మెయిన్ ఫీచర్

అల్లుకుంటేనే అనుబంధాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంధాలు..అనుబంధాలు కలుషితమైన ఈ కలియుగంలో మనుషులమధ్య ప్రేమానురాగాలు కంటికి కన్పించనంత దూరమై పోయాయి. కుటుంబంలో అందరి మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరిస్తేనే అదో ఆనందం. ఈ ప్రేమానురాగాలు కొరవడి ఉమ్మడి కుటుంబాలు.. చిన్న కుటుంబాలుగా మారిపోయాయి. విశాలమైన ఇల్లు ఇరుకైపోయంది. దానికి తోడు మనసులు ఇరుకైపోయాయి. భార్యాభర్తలమధ్య కూడా సఖ్యత కన్పించడం లేదు. ఎవరో రచయిత చెప్పినట్లు ‘అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలే’ అన్నట్లు అన్నింటా డబ్బుమయం అయిపోయింది. గొప్పల కోసం ఎవరికివారే యమునాతీరే అన్నట్లు.. జీవితకాలమంతా డబ్బుకే కేటాయిస్తున్నారు. తిరిగి చూస్తే అనుభవించాల్సిన ఆనందాలు, సుఖాలు అంతా శూన్యం. భవనాలు, కార్లు, పిల్లల చదువులు అంతా డబ్బుతోనే ముడిపడి.. భార్యాపిల్లలను సైతం దూరం చేసుకొంటున్నారు. మరి అలాంటి సంపదలు ఎన్నున్నా ఏమి ప్రయోజనం. అందరూ కలిసి పంచుకొన్న ఆనందాలు వెతికి చూసినా కన్పించవు. మరి అలాంటి జీవితం ఎందుకు? అని ప్రశ్నించుకుంటే జవాబుండదు.
కొంతమంది వున్నంతలో హ్యపీగా జీవిస్తారు. చిన్న చిన్న ఆనందాలు ఈ జీవితానికి సరిపడా సంపాదించుకొంటారు. భార్యా పిల్లల అభిరుచుల మేరకు వారి కోరికలు తీరుస్తూ.. ఎనె్నన్నో ఆనందాలను పంచుకొంటారు. కోటానుకోట్ల సంపదలు ఇవ్వలేని ఆనందాలు.. మనసుకు హాయినిచ్చే ఆనందాలే మిన్న. అలాంటి ప్రేమానురాగాలే కావాలి మనసున్న మనుషులకు.. మరి కొంతమంది ఉన్నది నలుగురే వుంటారు. కాని నాల్గు దిక్కుల్లా జీవిస్తుంటారు.
అనునిత్యం మాటలు తూటల్లా పేలుస్తూ... జీవితాలను నరకప్రాయం చేస్తుంటారు. భార్యాభర్తలమధ్య సఖ్యత అసలు లేకుంటే పిల్లల జీవితాలు కూడా పెడత్రోవపడ్తాయి. ఈ కాలంలో చాలామంది యువత తప్పుదారిలో పయనిస్తున్నారు. ఇంటికొస్తే అమ్మా నాన్నల గొడవ భరించలేక.. మనసులో బాధను చెప్పుకోలేక కుమిలిపోతారు. అందుకే కష్టమైనా.. సుఖమైనా కల్సి పంచుకుంటేనే ఆనందం. ఈ భూ ప్రపంచంలో బాధపడని మనిషంటూ వుండడు. ప్రతి మనిషికి ఏదో కష్టం ఎదురవుతుంది. ఆ కష్టాన్ని తట్టుకొన్నవాడే మనిషి అవుతాడు. మరికొంతమంది కష్టాన్ని తనవారితో పంచుకొని పరిష్కారం చేసుకొంటారు.
అందుకే అల్లుకుంటేనే.. ప్రేమానురాగాలు బలపడతాయి. ప్రతి ఇంట ఆనందాలు వెల్లివిరుస్తాయి. పెద్దవాళ్లయినా, చిన్నవాళ్లయినా.. ఒకరికి ఒకరు... ఒకరికి అందరూ.. అందరికీ ఒకరై కలిసి జీవిస్తేనే జీవితం ఆనందమయమవుతుంది. మరి అందరూ.. ఈనాడు కట్టుకొన్న బొమ్మరిల్లు... అని పాడుకొంటూ.. మమతానురాగాలు.. ప్రేమానురాగాలు.. ఆనందాలు అందరి జీవితాల్లో హరివిల్లు కావాలని మనసారా కోరుకొందాం. జీవితాలను ఆనందమయం చేసుకొందాం.

- కురువ శ్రీనివాసులు