మెయిన్ ఫీచర్

మనోజనిత వికారములు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
294. సర్వాత్మనా దృశ్యమిదం మృషైవ
నై వాహమర్థః క్షణిక్వదర్శనాత్‌
జానామ్యహం సర్వమితి ప్రతీతిః
కుతో‚ హమాదేః క్షణికస్య సిధ్యేత్‌॥
అహం అనే పదముతో అంతరాత్మ నిర్దేశింపబడుతున్నది. ఆత్మ నిత్యమైనది. క్షణికత్వమున్నది ఇంద్రియానుభూతి. నేను ఫలము తింటున్నాను. నేను నాటకము చూస్తున్నాను. నేను వీణ వాయిస్తున్నాను. ఇటువంటి వాక్యములలో వ్యక్తవౌతున్న అనుభూతి కేవలము శరీరమునకే పరిమితము. అది ప్రాపంచికము మరియు అనిత్యము. తద్వృతిరిక్తమైన ‘అహం’ శుద్ధ జ్ఞాన స్వరూపము, సర్వము తెలిసికొనే సత్పదార్థము. శరీరావయవములైన మనస్సు, బుద్ధి, అహంకారములకు ‘అహం’ శబ్దము వర్తించదు. అభాసరూపములకు అస్తిత్వము లేదు. వాటిని అప్రమాణకములు, మృషా, అసత్యమైనవనే గ్రహించాలి.
295. అహంపదార్థస్త్వ హమాదిసాక్షీ
నిత్యం సుషుప్తావపి భావదర్శనాత్‌
బ్రూతే హ్యజో నిత్య ఇతి శ్రుతి స్స్వయం
తత్ప్రత్యగాత్మా సదసద్విలక్షణః॥
ముందున్న శ్లోకములలో జీవేశ్వరుల అభిన్నత స్పష్టము చేయబడినది. అంతకు పూర్వము, ఆత్మలక్షణములను, పరమాత్మ తత్త్వమును బోధంచిన సందర్భములో, ఉపాధివశమున దేహమును ఆశ్రయించిన జీవాత్మ, పరమాత్మస్వరూపమని, ఆద్యంతములు లేనిదని, నశ్వరమైన దేహమునకు భిన్నమని విశదీకరించబడినది. ఉపసంహారములో ప్రత్యగాత్మ అంతఃకరణాదులకు విలక్షణమని మరల పునరుక్తి చేయబడుతున్నది. నిరంతరము సాక్షిగా వ్యవహరించే జీవాత్మ నిష్క్రియి. దేహధారుడే, కర్తగాను, భోక్తగాను కర్మఫలమును అనుభవించును. జాగ్రత్స్వప్నావస్థలందేకాదు, అంతఃకరణము ఆత్మలో పరిపూర్ణముగా లీనమైపోయిన సుషుప్తి సమయంలోను ఆత్మయొక్క అస్తిత్వమునకు భంగములేదు. సర్వకాలసర్వావస్థలందు జీవాత్మ దేహమందే ఉన్నా, ఏ కార్యభారమును వహించదు.
నిర్వికారి, నిరామయం కావున సుఖదుఃఖములకు అతీతము. వ్యక్తావ్యక్తములకు భిన్నమైంది. అందుచేత సదసద్విలక్షణ మనియూ చెప్పబడుతున్నది. శ్రుతి ప్రమాణము ఇలా ఉన్నది. ‘న జాయతే మ్రియతే వా విపశ్చిన్న బభూవ కశ్చిత్ అజో నిత్యః శాశ్వతో యం పురాణో న హన్యతే హన్యమానే శరీరే (మేధావీ జ్ఞాతా అయిన ఈ ఆత్మ దేనివలనా ఉత్పన్నమైంది కాదు దేనివలనా పరిణమించినది కాదు. శరీరము కృశించినా , నశించినా ఇది మాత్రం శాశ్వతము. జరామరణములు ఆద్యంతములు లేని సనాతమైంది. -క.ఉ.2-18)
ఇంకొక శ్రుతి ఇలా ప్రకటిస్తున్నది. ‘ఏకో దేవః సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వ భూతాంతరాత్మా కర్మాధ్యక్షః సర్వభూతాదధివాసః సాక్షీ చేతా కేవలో నిర్గుణ శ్చ’ (సమస్త ప్రాణులందు ఉన్నది ఒకే ఒక భగవత్స్వరూపము. సర్వవ్యాపియైన పరమాత్మ నిగూఢంగా అందరిలో అంతరాత్మగా దాగి ఉన్నది. శుద్ధ చైతన్యమైన నిర్గుణ పరబ్రహ్మమే సర్వసాక్షిగా అందరి కర్మలను పర్యవేక్షించే అధిష్ఠా. జగత్కర్తగా ఆ పరమాత్మయే సర్వాంతర్యామి సర్వాధ్యక్షుడు.
296 వికారిణాం సర్వ వికార వేత్తా
నిత్యో వికారో భవితుం సమర్హతి
మనోరథ స్వప్న సుషుప్తిషు స్ఫుటం
పునః పునః దృష్టి మసత్త్వ మేతయోః
ఆత్మ సద్వస్తువు కావున నిత్యత్వము కలది. వికార రహితము కావున వికారములకు అతీతమైనది. అజ్ఞానము వలన జీవుడు దేహమాశించే సుఖముల కొరకు మాయామయమైన ప్రపంచములో మోహితుడై కోరికలను విపరీతముగా పెంచుకొనును. వాటి సాధనకై అహోరాత్రములు శ్రమించును. ఈ తపనయే సుఖదుఃఖముల ఉపభోగమునకు కారణవౌతున్నది. దేహమందు, అభిమానము ప్రీతిగలవారికి ఆత్మపై అభిమానము పెరుగును.
స్వప్నములో తాము సృష్టించుకొనిన రథములపై ప్రయాణము చేసినట్లే కొందరుజాగ్రదవస్థలో గాలిమేడలు కట్టి మనోరథము తీరక ఇక్కట్లకు లోనౌతారు. ఈ దురవస్థకు కారణము మనోజనిత వికారములే. సుషుప్తిలో మనస్సు, ఆత్మలో లయమైనందువలన ఎట్టి వ్యధ ఉండదు. ఈవిషయము అనేక పర్యాయములు స్పష్టం చేయబడింది.

ఇంకా ఉంది