మెయిన్ ఫీచర్

ఆత్మ సర్వవ్యాపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
వాక్యార్థము గంగలో గోకులము ఉన్నది. అది సంభవము కాదు, కాబట్టి గంగఒడ్డున గోకులము ఉన్నదనే అర్థం చెప్పబడుతుంది. భగవత్పాదులవారు, జీవేశ్వరుల ఏకత్వము జహల్లక్షణ ప్రతిపాదనతో కుదరదని స్పష్టము చేస్తున్నారు.
ఇక రెండవది, అజహల్లక్షణ (అజహతి). దీనికి ‘శే్వతోధావతి’అనే వాక్యము ఉదహరింపబడుతుంది. ‘గంగాయాం ఘోష’వలె ఇచ్చట కూడ వాక్యార్థం కుదరదు. తెల్లని రంగు పరిగెత్తదుకదా! అందుచేత తెల్లని గుఱ్ఱము పరిగెత్తుతున్నదనే లక్ష్యార్థం చెప్పబడుతుంది. శంకరులవారు, జీవేశ్వరుల ఐక్యతను నిరూపించుటకు అజహల్లక్షణ ఉపయుక్తము కాదని దానినీ నిరాకరించారు. అందువలన, మూడవదైన జహదజహల్లక్షణ శుద్ధాత్మలైన జీవేశ్వరుల ఏకత్వస్థాపనకు స్వీకరించవలెనని నిర్ధారించారు.
వాచ్యార్థము లేక ముఖ్యార్థమును గ్రహించిన తాత్పర్యము బాధితవౌతున్నది. అందువలన, పూర్తి నిరాకరణ, పూర్తి స్వీకరణలేని జహదజహల్లక్షణను గ్రహించిన, రెండు అర్థములకు ఏకత్వము (ఉభయార్థైకత) సిద్ధిస్తున్నది. జీవేశ్వరుల ఐక్యతను ‘తత్త్వమసి’అని తెల్చే తత్-త్వం పదార్థములలో స్వస్వరూప యథార్థజ్ఞానము తప్ప ఇతర సంబంధమేదీ లేదు. అందువలన, జహదజహల్లక్షణ స్వీకరించదగినది. రానున్న శ్లోకములలో ఈ ప్రస్తావన దృష్టాంతములతో నిరూపింపబడుతున్నది.
251. సంలక్ష్య చిన్మాత్రతయా సదాత్మనోః
అఖణ్డ్భావః పరిచీయతే బుధైః
ఏవం మహావాక్యశతేన కథ్యతే
బ్రహ్మాత్మనోరైక్య మఖణ్డ్భావః॥
పై రెండు శ్లోకముల భావము సులభంగా అర్థమయ్యే విధంగా వాటి వ్యాఖ్యానము ఒకేచోట ప్రస్తావించడమైనది. ‘ఆ దేవదత్తుడే ఇతడు ఇచ్చట’ అనే వాక్యము రెండు సందర్భాలలో అనగా రెండు ప్రదేశములలోను, రెండు కాల వ్యవధులలోను చూచిన దేవదత్తుడు ఒకే అనే భావమును సూచిస్తున్నది. ఈ రెండు సందర్భములలో అతని రూపాదులలో వ్యక్తమయ్యే మార్పులను పరగణించక, ఆ వ్యక్తియే ఈ వ్యక్తి అని వ్యక్తము చేయుటయే దీని తాత్పర్యము. అట్లే జీవేశ్వరుల ఏకత్వమును బోధించుటకు ‘తత్త్వమసి’, ‘సో‚హం’ ఇత్యాది అనేక మహా వాక్యములను తత్త్వజ్ఞులు నిర్దేశించారు. జీవాత్మ-పరమాత్మ, ఉభయులలో నున్న జ్ఞాన స్వరూప ఏకత్వాన్ని ఈ మహా వాక్యములు స్థిరీకరిస్తున్నవి.
బ్రహ్మ భావన
252. అస్థూల మిత్యేత దసన్నిరస్య
సిద్ధం స్వతో వ్యోమన దప్రతర్కృమ్‌॥
యతో మృషామాత్ర మిదం ప్రతీతం
జహీహి యత్స్వాత్మతయా గృహీతమ్‌
బ్రహ్మాహమిత్యేవ విశుద్ధబుద్ధ్యా
విద్ధి స్వమాత్మాన మఖణ్డబోధమ్‌॥
అదృశ్యవౌతున్న ఈ శరీరాదులు స్థూలపదార్థములు. ‘‘అస్థూలం, అసణు, అహ్రస్వం, అదీర్ఘం’’ (స్థూలము కానిది, అణువు కానిది, కురుచకానిది, పొడుగు కానిది) ఇత్యా ది పదములతో ఆత్మను నిర్దేశిస్తూ శ్రుతి ప్రకటిస్తున్నది (బృ, ఉ.3-8-8-). శరీరముపై అభిమానము పెంచుకున్న అవివేకులు, ఆత్మ శరీరము కాదని తెలిసికొనలేక, శరీరము తాదాత్మ్యము చెందుతున్నారు. వారు శరీరమును నిషేధించి బ్రహ్మాత్మభావన పొందలేకపోతున్నారు.
ఆత్మ బ్రహ్మస్వరూపము. పరిధులు లేనిది. ఆకాశము వలె సర్వవ్యాపి. ఊహించ శక్యము కానిది. తత్త్వజ్ఞానులు బోధించిన రీతిలో శ్రవణమననాది సాధనల ద్వారా ‘నేను బ్రహ్మమును’ అనే భావనతో సదా ఉన్నచో, అఖండ జ్ఞానస్వరూపమైన ఆత్మ యొక్క అనుభూతి స్వయముగా కలుగును. అందువలన, నశించే అసద్వస్తువైన శరీరము, ఆత్మ అనే భ్రాంతిని విడనాడి, సత్పదార్థమైన ఆత్మ తత్త్వమును తెలిసికొనటుకు ప్రయత్నము చేయటమే నీవంటి ముముక్షువుల కర్తవ్యము.
శ్లో. 253
మృత్కార్యంస్త సకలం ఘటాది సతతం మృన్మాత్రమెవాధిత
స్తద్వత్సజ్జనితం సదాత్మకమిదం సన్మాత్రమేవాఖిలమ్‌
యస్మాన్నాస్తి సతః పరం కిమపి తత్సత్యం స ఆత్మా స్వయం
తస్మాత్ తత్త్వమని ప్రశాస్తమమలం బ్రహ్మాద్వయం యత్పరమ్‌॥
ఉద్దాలకుడనే బ్రహ్మవేత్త, ‘తత్త్వమని’ అనే వాక్యముతో ‘ఆ బ్రహ్మస్వరూపమే నీవు’ అని శే్వతకేతువునకు బోధించెనని శ్రుతి తార్కాణము (్ఛ. ఉ.6-ఖ. 10 నుంచి 16) ఈ శ్రుతి తార్కాణమును పురస్కరించుకొని కారణమునకు కార్యమెన్నడూ వ్యతిరిక్తము కాదని మృత్-ఘటాదుల దృష్టాంతములో ఈ శ్లోకములో శంకరుల వారు బోధిస్తున్నారు.
మట్టితో కార్యరూపములుగా అవతరిస్తున్న వివిధ వస్తువులకు నామరూపములు భిన్నమైనా వాటిలో సర్వత్ర వ్యాపించి ఉన్నది మట్టి మాత్రమే. మన్ను మూలము, ఉపాదనకారణము.
ఇంకా ఉంది