మెయిన్ ఫీచర్

వీరమాత జస్వంత్ కౌర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ ముష్కరుడి తుపాకీ తూటాకు బిఎస్‌ఎఫ్ జవాన్ గురునామ్‌సింగ్ బలయ్యాడు. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా సెక్టార్‌లో పాక్ ఉగ్రవాదులు సరిహద్దు దాటి రావడానికి ప్రయత్నించగా గురునామ్ సింగ్ నాయకత్వంలో జవాన్లు గట్టిగా ప్రతిఘటించారు. ఈ సంఘటనలో ఒక ఉగ్రవాది హతం కాగా, మిగిలిన శత్రువులు వెనక్కు తగ్గారు. ఆశ చావని ఉగ్రవాదులు మర్నాడు అదే ప్రాం తంలో నక్కి గురునామ్ (26)ను లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో గురునామ్‌సింగ్ తలలోకి ఓ తూటా వెళ్లిపోయింది. ఒకవైపు ఉగ్రవాదుల కాల్పులకు సమాధానం చెబుతూనే మరోవైపు గురునామ్‌సింగ్ ప్రాణాలు కాపాడేందుకు సహచరులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కన్నీళ్ళు మిగిలాయి.
అణువణువునా భారతీయత
ధీరుడైన భారత జవాన్ గురునామ్‌సింగ్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో అన్నమాటలు యావత్తు జాతి హృదయాల్లో ఎంతో ఉత్తేజాన్ని నింపుతాయి. తాను వీరమరణం పొందితే ఏడవొద్దని తల్లిని ఓదార్చాడు. ఆ మాతృమూర్తి కూడా అంతే ధీరత్వంతో తన కుమారుడికి ‘ఏడవను’ అని మాట ఇచ్చింది. సంఘటన జరిగిన తర్వాత కుమారుడి భౌతిక కాయం చూసినపుడు గురునామ్‌సింగ్ తల్లి జస్వంత్‌కౌర్ కన్నీరు కార్చలేదు.
ప్రధానికి ఆ తల్లిదండ్రుల వినతి
కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న చెట్టంత కుమారుడు పోయి శోక సంద్రంలో వున్న గురునామ్‌సింగ్ తల్లిదండ్రులు జస్వంత్‌కౌర్, కుల్‌బీర్‌సింగ్ తమ దుస్థితికి చలించకపోగా విన్నపాన్ని విన్నవించారు. సరిహద్దుల్లో తీవ్ర గాయాలపాలైన జవాన్లకు మంచి చికిత్స కోసం ఆధునిక సౌకర్యాల గల ఆస్పత్రిని నిర్మించాలని కోరారు. ఆ తల్లిదండ్రుల్లో ఎంతగా దేశభక్తి వుందన్న విషయం ఈ విజ్ఞప్తితో వెల్లడవుతోంది. అంతేకాదు.. అవసరమైతే పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పండని కుల్‌బీర్‌సింగ్ కోరడం అతని దేశభక్తికి నిదర్శనం. జై జవాన్!

- జికెఎం