మెయిన్ ఫీచర్

వాసనే బలవత్తరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
273.సంసారకారాగృహమోక్షమిచ్ఛోః
అయోమయం పాదనిబద్ధశృంఖలమ్
వదన్తి తత్‌జ్ఞాః పటువాసనాత్రయం
యో స్మాద్విముక్త స్స ఉపైతి ముక్తిమ్
పటిష్టమైన వాసనాత్రయములనుండి బంధ విముక్తి ఎంత కష్టమనగా, సంసారమనే కారాగారమందు ఇనుప సంకెళ్ళతో బంధింపబడినవాడు ఆ సంకెళ్ళను త్రెంచుకొని బయటపడుట ఎంత కష్టతరమో అటువంటిదని ఆత్మజ్ఞానులు అందురు. సమ్యక్ జ్ఞానార్జనతో ఈమూడు వాసనలు, మోక్షప్రాప్తికి ప్రతిబంధకములని తెలిసికొని, స్వయంకృషితో ఈ అజ్ఞాన రూపమైన అడ్డంకులనుర అధిగమించిన జిజ్ఞాసువు, సంసారబంధవిముక్త తప్పక పొందును.
274. జలాదిసంపర్కవశాత్ ప్రభూత
దుర్గన్ధ్ధూతా గరుదివ్యవాసనా
సంఘర్షణేనైవ విభాతి సమ్య
ద్విధూయమనే సతి బాహ్యగనే్ధ
ముందు ప్రస్తావించినవాసనత్రయము ఎట్లు నశించునో ఒక దుష్టాంతముతో ఇచ్చట చెప్పబడినది. అగరుచందనాదులలో జలాదుల సంపర్కమువలన, కల్మషములు చేరి దుర్గంధపూరితములై ఉన్ననూ, ఆ చెక్కలను రాతిపైన అరుగదీయగా బాహ్యమైన ఆ దుర్గంధము పూర్తిగా తొలగిపోయి సువాసన గుబాళించును.
275. అస్తః శ్రీతానస్తదురన్త వాసనా
భూలీవిలిప్తా పరమాత్మవాసనా
ప్రజ్ఞాతిసంఘర్షణతో విశుద్ధా
ప్రతీయతే చన్దనగన్థవత్ స్ఫుటా
దేహాది అనాత్మవాసనలు పేరుకుపోయి మోక్షప్రాప్తికి అవరోధము కలిగించును. ఈ ప్రతిబంధకములను నివారించుకొనుటకు పరమాత్మవాసనయే శరణ్యము. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనే శ్రుతివాక్కు మహావాక్యముగా ప్రసిద్ధము. ప్రజ్ఞానము బ్రహ్మనిష్ఠను కలుగజేయును. ప్రజ్ఞచే పరమాత్మవాసనను పెంపొందించుకొని, అనాత్మవాసనలకు మూలమైన అవిద్యను తొలగించుకొన సాధ్యము. మనోబుద్ధ్యాదుల సంబంధము, కశముల నుండి వీడిపడిన దేహాత్మభావన తొలగిపోవును. మనస్సును ధీశక్తితో పరమాత్మయందే నిత్యము నిల్పిన, తద్వసనతో కల్మషపూరితమైన అనాత్మవాసనలు నశించి, చందనాదుల పరిమళము ఎట్లు సంఘర్షణచే (రాయుటచేత) ప్రకటివౌనో అట్లే చిన్మాత్రావృత్తి ద్వారా స్వస్వరూప దర్శనము సాధ్యమగును.
276. అనాత్మవాసనాజాలై స్తిరోభూతాత్మవాసనా
నిత్యాత్మనిష్ఠయా తేషాం నాశే భాతి స్వయం స్ఫుటా
లోకదేహశాస్తవ్రాసనలనే వలలో చిక్కుకొని మరుగుపడిన ఆత్మవాసన, సుదృఢ బ్రహ్మనిష్ఠతో ప్రజ్వలించగా, అనాత్మవాసనల జాలము నశించిపోయి, పరబ్రహ్మస్వరూపమైన ఆత్మతేజోవంతమై ప్రకాశించును.
277. యథా యథా ప్రత్యగవస్థితం మనః
తథా తథా ముంచతి బాహ్యవాసనాః
నిశే్శషమోక్షే సతి వాసనానాం
ఆత్మానుభూతిః ప్రతిబన్ద శూన్యా
మనస్సు హృదయాంతరాళములో ఏ విధముగా బ్రహ్మభావనతో స్థిరముగా నిల్చి ఉండునో, ఆ విధముగనే దేహాది బాహ్య వాసనలు వీడిపోవును. లోక దేహ శాస్తవ్రాసనలు శేష రహితముగా అంతమై బ్రహ్మాత్మభావన మాత్రమే బుద్ధిగుహలో నిల్చిపోవును.
మన్సు ప్రశాంతమై, దేహపరమైన మమకారాదులు అంతమైన వెనె్వంటనే ఆత్మానుభూతి ఎట్టి ప్రతిబంధములు లేక కలుగును. ప్రత్యక్షాత్మానుభూతియే బంధ విముక్తికి నిదర్శనము. భగవద్గీత బోధన దీనినే ఇలా స్థిరీకరిస్తున్నది.
‘వలిహాయ కామాన్ య స్సర్వాన్
పుమాంశ్చరతి నిఃస్పృహః
నిర్మమో నిరహంకారః స శాంతిమధిగచ్ఛతి
ఏ వ్యక్తి కోరికలన్నింటినీ త్యజించి, దేనియందూ ఆసక్తి చూపక, అహంకారమును, మమకారమును లేనివాడై ఉండునో, అతడే పరమశాంతిని పొందును.
278. స్వాత్మనే్యవ సదా స్థిత్వా మనో నశ్యతి యోగినః
వాసనానాం క్షయ శ్చాతః స్వాధ్యాసాపనయం కురు
యోగి(జ్ఞాని) యొక్క మనస్సు సదా ఆత్మయందే లగ్నమై బ్రహ్మభావనతో స్థిరముగా ఉన్నందువలన, మన్సు ఆత్మలో లయమై సమస్త మనోవికారములు నశించును. చిత్తములో నెలకొన్న దేహాది వాసనలు సమస్తమూ అంతమైపోవును. అపోహలు అడగుంటి, బుద్ధి యథార్థమును తప్ప ఇతరుములను గ్రహించదు. పంచకోశములందు అధ్యస్తవౌతున్న దేహాత్మబుద్ధి కేవలము అజ్ఞానజనితమని దానిని నిరాకరించి, నీవు యథార్థతను గ్రహించి బ్రహ్మాత్మభావనతో అనునిత్యమూ ఉండుము.
ఇంకా ఉంది