మెయిన్ ఫీచర్

సమస్తమూ పరబ్రహ్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
బంగారముతో నిర్మితమైన వివిధ ఆభరణముల పేర్లు, ఆకారములు ఎన్ని ఉన్ననూ వాటికి మూలపదార్థము బంగారమే. అదే విధముగా, జగత్తులో కార్యరూపములో ఆవిర్భవించిన సమస్తమునకు హేతువు బ్రహ్మము తప్ప ఇంకొకటికాదు. అందువలన, సత్స్వరూపమైన బ్రహ్మమే నీవనే భావనతోనే సదా ఉండుము.
264. యచ్చకాస్త్యనపరం పరాత్పరం
ప్రత్యగేకరస మాత్మలక్షణమ్‌
సత్యచిత్సుఖ మనన్త మవ్యయం
బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని॥
హిరణ్యగర్భుడని, కార్యబ్రహ్మ అని నిర్దేశింపబడుతున్న ప్రజాపతి కంటెను, నిర్గుణ పరబ్రహ్మము అత్యంత పవిత్రము, శ్రేష్ఠమైనది. సర్వోత్కృష్టమైన పరబ్రహ్మము ‘అనపరం’, ఏ కార్యములేని ‘నిష్క్రియి’అని శ్రుతి నిర్ధారిస్తున్నది. ఈ జగత్తు ఆవిర్భావమునకు కారణమైన పరబ్రహ్మము, మాయారూపమైన కార్యబ్రహ్మను సృష్టించి, వాని అధీనములో జగత్కార్యనిర్వహణ జరుగునట్లు ఏర్పాటుచేయడమైనది. ప్రత్యగాత్మ పరబ్రహ్మ స్వరూపము; అది పరిధులు లేని అనంతము మరియు అవ్యయము. అనగా, వ్యయరహితమైన అక్షయము.
265. ఉక్త మర్థమిమమాత్మని స్వయం
భావయ ప్రథితయుక్త్భిర్ధియా
సంశయాది రహితం కరామ్బువత్
తేన తత్త్వనిగమో భవిష్యతి॥
ఇంతవరకు నీవు బ్రహ్మస్వరూపమని, జీవ పరమాత్మల ఏకత్వమును నేను బోధించితిని. ఈ విషయముపై, శ్రుతిసమ్మతమైన యుక్తులతో నీవు స్వయముగా అంతఃకరణమును శుద్ధిగావించి, నిశ్చతబుద్ధితో భావన కొనసాగించుము. దానితో, సంశయమునకు తావులేక, అరచేతిలోని శుద్ధ జలమువలె, నీకు ఆత్మతత్త్వము పరిపూర్ణముగా విదితమగుట తథ్యము.
266. స్వం బోధమాత్రం పరిశుద్ధతత్త్వం
విజ్ఞాయ సంఘే నృపవచ్చ సైనే్య
తదాత్మనైవాత్మని సర్వదా స్థితో
విలాపయ బ్రహ్మణి దృశ్యజాతమ్‌॥
శాసకుడైన రాజు ఎట్లు తన చిహ్నములతో రణరంగములో సైన్యమును నడిపించునో, అట్లే దేహములోనున్న అంగములను, ఇంద్రియములను, ప్రాణములను, చిత్తాహంకారాది సమూహమును, జ్ఞాన స్వరూపమైన ఆత్మ ప్రకాశవంతముచేస్తూ దేహధారునకు సమస్తమును తెలియపరుస్తున్నది. అందువలన, ఆత్మతత్త్వమును నీవు ఆకళించుకొని, ఆత్మలోనే బుద్ధిని స్థిరముగా నిల్పి, కార్యరూపములో ఈ దృశ్య ప్రపంచములోనున్న సమస్తమును బ్రహ్మమందు విలీనము చేయుము.
267. బుద్ధౌ గుహాయాం సదసద్విలక్షణం
బ్రహ్మాస్తి సత్యం పరమద్వితీయమ్‌
తదాత్మనా యో‚ త్ర వసేద్గుహాయాం
పునర్నతస్యాంగగుహాప్రవేశ.॥
సదసద్వి లక్షణమైనది, సత్యమైనది, అద్వితీయమైన పరబ్రహ్మము బుద్ధి అనే గుహలో ఉన్నది. ఏ వ్యక్తి, బ్రహ్మాత్మభావనతో ఆ గుహలో నివాసముండునో వానికి మరల దేహమనే గుహలో ప్రవేశము లేదు. అనగా, వానికి మరల దేహధారణ ఉండదు. పునరావర్తనము లేక జన్మరాహిత్యమును పొందును.
ఆత్మస్థానము హృదయాంతరాళములోనున్నదని శ్రుతివాక్యములు నిర్ధారిస్తున్నవి. ‘‘య ఏషో‚న్తర్ హృదయ ఆకాశస్తస్మిన్ శేతే’’ (హృదయమధ్యమందు ఈ ఆత్మ ఉన్నది-బృ.ఉ.2-1-17). ‘‘ఏష మ ఆత్మా అంతర్ హృదయే‚ ణీయాన్ వ్రీహేర్వా యావాద్వా’’ (హృదయ పుండరీకమందు ఆత్మ వడ్లగింజకంటెను, యవగింజ కంటెను అత్యంత సూక్ష్మముగా అణుస్వరూపములో ఉన్నది- ఛా.ఉ.3-14-3). బ్రహ్మాత్మభావనతో ‘‘స్వేన రూపేణాభినిష్పద్యతే’’ సమస్త బంధముల నుండి విముక్తుడై ఆత్మస్వరూపుడౌను అని కూడ శ్రుతి ప్రకటిస్తున్నది. - ఛా.ఉ.8-12-3).
పూర్వవాసనా త్యాగము
268. జ్ఞాతే వస్తున్యపి బలవతీ వాసనా‚ నాది రేషా
కర్తా భోక్తాష్యహమితి దృఢా యా‚స్య సంసారహేతుః
ప్రత్యగ్ దృష్ట్యాత్మని నివసతా సాపనేయా ప్రయత్నాత్
ముక్తిం ప్రాహు స్తదిహ మునయో వాసనాతానవం యత్‌॥
బ్రహ్మపదార్థమైన ఆత్మ దేహమునకు వ్యతిరిక్తమని బ్రహ్మాత్మ భావనతో తెలిసికొనిననూ, అనాదిగా కొనసాగుతున్న పూర్వజన్మ వాసనలు చాల బలమైనవి. అందువలన, నిశే్శషముగా అవి తొలగిపోవు. సంసార బంధనమునకు అవియే మూలకారణము. నేను కర్తను, నేను భోక్తను అనే కర్తృత్వ భోక్తృత్వ భావన నశించనంతవరకు వాసనాపరంపర కొనసాగుతునే ఉండును.
ఇంకా ఉంది