మెయిన్ ఫీచర్

చిత్త విభ్రాంతి చంచలానికి హేతువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
దురహంకారమే రాగద్వేషములకు అసూయ, ప్రతీకారాది ప్రవృత్తులకు హేతువు. చిత్తము పూర్వజన్మల వాసనాపరంపరతో ప్రభావితమై ప్రస్తుత జన్మలోను వ్యవహరిస్తున్నది. దీనివలన, ఆహార వ్యవహారములలో ఇష్ఠానిష్టములు ఉత్పన్నమగును. మనస్సు కన్న భిన్నమైనది చిత్తముకానీ, చిత్త విభ్రాంతే చంచల మనస్సుకు కారణమని సామాన్యంగా చెప్పబడుచున్నది.
పంచప్రాణములు
ప్రాణాపాన వ్యానో దాన సమానా భవత్యసౌ ప్రాణః
స్వయమేవ వృత్త్భిదాత్ వికృతేర్భేదాత్సుదాత్సువర్ణ సలిలమివ
ఏకరసమైన నీరు, ఆకార వికారాదుల దృష్ట్యా, తటాకము, సెలయేరు, మహానది ఇత్యాది పేర్లతో నిర్దేశింపబడుతున్నది. అట్లే మూలము సువర్ణమైనా, దాని కార్య రూపమైన ఆభరణములు వాటి ఆకార వికారములకు అనుగుణంగా వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందుతున్నవి. అదేరీతిని మనశరీరములో సంచరించే వాయువు సహితము ఐదు వేర్వేరు పేర్లతో నిర్దేశింపబడుతున్నది.
ఉచ్ఛ్వాస నిఃశ్వాస కార్యములను నిర్వర్తించటమే ప్రాణసము. మలవిసర్జనకు ఉపయుక్తమైనది అపాన వాయువు. అన్నపానీయాల ద్వారా లభించే శక్తిని శరీరం అంతటా వ్యాపింప చేసేది వ్యాన వాయువు. ఉదరమునుండి కంఠ స్థానము వరకు వ్యాపించి అరగని పదార్థములను వమనము చేయించేది ఉదానము, జఠరాగ్ని ద్వారా జీర్ణప్రక్రియను ప్రేరేపించేది సమానవాయువు. ఇవియే వాయువు అనబడుచున్నవి. ఇవియే ప్రాణము చేయు పంచవిధ వృత్తులు.
97. ప్రాణాపాన వ్యానో దానసమాన భవత్యసౌ ప్రాణః
స్వయమేవ వృత్తి భేదాత్ వికృతేర్భే దాత్సువర్ణ సలిల మివ
సూక్ష్మ శరీరము
98. వాగాది పంచ శ్రవణాది పంచ
ప్రాణాది పంచాభ్రముఖాని పంచ
బుద్ధ్యాద్యవిద్యాపి చ కామకర్మణీ
పుర్యష్టకం సూక్ష్మశరీర మాహుః॥
వాగాది కర్మేంద్రియ పంచకము, శ్రవణాది జ్ఞానేంద్రియ పంచకము, ఆకాశాది భూత తన్మాత్రల పంచకము, బుద్ధ్యాది అంతకరణ చతుష్టయము, అవిద్యాకృత కామకర్మలు కలిసి పుర్యష్టకము లేక ఎనిమిది పురముల సముదాయమైనది. దీనినే సూక్ష్మశరీరము లేక లింగ శరీరమని కూడా అందురు.
