మెయిన్ ఫీచర్

ప్రేమకు ప్రతిరూపం క్రిస్మస్ ట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రిస్మస్ రోజుల్లో ఈ చెట్టును ఇంటికి తెచ్చి కొవ్వొత్తులు లేదా విద్యుద్దీపాలతో,
రకరకాల వస్తువులతో అందంగా
అలంకరిస్తారు.
పైభాగంలో నక్షత్రాన్ని ఏర్పాటుచేస్తారు.
19వ శతాబ్దం
ప్రారంభంలో ఈ సంప్రదాయం ప్రాచుర్యం
పొందింది.
**
క్రిస్మస్ పండగ అనగానే అందరికీ గుర్తొచ్చేది క్రిస్మస్ తాత శాంటాక్లాజ్. ఎర్రని దుస్తులతో ఈ తాత తన బగ్గీపై మంచు కొండలమీదుగా ఆకాశ మార్గాన వచ్చి క్రిస్మస్ చెట్టుకు వేలాడదీసిన మేజోళ్లలో పిల్లలకోసం ఎన్నో బహుమతులు పెట్టి వెళతాడట. దీని వెనుక ఉండే ఉద్దేశమంతా ఒక్కటే మానవుడిని, ప్రకృతిని సృష్టించిన దేవుడి ప్రేమను తెలుసుకోవడమే.
క్రిస్మస్ రోజుల్లో ఈ చెట్టును ఇంటికి తెచ్చి కొవ్వొత్తులు లేదా విద్యుద్దీపాలతో, రకరకాల వస్తువులతో అందంగా అలంకరిస్తారు. పైభాగంలో నక్షత్రాన్ని ఏర్పాటుచేస్తారు. చారిత్రకంగా ఈ సంప్రదాయం 1781లో బెన్షివిక్ సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించిందంటారు. ‘జనరల్ ఫెడరిక్ అడాల్ఫ్ రెడిజిల్’ అనే సైనికాధికారి ఇచ్చిన క్రిస్మస్ విందులో అతిథులను అబ్బురపరచటం కోసం ‘్ఫర్’ చెట్టును కొవ్వొత్తులతో, పండ్లతో అలంకరించాడట! 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ సంప్రదాయం ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత రష్యాలాంటి దేశాల్లోనూ సంపన్న కుటుంబాలవారు క్రిస్మస్ చెట్టుని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందమైన ఆభరణాలు, లైట్స్‌తో అలకరించకుండా ఏ ఇంట్లోనూ క్రిస్మస్ ట్రీ ఉండదు. ప్రతి ఒక్కరూ క్రిస్మస్ ట్రీస్ అద్భుతంగా అలంకరిస్తారు.
డెకరేషన్ ఇలా..
క్రిస్మస్ ట్రీని అలంకరించడంలో ముఖ్యంగా కావాల్సినవి కలర్‌ఫుల్ లైట్స్, అందమైన పొడవాటి లైట్లతో అలంకరించడం ఒక ట్రెడిషనల్ లుక్‌ను ఇస్తుంది, నియాన్ లైట్స్‌తో అలంకరించడం వల్ల మరింత బ్రైట్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటుంది. క్రిస్మస్ ట్రీకి క్రిస్మస్ ఆభరణాలు మార్కెట్లో అనేకం అందుబాటులో ఉన్నాయి. గ్లాస్ ఆభరణాలు లేటెస్టు ఫ్యాషన్‌గా మారాయి. కాబట్టి, క్రిస్మస్ ట్రీ గ్లాస్ ఆభరణాలతో డెకరేట్ చేయడం విలువైనదిగా ఉంటుంది. కాబట్టి, ట్రై చేయండి. కాటన్- మంచుతో కప్పబడినట్లు ఒక తాజా లుక్‌ను అందివ్వడానికి, ఒక పెద్ద పొరలుగా కనిపించే విధంగా కాటన్‌ను డెకరేషన్ చేయండి. ఆకులమధ్య కాటన్ డెకరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. క్రిస్మస్ ట్రీ మీద కాటన్‌ను తేలికగా అలా పరచడంవల్ల ఒక నేచురల్ లుక్‌ను అందిస్తుంది. ట్రెడిషనల్ లుక్‌ను అందించే ఆభరణాలతో డెకరేట్ చేయండి. ఈ ట్రెడిషనల్ ఆర్నమెంట్స్ పండగ వాతావరణాన్ని కలిగిస్తూ స్పెషల్‌గా ఉంటుంది. పిల్లలతో సృజనాత్మకంగా ఏదైనా తయారుచేయగలిగినప్పుడు, వారే సొంతంగా క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అలంకరించడానికి ముందుకు వస్తారు. స్వయంగా అలంకరించడంవల్ల వారు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు.
