మెయిన్ ఫీచర్

పచ్చని చెట్లకు నేస్తాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని అందరం చెబుతాం. కాని ఆచరణలో పెట్టేది కొందరే. ఇల్లు కట్టాలన్నా.. ఏ చిన్న ఊరేగింపు కోసమైనా పచ్చని చెట్లను నరికేస్తుంటాం. ఇటీవలనే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యానికి కొన్ని రోజులు పాటు స్కూళ్లు సైతం మూతపడ్డాయి. అయినప్పటికీ గుణపాఠాలు నేర్చుకోం. ప్రకృతిని ప్రేమిస్తే అది పదికాలాలపాటు మనల్ని చల్లగా చూస్తుందని బీహార్‌లోని మధుబనీ జిల్లా మహిళలు, బాలికలు నమ్మారు. భవిష్యత్తు తరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని విశ్వసించిన ఈ జిల్లా మహిళలు, బాలికలు చెట్లపై అక్కడి సంప్రదాయబద్దమైన మధుబని పెయింటింగ్స్ వేస్తుంటారు. సహజ వర్ణాల సమ్మేళనమైన ఈ పెయింటింగ్‌ను వేళ్లు, కొమ్మలు, బ్రష్, అగ్గిపుల్లలతో అక్కడి మహిళలు వేస్తుంటారు. హోళీ, కాళీ, దుర్గాపూజల సందర్భంలోనూ, ప్రత్యేక పండుగల వేళ, పుట్టినరోజు తదితర వేడుకలలోనూ మహిళలు ఈ పెయింటిగ్స్ వేస్తుంటారు. ఈ తరహా పెయింటిగ్స్‌ను ఇపుడు వారు తమకు కనిపించిన చెట్లపై స్వచ్చ ంధంగా వేస్తూ చెట్లపై తమకున్న ప్రేమను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఆరంభమైన ఈ చెట్ల పరిరక్షణ ఉద్యమం ఆ జిల్లాలో రోజురోజుకి విస్తరిస్తోంది. మహిళలు, ఆడపిల్లలు ఎక్కడ పచ్చటి చెట్టు కనిపిస్తే చాలు అక్కడ పెయింటింగ్ వేసి నరక్కుండా కాపాడుతున్నా రు. రాంపట్టి, రాజ్‌నగర్ ప్రాంతాల్లో ఐదు కిలోమీటర్ల మేరకు ప్రయాణిస్తే చెట్ల నిండా ఈ పెయింటింగ్స్ కనబడుతుంటాయి. రాముడు, సీతా, కృష్ణా, బుద్ద, మహావీర వంటి దేవుడి, దేవతల బొమ్మలను వేస్తుంటారు. దీంతో ఎవరైనా చెట్లను నరకాలని ప్రయత్నించినా.. ఈ దేవుడి బొమ్మలు చూసి కనీసం ఆగిపోతారని వారి నమ్మకం. పచ్చటి చెట్టును దేవాలయంగా భావిస్తూ వాటిని కాపాడుతున్న ఈ మహిళలు, బాలికలను అందరూ ఆదర్శంగా తీసుకుంటే భూదేవి పదికాలాల పాటు పచ్చగా ఉంటుందనటంలో అతిశయోక్తికాదు.
**
భూమికకు రచనలు పంపాలనుకునే వారు
రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.neకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36 సరోజినీదేవి రోడ్ సికిందరాబాద్- 03