిదే బుద్ధిశ్రవణ మననాదులందు నిలువదు. అందువలన, మోహమును అతిక్రమించలేని వాడు, మోక్షసాధనకు అర్హుడుకాడని స్పష్టము చేయబడుతున్నది.
88. మోహం జహి మహామృత్యుం దేహదారసుతాదిషు
యం జిత్వా మునయో యాన్తి తద్విష్ణోః పరమం పదమ్‌॥
మునులు ఏ మోహమునైతే జయించి అత్యంత శ్రేష్ఠమైన విష్ణులోకమును పొందుతున్నారో, ఆ బ్రహ్మలోకమును చేరుటకు శిష్యా! నీవు భ్రాంతికి కారణమైన ఈ దేహము, భార్య, పుత్రులు మొదలగు వారిపైన మోహమును అంతమొనర్చుకొనుము.
89 త్వఙ్మంస రుధిర స్నాయు మేదో మజ్జాస్థి సంకులమ్
పూర్ణం మూత్ర పురీషాభ్యాం స్థూలం నింద్య మిదం వపుః
భావం: ఈ స్థూల శరీరము చర్మము, మాంసము, రక్తము, క్రొవ్వు, అస్థికలు ఇత్యాదులతోను అసహ్యకరమైన మలమూత్రాలతోను నిండి ఉన్నది. అందువలన అపరిశుభ్రము, మలిన సహితమైన ఈ స్థూల శరీరంపై అనురాగం పెంచుకొనుట చాలా నిందనీయం. నిత్య నిర్మలమైన ఆత్మపై ఆసక్తి చూపటమే బహు శ్రేయస్కరము.
90. పంచీకృతేభ్యో భూతేభ్యః స్థూలేభ్యః పూర్వ కర్మణా
సముత్పన్న మిదం సూతలం భోగాయతన మాత్మనః
అవసాథ జాగరస్తస్య స్థూలార్థానుభవో యతః
పంచభూతముల కలయికతో ఈ స్థూలశరీరము సంభవించినది. అన్నాదుల భక్షణ వలననే రక్త, మాంసాదులతో కూడిన ఈ శరీరము ఏర్పడుతున్నది. దేహధారులందరికి పూర్వకృత కర్మల కారణంగా పలు రూపాలలో జన్మ ప్రాప్తిస్తున్నది. ప్రాణులు జాగ్రదావస్థయందు సమస్త విషయముల అనుభవమును పొందుదురు. అందువలన, స్థూల శరీరము విషయ గ్రహణతో ప్రాప్తమయే సుఖాదులకు ఆశ్రయవౌతున్నది. జాగ్రదవస్థయే స్థూల శరీరమునకు సంబంధించిన అవస్థ అని నీవు గ్రహించుము.
స్వప్నావస్థలో సహితము సుఖదుఃఖానుభూతి కల్గును. కాని అది యథార్థము కాదు. స్వప్నావస్థలో వాసనారూపమైన అనుభవముల కారణంగా అంతఃకరణ భాగమైన మనస్సు ప్రేరితవౌను. స్వయంజ్యోతిస్స్వరూపమైన ఆత్మ కేవలం సాక్షిగా తన ధర్మాన్ని నిర్వర్తించును. కర్మేంద్రియములు, ఉపర మించును.అందులన స్వప్నావస్థలో సుఖదుఃఖానుభూతి అవాస్తవము. భ్రాంతిని మాత్రమే కల్గించును.
91. బాహ్యేన్ధ్రియైః స్థూల పదార్థ సేవాం
స్రక్ చన్దసస్య్రాది విచిత్రరూపామ్
కరోతి జీవః స్వయమేత దాత్మనా
తస్మాత్ప్ర శస్తి ర్వపుషో స్య జాగరే॥
జాగ్రదవస్థలో స్తూల శరీరముతో తాదాత్మ్యము చెందిన వ్యక్తి పూలమాలలు, చందనము, స్ర్తిలు ఇత్యాది విచిత్ర రూపములలో దృశ్యమయ్యే స్థూల పదార్థముల సేవలను, తన శరీర సుఖానుభూతి కొరకు బాహేంద్రియములతో చేస్తున్నాడు. మనస్సుతో పరిపూర్ణ సంయోగము ఉన్నందువల్ల జాగ్రదవస్థలో స్థూలశరీరము మిక్కిలి ప్రాధాన్యతను పొందుతున్నది.
