మెయిన్ ఫీచర్

అపరిమితం పరమాత్మ విభూతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
కార్యరూపము దాల్చక పూర్వమూ, కార్యరూపము దాల్చిన పిదప నశించిన తరువాత, అవి నామరూపములను కోల్పోయి మట్టిలోనే కలసిపోవును. అదేవిధంగా, సద్రూపమైన బ్రహ్మము సమస్త భూతములందు వ్యాపించి చేతనత్వము కల్పిస్తున్నది. జగత్తులో ఉన్న సకల చరాచరముల సృష్టి స్థితి లయములకు బ్రహ్మమే కారణము. తద్వ్యతిరిక్తమైన సద్వస్తువు మరేదీ లేనందున అది అద్వితీయము. పరమాత్మ స్వయంజ్యోతి. దాని కారణముగానే జగత్తులో సమస్తము ప్రకాశిస్తున్నది. వికారశూన్యము, ప్రశాంతము, జ్ఞానస్వరూపమైన పరబ్రహ్మమే నీలో ఆత్మగా భాసిస్తున్నదని తెలిసికొనుము. అపోహలను విడచి ఈ దేహము నీవు కాదు; ఆ బ్రహ్మ స్వరూపమే నీవని నిర్థారించుకొనుము.
శ్లో.254
నిద్రాకల్పిత దేశకాల విషయజ్ఞాత్రాది సర్వం యథా
మిథ్యా తద్వదిహాపి జాగ్రతి జగత్స్వాజ్ఞాన కార్యత్వతః
యస్మాదేవమిదం శరీరకరణ ప్రాణాహమాద్యప్యసత్
తస్మాత్ తత్త్వమసి ప్రశాస్త మమలం బ్రహ్మాద్వయం యత్పరమ్‌॥
స్వప్నములో దృశ్యమయ్యే ప్రదేశములు, కాలవిశేషములు, విషయములు, జ్ఞాత ఇత్యాది సమస్తము వాస్తవికతలేని మిథ్యా రూపములు. అదేవిధంగా జాగ్రదవస్థలో సహితము స్వయముగా అజ్ఞానము చేత కల్పిచుకొనిన యావత్ ప్రపంచము మిథ్య అనే గ్రహించవలెను. శరీరము, ఇంద్రియములు, ప్రాణములు ఇత్యాదులన్నీ అసద్వస్తువులు. వాటికి వాస్తవముగా ఉనికి లేనే లేదు. సద్రూపమైన నీ ఆత్మయే వాటన్నింటికి ఆధారము. ప్రశాంతమైన, నిర్మలమైన, అద్వితీయమైన నీ ఆత్మ పరబ్రహ్మ స్వరూపము. అందువలన, నీవు బ్రహ్మమమని తెలిసికొనుము.
255. జాతి నీతి కులగోత్ర దూరగం
నామరూప గుణదోష వర్జితమ్‌
దేశకాల విషయాతివర్తి యత్
బ్రహ్మతత్త్వమసి భావయాత్మని॥
ఆ బ్రహ్మమే నీవనే భావనతో ఉండుము.
అథర్వణవేదీయ శ్రుతి ‘‘యత్తదద్రేశ్య మగ్రాహ్య మగోత్ర మవర్ణమ్’’ అని పరబ్రహ్మ నిర్దేశము చేస్తున్నది (పరబ్రహ్మము దృశ్యము కానిది, అగ్రాహ్యము, గోత్రము, వర్ణము లేనిది - ము. ఉ. 1-1-6). అదేవిధంగా, ‘‘హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలమ్’’ మరో శ్రుతి పల్కుతున్నది (నిరవయవము, నిర్మలము, గుణశూన్యము, జ్యోతిర్మయమైన ప్రత్యగాత్మను బ్రహ్మవేత్తలు దర్శించుకొందురు - ము.ఉ.2-2-9).
256. యత్పరం సకలవాగ గోచరం
గోచరం విమల బోధ చక్షుషః
శుద్ధ చిద్ఘనమనాది వస్తు యద్
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని॥
పరబ్రహ్మము వాగాది సమస్త ఇంద్రియములకు అగ్రాహ్యము. నిర్మలమైన మనస్సు గల వారు మాత్రమే శుద్ద జ్ఞాన స్వరూపమైన పరమాత్మను వారి జ్ఞాననేతోన్మీలన తో దర్శించు కొందురు. అనాది, త్రికాలాతీతము, సద్వస్తువైన ఏ బ్రహ్మమున్నదో, ఆ పరబ్రహ్మ స్వరూపమే నీవని తెలిసికొని, నీ మనస్సులో మరో ఆలోచన లేక అదే భావనతో ఉందు ము. ‘‘పశ్యంతి జ్ఞానచక్షుషః’’ (జ్ఞానదృష్టి కల వారు మాత్రమే ఆత్మను దర్శించుకొందురు) అని స్మృతి తార్కాణము - భ.గీ. 15-10)
257. షడ్భి రూర్మిభి రయోగి యోగిహృ
ద్భావితం న కరణై ర్విభావితమ్‌
బుద్ధ్యవేద్య మనవద్యభూతి యద్
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని॥
జరామరణములు, క్షుత్పిపాసలు, శోకమోహములు, ఈ ఆరింటిని షడ్మూర్మములందురు. ఇవి సముద్ర తరంగముల వలె శరీరములో పెల్లుబుకుతు కలత చేయును (బాధించును). జరామరణములు స్థూల శరీర ధర్మములు. క్షుత్పిపాసలకు సూక్ష్మ శరీరముతో సంబంధము. శోక మోహములకు కారణ శరీరముతోను సంబంధము. ఆత్మకు ఈ ఆరు ఊర్ములతోనూ ఎట్టి సంబంధము లేదు. నిర్ధిష్టమైన ఐశ్వర్యముతో నీ యందున్న ఆత్మ బ్రహ్మ పదార్థము. కానీ బ్రహ్మ స్వరూపమైన నీ ఆత్మ కాదు. అందుచేత, ఆ బ్రహ్మమే నేను అనే భావనతో నిత్యము ఉండుము.
258. భ్రాన్తికల్పిత జగత్కలాశ్రయం
స్వాశ్రయం చ సదసద్విలక్షణమ్‌
నిష్కలం నిరుపమానమృద్ధిమత్
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని॥
పరమాత్మ విభూతి, మహిమ లేక ఐశ్వర్యము అపరిమితము. పరమాత్మ నాలుగు పాదములలో కేవలము ఒక పాదము మాత్రమే ఈ ప్రపంచములో మూర్తామూర్త రూపములలో ఉండగా, మిగతా మూడు పాదములు (అనగా మూడు వంతులు) దివిలో ఉన్నవని ఋగ్వేదవచనం ‘‘పాదో‚స్య విశ్వాభూతాని అతిపాదస్యామృతం దివి’’ (పు.సూ) ‘‘ఏకాంశేన స్థితో జగత్’’ అని స్మృతి వాక్యము (్భ.గీ.10-42).
ఇంకా ఉంది