మెయిన్ ఫీచర్

భేదకారణం ఉపాధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
వీటి లక్షణలో ఏకత్వమున్న కారణంగా పరస్పర విరుద్ధ్ధర్మములు లేని జీవేశ్వరుల ఐక్యతను తత్త్వమస్యాది వాక్యాలతో బోధింపబడినదని ఇచ్చట స్పష్టము చేయబడినది.
245. తయోర్విరోధో‚ య ముపాధికల్పితో
న వాస్తవః కశ్చిదుపాధిరేషః
ఈశస్య మాయా మహదాదికారణం
జీవస్య కార్యం శృణు పంచకోశాః॥
జీవేశ్వరులుగా నిర్దేశింపబడుతున్న ఈ ఇరవురి మధ్య భిన్నత్వము కేవలము ఉపాధివలన కల్పింపబడుతున్నది. యథార్థతః జీవేశ్వరులు అభిన్నము. మహదాదులకు కారణమైన మాయ. ప్రజాపతి లేక ఈశ్వరుడని నిర్దేశింపబడుతున్న పురుషుని ఆవరించిఉన్నది. కార్యరూపంగా పంచకోశములతో నిర్మితమైన దేహము, జీవాత్మకు ఉపాధి అవుతున్నది. శిష్యా! నీవు శ్రద్ధగా ఆలకించి ఈశ్వర తత్త్వమును తెలిసికొనుము.
246. ఏతావుపాధీ పరజీవయోస్తయోః
సమ్యజ్నిరాసే న పరో న జీవః
రాజ్యం నరేన్ద్రస్య భటస్య ఖటేకః
తయో రపోహే న భటో న రాజా॥
మాయ ఈశ్వరునకు, పంచకోశములు జీవునకు ఉపాధి అవుతున్నవి. ఈ ఉపాధులను తొలగిస్తే ఈశ్వరుడూ లేడు, జీవుడూ లేడు. ఏవిధముగాననగా, రాజ్యము రాజుకు ఉపాధి అయినట్లే(డాలు) ఆయుధము భటుడుకి ఉపాధి. ఆ ఉపాధులు లేకపోతే ఇద్దరిమధ్య అంతరం కనిపించదు. రాజ్యములేని రాజులోను, డాలులేని భటుడిలోను, భేదము ఏమీఉండదు. అదే విధంగా, ఈశ్వరుని మాయ, జీవునిలోని అజ్ఞానము తొలగిపోయిన, ఇరువురిలోను చిన్మాత్రరూపమే మిగిలి ఉండును.
శ్రుతి నానాత్వమును నిరాకరిస్తున్నది. ‘‘నేహ నానాస్తి కించన’’ (పరబ్రహ్మ దర్శన విషయమందు కొంచమైననూ నానాత్వము లేదు బృ.ఉ.4-4-19). సర్వాత్మకమైన బ్రహ్మము సమస్తజీవులందు ఒకే స్వరూపములో ఆత్మగా ప్రకాశిస్తున్నది.
247. అథాత ఆ దేశ ఇతి శ్రుతిః స్వయం
నిషేధతి బ్రహ్మణి కల్పితం ద్వయమ్‌
శ్రుతిప్రమాణామగృహీతయుక్త్యా
తయోర్నిరాసః కరణీయ ఇత్థమ్‌॥
శ్రుతి కార్యరూపములోనున్న సమస్తమును ఇది బ్రహ్మముకాదని ‘‘అథాత ఆదేశః నేతి నేతి’’అని నిరాకరించమని పల్కుతున్నది (బృ.ఉ.2-3-6). శ్రుతి ఆదేశానుసారము ఉపాధులను, యుక్తితో బ్రహ్మముకాదని తొలగించిన, బ్రహ్మమందు కల్పితమైన ద్వైతభావన, నానాత్వం నిరాకరించబడుతుంది. ‘తత్త్వమసి’వాక్యంతో జీవేశ్వరుల అభిన్నత్వం ఆవిధముగానే స్థిరీకరించబడినది.
ప్రకృతః కార్యప్రపంచమునకు ఉనికి(సత్త)లేదు. జగత్తులో సమస్తమునకు ఆధారభూతము (అధిష్ఠానము) బ్రహ్మమే. ఉపాధులైన పంచకోశములను, మాయను బ్రహ్మపదార్థములు కావని నిరాకరించిన, ద్వైతభావన, నానాత్మభావన తొలగిపోవును.
248. నేదం నేదం కల్పితత్వాన్న సత్యం
రజ్జౌ దృష్టవ్యాలవ త్స్వప్నవచ్చ
ఇత్థం దృశ్యం సాధుయుక్త్వా వ్యపోహ్య
జ్ఞేయః పశ్చాదేకభావస్తయోర్యః॥
శ్రుతి బోధనలననుసరించి ‘‘కార్యోపాధి జీవః కారణోపాధి ఈశ్వరః’’ అని నిర్ధారించబడింది (శే్వ.ఉ.4-4-10). అందువలన, ఈశ్వరోపాధియైన మాయను, జీవోపాధియైన పంచకోశదేహమును యథార్థము కావని రెండింటిని నిరాకరించవలెను. అట్టి నిరాకరణతో త్రాడును చూచి సర్పమని కలిగిన అపోహ, స్వప్నావస్థలో పొందిన సుఖదుఃఖానుభూతి ఎట్లు వాస్తవముకావో, అట్లే జగత్తు కల్పితము కేవలము మిథ్య అనే యథార్థ జ్ఞానము పొందశక్యము. అటు పిమ్మట, యుక్తిబలముతో బాగుగా పరిశీలించిన, జగత్తులో వ్యాపించిన సర్వమూ, అధిష్ఠాన భూతమైన బ్రహ్మమునకు భిన్నము (అన్యము)కాదనే అవగాహన కలుగును. జిజ్ఞాసువులకు, జీవేశ్వరుల అభిన్నతే తెలిసికొనదగినది. ఇదే ‘జీవో నాపరః’(జీవుడు అన్యుడుకాడు) అనే అద్వైతబోధన సారాంశము.
249. తతస్తు తౌ లక్షణయా సులక్ష్యౌ
తయోరఖండైకరసత్వ సిద్ధయే
నాలం జహత్యా న తథా‚ జహత్యా
కింతూభయార్థైకతయైవ భావ్యమ్‌॥
జీవేశ్వరుల ఏకత్వమును స్థాపించుటకు లాక్షణికులు(తర్క శాస్తజ్ఞ్రులు) నియుక్తించే విధానములలో ఏది సరియైనదో ఈ శ్లోకములో స్పష్టము చేయబడినది. లక్షణమనగా నిర్వచనమనే తార్కికుల సిద్ధాంతము వాక్యార్థము పూర్తిగా తెలియజేయనప్పుడు, అస్పష్టత ఉన్నప్పుడు, మూడువిధములైన లక్షణ నిరూపణ ప్రతిపాదించబడింది. మొదటిది జహల్లక్షణ(జహతి), దీనికి ఉదాహరణముగా ‘గంగాయాం ఘోషః’అనే వాక్యాన్ని సామాన్యంగా వాడుదురు.
ఇంకా ఉంది