మెయిన్ ఫీచర్

పరబ్రహ్మ స్వరూపం ఆత్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
సుషుప్తిలో అనుభవ పూర్వకముగానే తెలుస్తున్నది.
‘‘ఏకస్త్థా సర్వభూతాంతరాత్మా న లిప్యతే లోకదుఃఖేన బాహ్యః’’ (పరమాత్మ సర్వభూతాంతరాత్మగా ప్రాణుల దుఃఖముల చేత స్పృశించక దుఃఖమును అనుభవించదు-క.ఉ.2-2-11) ‘‘యత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి, తదితర ఇతరం జిఘ్రతి తదితర ఇతరగ్ శృణోతి ‘‘(అవిద్య కారణంగా దేహేంద్రియ సంఘాతమువలన ఉత్పన్నమైన జీవభావమునందు చూచుట, ఆఘ్రాణించుట, వినుట ఇత్యాదులందు ద్వైతజ్ఞానము కల్గుచున్నది- బృ.ఉ.2-4-14).
ఇచ్చట ఉదహరించినవేకాక బహు శ్రుతివాక్యములు జ్ఞానస్వరూపమైన ఆత్మ అద్వైతము, భేదశూన్యమని నిర్ధారిస్తున్నవి. బ్రహ్మనిష్ఠతో పరమాత్మలో లీనమైన ఆత్మవేత్త జన్మరాహిత్యముతో దుఃఖమును అధిగమించి, శాశ్వత సుఖమును అనుభవించును.
407.
అనన్యత్వ మధిష్ఠానా దారోప్యస్య నిరీక్షితమ్‌
పండితై రజ్జుసర్పాదౌ వికల్పో భ్రాన్తిజీవనః॥
ఆరోపితమైనది అధిష్ఠానమునకు భిన్నముగా ఉండుట అసంభవమని, రజ్జుసర్పాది దృష్టాంతములతో జ్ఞానులు (తత్త్వవేత్తలు) నిరూపించితిరి. భ్రాంతిజనితమైన భేదబుద్ధి, యథార్థ జ్ఞానముపొందిన పిమ్మట పూర్తిగా అంతమగును. అధిష్ఠానమే సత్యము; తదారోపితమైనది మిథ్య. సర్వాధిష్ఠానమైన బ్రహ్మమే సత్యము. బ్రహ్మమందు ఆరోపితమైన జగత్తు మిథ్యని ఇంకొక పర్యాయము ఉపసంహారములో విశదీకరించబడుతున్నది.
ఆత్మచింతన
408.
చిత్తమూలో వికల్పో‚యం చిత్త్భావే న కశ్చన
అతశ్చిత్తం సమాధేహి ప్రత్యగ్రూపే పరాత్మని॥
భేదబుద్ధి మనోజనితము. మనోవ్యాపారములేని సుషుప్తిలో భేదబుద్ధి శూన్యవౌతున్నదని తెలుస్తున్నది కదా! అందువలన, మనస్సును స్థిరముగా పరబ్రహ్మస్వరూపమైన ప్రత్యగాత్మపై నిల్పి, చిత్తఏకాగ్రతను పొందుము.
409. కిమపి సతత బోధం కేవలానన్దరూపం
నిరుపమ మతివేలం నిత్యముక్తం నిరీహమ్‌
నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం
హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ॥
ఇంద్రియ గ్రాహ్యముకానిది అగుటచే ఆత్మ ఏవిధముగానూ వ్యక్తము చేయబడదు. పరమాత్మ స్వరూపమగుటచే అద్వితీయము, సాటిలేనిది. అనంత జ్ఞానస్వరూపము, నిత్యానందమయము, సమస్తమును అతిక్రమించిన ఆత్మ సదాముక్తము, బంధకములు ఏవియులేనిది. పరిధులు లేనిది, దేనియందు ఆకాంక్షలేనిది, కోరికలకు అతీతమైనది. ఆకాశమువలె విభువు, సర్వవ్యాపి.
నిష్కలము, అవయవ రహితము, వికల్పశూన్యము మరియు పరిపూర్ణమైనది. అట్టి పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మను విద్యావేత్త, సమాధి స్థితిలో తన హృదయమునందే దర్శించుకొనును.
410. ప్రకృతి వికృతి శూన్యం భావనాతీతభావం
సమరస మసమానం మానసంబంధదూరమ్‌
నిగమవచన సిద్ధం నిత్య మస్మత్ప్రసిద్ధం
హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ॥
పరబ్రహ్మకు ప్రకృతి వికృతులు లేవు. అనగా కారణ-కార్యరహితము. బ్రహ్మపదార్థము ఊహాతీతము. తత్తుల్యమైనది, దానికి మించినది కాని ఇంకొకటి లేదు. ఏక రసమైనది, అఖండము. కేవలము ఉపనిషద్వాక్యములచే నిర్దేశింపబడినది మరియు తర్కముచేకాని, శాశ్వతము, నిత్యసిద్ధము. నేను అనే వాక్యముతో అందరిలో ప్రకటితవౌతున్నది. అట్టి పరబ్రహ్మ స్వరూపమైన ఆత్మను విద్యావేత్త, సమాధి స్థితిలో తన హృదయములోనే దర్శించుకొనును.
411. అజరమమర మస్త్భాసవస్తు స్వరూపం
స్తిమిత సలిలరాశిప్రఖ్య మాఖ్యావిహీనమ్‌
శమితగుణవికారం శాశ్వతం శాన్తమేకం
హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధౌ॥
రుగ్మత, జరామరణములు లేని ఆత్మ పరిణామశూన్యము. భేదరహితము, వికల్పశూన్య వస్తుస్వరూపము. అల్లకల్లోలములేని నిశ్చలమైన సముద్రము వంటిది. పేరులేనిది, ఎట్టి వికారములు గుణములులేనిది. త్రికాలాతీతము, నిత్యం ఉండేది. శాంతమైనది మరియు పరిపూర్ణమైనది. అట్టి పరబ్రహ్మమును విద్యావేత్త, సమాధి స్థితిలో తన హృదయములోనే దర్శించుకొనును.
ఇంకా ఉంది