మెయిన్ ఫీచర్

దేహాత్మ భావన... బ్రహ్మనిష్ఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
9573672695
*
412. సమాహితాన్తఃకరణః స్వరూపే
విలోకయాత్మాన మఖణ్డవైభవమ్‌
ఓచ్ఛిర్థి బన్ధం భగవన్ధగన్ధిలం
యత్నేన పుంస్త్యం సఫలీకురుష్వ॥
స్వస్వరూపమైన ప్రత్యగాత్మయందు నిశ్చలమైన మనస్సుకలవాడవై, అఖండ వైభవోపేతమైన వరబ్రహ్మను దర్శించుకొనుము. దుర్వాసనలతో కూడిన సంసారబంధమునుండి విముక్తిపొందుటకు తగు యత్నముచేయుము. కృతనిశ్చయుడవై అజ్ఞానమును అంతమొందించుకొని, మోక్షమును పొంది, నీ మానవజన్మను సార్థకము చేసికొనుము.
413.
సర్వోసాధి వినిర్ముక్తం సచ్చిదానన్ద మద్వయమ్‌
భావయాత్మానమాత్మస్థం న భూయః కల్పసే‚ ధ్వనే॥
త్రివిధములైన ఉపాధులను అనగా స్థూల, సూక్ష్మ, కారణ శరీరములకు హేతువైన సమస్త వాసనలను నిశే్శషముగా అంతముచేసికొని, అద్వితీయమైన నీ హృదయాంతరాళములోనే ఉన్న పరమాత్మను ధ్యానించి ఆత్మసాక్షాత్కారమును పొందుము. నీవు మరల సంసార వలయములో పడక జన్మరాహిత్యమును పొందెదవు.
ఎంత దృఢ ప్రయత్నము చేయగా పరమాత్మతత్త్వము సంపూర్ణముగా తెలిసికొన శక్యమో స్మృతి ఇట్లు బోధిస్తున్నది-
‘‘మానుష్యాణాం సహస్రేషు కశ్చి ద్యతతి సిద్ధయే!
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః’’
(వేలకొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే జ్ఞానసిద్ధికొరకు ప్రయత్నము చేయుచున్నాడు. అట్లు ప్రయత్నించినవారిలో కూడ ఏ ఒక్కడో, నా తత్త్వమును తెలుసుకొనుచున్నాడు- భ.గీ.7-2).పరమాత్మను దర్శించుకొనిన ముముక్షువులు పొందే ఫలితమును కూడ ఈ విధముగా తెలియజేస్తున్నది-
‘‘జరామరణ మోక్షాయ మామాశ్రీత్యయతంతి యే
తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మ చాఖిలమ్‌॥
(ఎవరు జననమరణ రహితమైన మోక్షాపేక్షతో నన్ను ఆశ్రయించి, అందుకు తగిన సాధన, యత్నము చేయుదురో, వారు మాత్రమే సంపూర్ణముగా కర్మతత్త్వమును, పరబ్రహ్మతత్త్వమునూ గ్రహింతురు-్భ.గీ.7-29).
414. ఛాయేవ పుంసః పరిదృశ్యమాన
మాభాసరూపేణ ఫలానుభూత్యా
శరీరమారాచ్ఛవవన్నిరస్తం
పునర్న సన్ధత్త ఇదం మహాత్మా॥
బ్రహ్మనిష్ఠ కల్గిన మహాత్ముడు స్వస్వరూపానుభూతి పొంది, ఆభాస రూపములో మరణ పర్యంతము ఛాయవలె కనబడుతున్న తన శరీరమును మరల పొందుటకు అనురక్తి కనబరచదు. సర్పము కుబుసమును విడచిపెట్టి దానిని ఎట్లు వెనుదిరిగి చూడక నిర్లక్ష్యముచేయునో, అట్లే జ్ఞానవంతుడు శరీరమును ఉపేక్షించి దానియందు అనురక్తి పూర్తిగా విడచిపెట్టును. ఘటాది వస్తుసముదాయముపై ఎట్లు మమకార అహంకారాదులు ఉండవో, అట్లే మరల శరీరప్రాప్తికై ప్రాకులాడడు.
415. సతత విమలబోధానన్దరూపం స్వమేత్య
త్యజ జడమలరూపోపాధిమేతం సుదూరే
అథ పునరపి నైవ స్మర్యతాం వాన్తవస్తు
స్మరణ విషయ భూతం కల్పతే కుత్సనాయ॥
నిత్యనిర్మలము, జ్ఞాన స్వరూపము, ఆనందమయమైన బ్రహ్మమే నీ స్వస్వరూపము. ఆ బ్రహ్మపదార్థమును స్మరించి తరించుము. వమనము చేసికొనిన పదార్థము ఎంత అసహ్యమును, రోతను కల్గించునో, అట్టిదే జడము, మలిన పదార్థములతోకూడి ఉపాధి మాత్రమైన ఈ స్థూల శరీరము. దీనిని నీ స్మరణలోనికి రానీయక దూరముగా ఉంచుము.
416. సమూలమేతం పరిదహ్య వహ్నౌ
సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే
తతః స్వయం నిత్యవిశుద్ధబోధా
నన్దాత్మనా తిష్ఠతి విద్వరిష్ఠః॥
సద్రూపము, భేదశూన్యమైన పరబ్రహ్మతత్త్వమును ఆకళించుకొనిన శ్రేష్ఠ విద్యావేత్త, అజ్ఞానమును సమూలంగా జ్ఞానాగ్నిలో దగ్ధము చేసివేయును. అటుపిమ్మట నిత్యము, పరిశుభ్రము, పరిపూర్ణ జ్ఞాన స్వరూపము, అఖండానంద నిలయమైన ఆత్మలో స్థిరముగా బ్రహ్మభూతుడై (జీవన్ముక్తుడై) ఉండును.
ఇంకా ఉంది