92. సర్వోపి బాహ్యః సంసారః పురుషస్య యదాశ్రయః
విద్ధి దేహ మిదం స్థూలం గృహప ద్గృహమేధినః
గృహము సమస్త సంసారిక కార్య కలాపముల నిర్వహణకు గృహస్థునకు ఎట్లు ఆశ్రయము కల్పిస్తున్నదో అట్లే ఈ స్థూల దేహము మానవుని అన్ని బాహ్య కార్యములకు ఆశ్రయవౌతున్నదనిశిష్యా!నీవు తెలుసుకొనుము.
93. సూథ స్య సంజరామరణా ధర్మాః
స్తౌల్యాదయో బహువిధాః శిశుద్యవస్థా
వర్ణాశ్రమాది నియమా బహుధామయాః స్యుః
పూజావమాన బహుమాన ముఖా విశేషాః
జన్మించిన పిదప బాల్యావస్థనుండి క్రమముగా వృద్ధి పొందుతూ వార్థక్యావస్థకు చేరుట. అంతములో మరణించుట, శరీరమునకు స్థూలత్వము, కృశత్వము ఇత్యాది లక్షణములు కల్గుట సామాన్య ధర్మములు. అట్లే వర్ణాశ్రమ ధర్మములు. అనగా బ్రహ్మచర్య గృహస్థ , వానప్రస్థ, సన్న్యాసాశ్రమమునకు సంబంధించిన విధులు, నియమములు, కులాచార వ్యవహారములైన దేహపరమైన ప్రత్యేక సంస్కారములు. వివాహాదులు అన్నీ స్థూల శరీరమునకు సంబంధించనవే. సామాన్య అస్వస్థత, దీర్ఘరోగములు సమస్తము, శరీరమునే బాధించును. అదేవిధముగా వ్యక్తికి సువర్ణ కంకణ ప్రదానము తదితర సత్కారములు ఆనందమును చేకూర్చినట్లే. అవమానము, నింద ఇత్యాదులు మిక్కిలి దుఃఖమును కల్గించును. ఆనందము, వ్యధ రెండునూ స్థూల దేహమునకు చెందినవే కానీ ఆత్మ సంబంధమైనవి కావు.
బాహేంద్రియములు
94 బుద్ధీంద్రియాణి శ్రవణం త్వగక్షి
ఘ్రాణం చ జిహ్వ విషయావబోధనాత్
వాక్పాణి పాదా గుద మప్యుపస్థం
కర్మేంద్రియాణి ప్రవణాని కర్మసు
శబ్ద, స్పర్శ, రూప, గంధ, రసములను గ్రహించేవి ఐదు జ్ఞానేంద్రియములైన చెవి, చర్మము, నేత్రము, జిహ్వ, మరియు నాసిక, కర్మేంద్రియములైన వాక్, పాణి, పాద, పాయు, మరియు ఉపస్థలు. పల్కుటకు వాక్కు, ఇచ్చిపుచ్చుకొనుటకు చేతులు, గమనానికి పాదములు, మలవిసర్జనకు పాయువు, మరియు జననేంద్రియ స్థానమైన ఉపస్థ కామవాంఛ తీర్చుటకు ఏర్పాటైనవి.
95 నిగద్యతే స్తఃకరణం మనో ధీరహం
కృతిశిచత్త మితి స్వవృత్త్భిః
మనస్తు సంకల్ప వికల్ప నాదినిః
రుబదిధః ఫదారాథ్ధ్యవసాయ ధర్మతః
96. అత్రాభిమానాదహ మిత్య హంకృతిః
స్వార్థాను స న్ధాన గుణేన చిత్తమ్
స్థూల శరీరంచే వెలుపలకు అగుపడక లోపల భాగంలో ఉంటూ వ్యవహరించే ఇంద్రియమే అంతఃకరణ. నాలుగు జడపదార్థాముల సముదాయమైన అంతఃకరణ. ప్రత్యేక అంతర సంసారిక కార్యములను చేపడుతున్న మనస్సు, బుద్ధి, అహంకారము మరియు చిత్తము అనే నాలుగు ఇంద్రియములకు అధిష్ఠాత. మనస్సు సంకల్ప వికల్ప కార్యములను నిర్వర్తించును. అన్ని సంశయములకు మూలస్థానము మనస్సు. బుద్ధి ప్రయోగముతో మనోజ నితములైన సంకల్పాదుల ప్రయోజనము, ఉచితానుచితములను పరిశీలించిన పిదపనే అవి కార్య రూపము దాల్చును. ప్రకృతః మనస్సు అతి చంచలం కాని బుద్ధి నిర్ణయాత్మకము, అహంకారము శరీరముతో తాదాత్మ్యము చెంది, నేను, నాది అనే మిథ్యాభావనము కల్పించును.
ఇంకాఉంది