మెయిన్ ఫీచర్

ఆకలిదప్పులు ప్రాణ ధర్మాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

101. ధీమాత్రకోపాధిరశేషసాక్షీ
న లిప్యతే తత్కృత కర్మలేపైః
యస్మాద సంగస్తత ఏవ కర్మభిః
న లిష్యతే కించిదుపాధినా కృతైః॥
సమస్త కార్యములకు సాక్షియైన ఆత్మకు ఉపాధియైనది బుద్ధి మాత్రమే. బుద్ధిద్వారా జరిగిన కార్యములేవియు ఆత్మకు అంటవు. కారణమేమన, ఆత్మ సంగరహితము. అసంగుడు దేనిచేతను లిప్తుడు కాదు. ఆత్మ ఫలభోక్తకాదు. అందువలన బుద్ధిచేసిన ఏ కర్మచేతను, ఆత్మ పూయబడదు.
బృహదారణ్యకోపనిషత్తు ‘‘అసంగో హ్యయం పురుషు’’ (ఈ పురుషుడు (ఆత్మ)అసంగుడే దేనితోను కూడుకొనడు- బృ.ఉ.4-3-15). అందువలన, ఆత్మకు క్షయము లేదని స్పష్టము చేస్తున్నది. మరో శ్రుతి ‘‘నిష్కలం నిష్క్రియం శాంతం నిరవద్యం నిరంజనమ్’’అని ఆత్మకు కళ లేదు. క్రియ లేదు, ప్రశాంతమైనది, నిర్దేశింపబడదు. కళంకము లేదు అని ప్రకటిస్తున్నది- శే్వ.ఉ.6-19). ‘‘అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః (శరీర స్థో‚ పికౌంతేయ న కరోతి న లిప్యతే’’ అని స్మృతి బోధన (శరీరములో ఉన్నప్పటికీ, ఆత్మ ఏ కర్మనూ చేయదు దేనివలన లిప్తము కాదు- భ.గీ.13-31).
102. సర్వవ్యాపృతికరణం లింగమిదం
స్యాచ్చిదాత్మనః పుంసః
వాస్యాదికమివ తక్ష్య తేనైవాత్మా
భవత్యసంగో‚ యమ్‌॥
వడ్రంగికి బాడిద మొదలగు పనిముట్లు స్వాభావికము కావు. వాని వృత్తిరీత్యా వాటిని సాధనములుగా ఉపయోగించుకొనును. అట్లే, జ్ఞాన స్వరూపమైన ఆత్మకు ఇంద్రియములు సాధనములు. అజ్ఞానముతో కూడిన లింగ శరీరముతో సంబంధము, అంతఃకరణ (బుద్ధి)ద్వారా కార్యనిర్వహణ సమయములో ఏర్పడును. కార్యములేనపుడు బుద్ధ్యాది సాధనములతో సంపర్కమే లేదు. క్రియలేని ఆత్మ సంగరహితమైనది. అందువలన, ఇంద్రియములు నిర్వర్తించే ఏ కార్యకలాపముతోను చిదాత్మకు సాంగత్యము లేదు.
103. అస్థత్వ మందత్వ పటుత్వ ధర్మాః
సౌగుణ్యవైగుణ్యవశాద్ధి చక్షుషః
బాధిర్య మూకత్వ ముఖాసె్తై్థవ
శ్రోత్రాదిధర్మా న తు వేత్తు రాత్మనః॥
దృష్టి సరిగా ఉండుట, అంధత్వము, దృష్టిమాంద్యము మొదలగునవి నేతేంద్రియ ధర్మములు. అట్లే, వినబడకపోవుట, మూగతనము ఇత్యాదులు శ్రోత్రేంద్రియ ధర్మములు. ఇవన్నియు, స్థూల శరీరమునకు సంబంధించినవి, జ్ఞాతయైన ఆత్మధర్మములు కానే కావు.
104. ఉచ్ఛ్వాస నిఃశ్వాస విజృంభణ క్షుత్
ప్రస్పందనాద్యుత్క్రమణాదికాః క్రియాః
ప్రాణాదికర్మాణి వదన్తి తద్‌జ్ఞాః
ప్రాణస్య ధర్మావశనా పిపాసే॥
ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఆవలింత ఇత్యాదులు, కదలుట, లేచి నిల్చొనుట, బయటకుపోవుట ఇత్యాదులన్నీ ప్రాణము, అనగా పంచవాయువుల కార్యములని ఆ విషయజ్ఞానమున్నవారు అందురు. అట్లే, ఆకలిదప్పులు కూడా ప్రాణధర్మములే.