శుభ్రం చేసేందుకు కాటన్ బాల్స్
క్రిస్మస్ ట్రీని శుభ్రం చేయడానికి కాటన్ బాల్స్‌ను ఉపయోగిస్తే మంచిది. కాటన్ బాల్స్‌ను తడి చేసి లేదా సోప్ వాట
ర్‌లో డిప్ చేసి ఆర్ట్ఫిషియల్ క్రిస్మస్ ట్రీ మీద మురికి చేరిన ప్రాంతంలో తుడవాలి. ఒకవేళ ఆర్ట్ఫిషియల్ క్రిస్మస్ ట్రీ చాలా పెద్దదిగా ఉన్నపుడు వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించండి. బ్రిస్టల్ బ్రెష్‌ను అటాచ్ చేసి, మొదట బేస్ ట్రీ క్రింది భాగం లో డస్ట్ తొలగించడానికి ట్రై చేయండి. స్ట్రాంగ్ వాక్యూమ్ చేయకూడదు. వాక్యూమ్ స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మరో అటాచ్‌మెంట్‌ను ఉపయోగించండి. ఆర్ట్ఫిషియల్ క్రిస్మస్ ట్రీ కొమ్మల మీద వాక్యూమ్ చేయకూడదని గుర్తుంచుకోవాలి.
సోప్ వాటర్:మీ ఆర్ట్ఫిషియల్ క్రిస్మస్ ట్రీని శుభ్రం చేయడానికి మరో అద్భుతంగా చిట్కా ఇది. నీళ్ళలో నాణ్యమైన సోప్ లేదా లిక్విడ్‌ను వేసి శుభ్రం చేయా లి. కఠిన రసాయనాలను వాడిన సోపులను, డిటర్జెంట్ పౌడర్లను ఉపయోగించకూడదు. ఇది ఆర్ట్ఫిషియల్ క్రిస్మస్ ట్రీ కలర్‌ను చెడగొడుతుంది. మరియు దీన్ని నాశనం చేస్తుంది. కాబట్టి, సోప్ వాటర్‌లో ఒక కాటస్ వస్త్రాన్ని నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి. డిప్ చేసిన క్లాత్ చాలా సులభంగా దుమ్ము, ధూళిని పీల్చుకొనే విధంగా ఉండాలి. సోప్ వాటర్‌లో డిప్ చేసి, ఆకులను, కొమ్మలను నిదానంగా తుడవాలి. దాంతో క్రిస్మస్ ట్రీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది.
**
క్రిస్మస్ ట్రీ విశేషాలు
ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రిస్మస్ చెట్టు ఎక్కడుందో తెలుసా? అబుదాబిలో.. 40 అడుగుల ఎత్తున నిర్మించిన దీని విలువ కోటి పది లక్షల డాలర్లుట. ఈ చెట్టుని దాదాపు 181 వజ్రాలు, ముత్యాలు, విలువైన రాళ్ళతో అలంకరించారని అంటారు. క్రిస్మస్ చెట్టును మొదటిసారిగా అలకరించింది 1510లో. ఇళ్ళల్లోకి తీసుకువచ్చి చెట్టును పెట్టే సంప్రదాయం వచ్చింది 16వ శతాబ్దంలో. అమెరికాలో ఏటా మూడు కోట్ల క్రిస్మస్ చెట్లు అమ్ముడవుతాయి. పది లక్షల ఎకరాల్లో వీటిని పెంచుతారు.
డేవిడ్ రిచర్డ్స్ అనే ఓ ఆస్ట్రేలియన్ తయారుచేయించిన క్రిస్మస్ ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. గిన్నస్ బుక్‌లో స్థానం సంపాదించుకుంది. 72 అడుగులు ఉన్న ఆర్ట్ఫిషియల్ ట్రీకి 5,18,838 బల్బులను అలంకరించడం ద్వారా ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.
క్రిస్మస్ చెట్లను యూల్ చెట్లు అని కూడా అంటారు. ఈ చెట్లు అత్యధికంగా అలస్కా, హవాయ్ ప్రాంతాల్లో పెరుగుతాయి. క్రిస్మస్ చెట్టును అలంకరించిన మొదటి ఫలాలు యాపిల్, నట్స్, ఖర్జూరం. ఎక్స్ అంటే గ్రీకు భాషలో క్రిస్ట్ అని అర్థం. అందుకే ఈ పండుగను క్రిస్మస్‌తోపాటు ఎక్స్‌మస్ అని కూడా అంటారు.
ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ చెట్లు దొరక్కపోవడంవల్ల అరటి చెట్లనే క్రిస్మస్ ట్రీలుగా అలంకరించేవారు. హాంకాంగ్, తైవాన్, కొరియా దేశాలలో క్రిస్మస్ చెట్లను అధికంగా తయారుచేస్తారు.

- టి. మూర్తి