మెయిన్ ఫీచర్

కోలాహలంగా కొత్త వసంతంలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త వసంతం.. కొంగ్రొత్త ఉత్సాహం.. అన్నీ శుభాలు జరగాలన్న కోరిక.. సమస్యలన్నీ తొలిగిపోతాయన్న విశ్వాసం.. మంచి జరుగుతున్న నమ్మకం.. అదృష్టం వరిస్తుందేమోనన్న ఆశ.. లక్ష్యాలు చేరుతామన్న ధీమా.. ఇలా కొత్త సంవత్సరం వస్తుందంటే ప్రతి మనిషికీ ఇలా ఏదో ఒక రూపంలో ఆకాంక్షలు ఉండటం సహజమే.. గడిచిన ఏడాదిలోని తప్పులను నెమరేసుకుని, నూతన సంవత్సరానికి కొత్త ప్రణాళికలను వేసుకోవడం మానవ సహజం..
డిసెంబరు 31న అర్ధరాత్రి 12గంటలు దాటగానే ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు కనుల పండుగగా జరుగుతాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. కొన్ని ధార్మిక సంస్థలు భారతదేశంలో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం, అభ్యంతరాలు తెలిపినా భారతదేశంలో జనవరి ఒకటో తేదీన ఈ వేడుకలు జరుపుకోవడం ప్రతి ఏటా పెరుగుతోంది కానీ తగ్గడం లేదు. ప్రారంభంలో ఇది కొంచెం తక్కువ అయినా ఇప్పుడు మన దేశంలో ఎక్కువగానే ఈ వేడుకలు జరుపుకోవడం విశేషం. అర్ధరాత్రి నుంచీ వీధుల్లో సందడి, కోలాహలం, కేరింతలతో నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. రంగురంగుల బాణాసంచాతో ఆకాశం వెలుగులు వెదజల్లుతుంది. కొత్త ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరం అన్ని విధాలా జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ స్వాగతం పలుకుతారు. విశ్వవ్యాప్తంగా గ్రెగేరియన్ కేలండర్ అనుసరిస్తారు. 365 రోజులు ఒకటి నుండి ప్రారంభం అవుతాయి. ఈ నూతన సంవత్సర వేడుకలు మొదట 4 వేల సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి జరుపుకున్నారు. జూలియస్ సీజర్ అనే రోమ్ రాజు సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి నెలకి వాళ్ల దేవుడైన జానస్ పేరు పెట్టుకున్నారు. జానస్ అనే దేవుడికి రెండు ముఖాలు ఉంటాయి. ఒకటి భవిష్యత్తును సూచిస్తే.. మరొకటి గడిచిన కాలాన్ని గురించి చెబుతాయి. ఈ రకంగా మొట్టమొదటి నెల పేరు జనవరి అయింది. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ ప్రపంచం అంతా సందడి వాతావరణంలో ప్రజలు కేరింతలు కొడుతారు. అమెరికాలో నలభై ఐదు శాతం మంది కొత్త మార్పులు రావాలని వైన్, కేక్‌తో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు.
* నూతన సంవత్సరం రోజు ఆకుకూరలు తింటే సుసంపన్నులౌతారని వారి నమ్మకం. అమెరికన్లు జనవరి ఒకటిన నూతన సంవత్సరం సందర్భంగా షాంపేన్, కేక్స్‌ను పంచుకుంటూ పార్టీలు చేసుకుంటారు. అమెరికాలో ఫుట్‌బాల్ టోర్నమెంటు ప్రత్యక్షప్రసారం అవుతుంది. ఆ ఆటను చూస్తూ నూతన సంవత్సర ఆనందాన్ని బంధుమిత్రుల నడుమ జరుపుకోవడం విశేషం. న్యూయార్క్ టైం స్కేటర్ వద్ద బాల్ డ్రాప్ ప్రత్యేక కార్యక్రమాన్ని 1907 నుండి జరుపుకుంటున్నారు. లండన్‌లో బిగ్‌బెల్ 12 కొట్టగానే బాణసంచా వెలుగుల్ని అందరూ వీక్షిస్తాయి.
* మంటల్లో బొగ్గు వేసి బ్రెడ్‌ని, పానీయాన్ని ఒకరికి ఒకరు పంచుకుని శుభాకాంక్షలు జరుపుకుంటారు. చైనాలో 10-15 రోజులు ఈ వేడుకలు జరుగుతాయి. డ్రమ్ వాయిస్తే శబ్దానికి నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు దూరం అయిపోతుందని వారి విశ్వాసం. సింహం నృత్యాలు విందు వినోదాలతో సమయాన్ని గడుపుతారు. ప్రధానంగా స్నేహితులు, బంధువులను కలుసుకుని ఎర్రని కవరులో డబ్బులు పెట్టి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం శుభసూచకంగా భావిస్తారు. జపాన్‌లో 1873 నుండి గ్రెగేరియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తున్నారు.
* డెన్మార్క్‌లో ఇంటి ముందు కొత్త సంవత్సరం రోజు ప్లేట్లను విసిరి పడేస్తారు. ఎన్ని ప్లేట్లు ముక్కలైతే కొత్త సంవత్సరంలో అంతమంది కొత్త స్నేహితులు పరిచయం అవుతారని వారి నమ్మకం.
* స్పెయిన్‌లో ఒక్కో గంటకి ఒక్కొక్కటిగా 12 ద్రాక్షపండ్లని తింటారు. నూతన సంవత్సరం ప్రేమ, సౌభాగ్యాలని తీసుకురావాలని ప్రార్థనలు చేస్తారు.
* భారతదేశంలోని ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, గోవా, పాండిచ్చేరి వంటి ప్రముఖ నగరాల్లో రాత్రి నుంచి నైట్ క్లబ్బులు, థియేటర్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, అమ్యూజ్‌మెంట్ పార్కులు జనాలతో నిండిపోతాయి. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సందేశాలు, గ్రీటింగ్ కార్డులు, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. *