అహంకారము
105. అస్తఃకరణమేతేషు చక్షురాదిషు వర్ష్మణి
అహమిత్యభిమానేన తిష్ఠత్యాభాసతేజసా॥
అంతఃకరణము మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాల్గింటి సముదాయము. చిత్తముయొక్క అభాస తేజస్సుతో అనగా ప్రతిబింబమై తేజస్సుతో, అహంకారము శరీరముపై పెంచుకున్న అభిమానముతో తాదాత్మ్యము చెంది ‘నేను’అని వ్యవహరించును. ఆత్మ మాత్రమే ‘అహం- నేను’అనే పదముతో చెప్పబడాలి. కాని, అహంకారము దేహమును ఆవరించి, నేను అని ప్రవర్తిస్తున్నది. ఆత్మకు స్వతఃసిద్ధమైన స్వయంప్రకాశము, చేతన స్వభావము మరియు జ్ఞానశక్తి, అంతఃకరణకు ఉండవు. అట్లే అచేతనము, జడపదార్థ సముదాయమైన దేహముయొక్క అవబోధ ఇసుమంతైనా అంతఃకరణకు లేదు. కాని, అది భావరూపమైన ఆత్మప్రతిబింబమును గ్రహించి తద్వారా ప్రకాశవంతమై, నేను అనే అహంభావముతో అభాసరూపములో ప్రకటితవౌతున్నది.
అద్దములో కనబడే ప్రతిబింబము, జలాశయములో ప్రతిబింబిస్తున్న సూర్యుడు అభాస రూపములు. అవి నిజమైనవి కావు. అట్లే, అహంకారము కేవలము అభాస రూపము. ఉపాధివశాత్తు అంతఃకరణకు లోబడి జీవాత్మ, తనపై దేహపరమైన లోపములను ఆరోపించుకొని నేను అంధుడను, నేను చెవిటివాడను, నేను అవిటివాడను అని వ్యవహరించుట సర్వసామాన్యము.
106. అహంకారః స విజ్ఞేయః కర్తాః భోక్త్భామాన్యయమ్‌
సత్త్వాదిగుణయోగేనావస్థాత్రితయ మశ్నుతే
అంతఃకరణమే అహంకారముగా ప్రతిఫలిస్తూ శరీరముపై అభిమానంతో కర్తృత్వ, భోక్తృత్వ లక్షణములను పొందుతున్నది. అదే విధంగా, దేహమందు ప్రకృతి జనితమైన సత్త్వరజస్తమో గుణాలతో కలిసి, త్రివిధ దేహావస్థలకు అనగా జాగృత్స్వప్నసుషుప్తి అవస్థలకు స్థానమై ఆయా గుణములను వివిధ దేహావస్థలలోను సంతరించుకొంటున్నది.
107. విషయాణామానుకూల్యే సుఖీ దుఃఖీ విపర్యయే
సుఖం దుఃఖం చ తద్ధర్మః సదానన్దస్య నాత్మనః॥
దేహపరమైన సుఖదుఃఖములు అంతఃకరణ ధర్మములు. తనకు ప్రియమైన విషయానుభూతి కల్గినపుడు సుఖపడుతున్నాననే భావన. అప్రియమైన విషయానుభవమైన సందర్భములో దుఃఖము అనుభవిస్తున్నాననే భావన, అంతఃకరణ మూలముగా కల్గును. ఆత్మనిత్యానంద స్వరూపము; సదానంద భరితము. సుఖదుఃఖములను అనుభవించేది దేహమే.
108. ఆత్మార్థత్వేన హి ప్రేయాన్ విషయో న స్వతః ప్రియః
స్వత ఏవ హి సర్వేషా మాత్యా ప్రియతమో మతః॥
విషయము స్వతఃసిద్ధముగా ప్రియముకాని అప్రియము కాని కాదు. ఈ విషయము సుఖతరము, నాకిది దుఃఖమును కలిగించదు అని స్వయముగా తనకు అనిపించుటచే దానిపై ఇచ్ఛకలిగి ప్రియవౌతున్నది.
- ఇంకావుంది...