99. ఇదం శరీరం శృణు సూక్ష్మసంజ్ఞితం
లింగంత్వపంచీకృత భూతసంభవమ్‌
సవాసనం కర్మఫలానుభావకం
స్వాజ్ఞానతో‚ నాది రుపాధిరాత్మనః॥
శిష్యా! వినుము. ఈ సూక్ష్మశరీరము పంచీకృతముకాక పూర్వము పంచభూతతన్మాత్రములతో ఏర్పడుతున్నది. పరమాత్మ ప్రతిరూపమైన జీవాత్మ, ఆత్మ ఉనికిని ఒక చిహ్నముగా సక్ష్మశరీరమందు కలిగి ఉన్నది. అందువలన, సూక్ష్మశరీరమును లింగ శరీరమని కూడా నిర్దేశింతురు. అంతఃకరణ సంబంధము కొనసాగుటచేత, సమస్త పూర్వజన్మల వాసనలతో సూక్ష్మశరీరము కూడుకొని ఉండుటచేత, సూక్ష్మశరీరమే భోగ హేతువుగాను శరీరధారుని సుకృత- దృష్కృత కర్మఫలోప భోగమునకు హేతువుగాను చెప్పబడుతున్నది. ఉపాధికొరకు శరీరమును ఆశ్రయించిన జీవాత్మ, అనాదియైన అజ్ఞానముచే ఆవరింపబడి ఉండును. తత్కారణంగా, స్వస్వరూపమును తెలిసికొనలేని స్థితిలో శరీరధారుడు కొనసాగును.
అంతఃకరణ క్షయముతో సస్త పూర్వజన్మ వాసనలు నిశే్శషముగా అంతమైపోవును. ఏ పురుషుడు, ఆత్మజ్ఞానముతో అనాదియైన సంసార బంధ విముక్తికొరకు సాధనచేయునో, ఆ వ్యక్తి మృత్యువును అధిగమించును. అందువలన పునర్జన్మ మరియు కర్మఫలభోగము అటుపిమ్మట ఉండదు.
100. స్వప్నో భవత్యస్య విభక్త్యవస్థా
స్వమాత్రశేషేణ విభాతి యత్ర
స్వప్నే తు బుద్ధిః స్వయమేవ జాగ్రత్
కాలీన నానావిధవాసనాభిః॥
కర్ర్తాదిభావం ప్రతిపద్య రాజతే
యత్ర స్యయంజ్యోతి రయం పరాత్మా॥
స్వప్నావస్థలో సూక్ష్మశరీరము ప్రాధాన్యత పొంది విశిష్ట అవస్థలో వ్యవహరించును. స్వప్నావస్థలో స్థూల దేహము కార్యనిర్వహణ చేయదు, అట్లే, సుషుప్తిలో అహంకారాదులతో సూక్ష్మశరీరము ఆత్మలో విలీనవౌను. అందువలన, స్వప్నావస్థలో మాత్రమే సూక్ష్మశరీరము ప్రకాశవంతమై, దృశ్యశ్రవణాది అనుభూతులు కలుగుతున్నవి. జాగ్రదవస్థలో స్థూల శరీరమును అనుభవయోగ్యమైన విషయములతో ప్రేరేపించునవి మనోబుద్ధులు. ఎల్లవేళల సాక్షిగా వ్యవహరించే ఆత్మ స్వయంజ్యోతి. ‘‘తమేవ భాంత మనుభాతి సర్వం. తస్యభాసా సర్వమిదం విభాతి’’అనే శ్రుతివాక్యం ఆత్మపరంజ్యోతి స్వరూపమని నిర్ధారిస్తున్నది (ము.ఉ.2-2-10, శే.ఉ.6.14). అందువలన, ఆత్మద్వారా ప్రకాశవంతమైన అంతఃకరణ, స్వప్నావస్థలో సూక్ష్మశరీరమును రంజింపచేస్తుంది.
‘‘స్వప్నాంతం జాగరితాతం చోభౌ యేనానుపశ్యతి’’అనే శ్రుతి వాక్యము, జాగ్రదవస్థలోను, స్వప్నావస్థలోను కూడా సమస్త విషయములను, మనము ఆత్మద్వారానే గ్రహిస్తున్నామని ప్రకటిస్తున్నది (క.ఉ.2-1-4). స్వప్నావస్థలో అంతఃకరణ భాగమైన మనస్సు మాత్రమే తేజోవంతమై, గతానుభవములను అభాస రూపంలో సృజిస్తున్నది. వాస్తవికత లేని ఈ అనుభవములు జాగ్రదవస్థకు వచ్చిన వెంటనే అంతర్ధానమైపోవును.

ఇంకాఉంది