మెయిన్ ఫీచర్

కథల సుధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెరగని చిరునవ్వు.. కలనేత చీర.. సంప్రదాయమైన కట్టూబొట్టూ.. తలలో నిండుగా పూలు.. ఆమె ఆషామాషీ వ్యక్తేం కాదు... సింపుల్‌గా కనిపిస్తున్నా దేశంలో పేరెన్నికగన్న సామాజికవేత్త. ఆమె మాటలు సూటిగా ఉంటాయి. అందులో తన విలువైన సమయాన్ని కాపాడుకునే ఆరాటం కనిపిస్తుంది. ఎదుటివారి ఆలోచనలు పసిగట్టి చెప్పే మృదువైన జవాబులుంటాయి. ఆ మాటలు, జవాబుల్లో తాత్విక ధోరణి తొంగి చూస్తుంది. రచయిత్రి, టీచర్, భార్య, తల్లి, సోదరి, అమ్మమ్మ - ఇలా ఎన్నో పాత్రల్లో తనదైన ముద్రవేశారు. ఆమే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్
సుధా నారాయణ మూర్తి.
**
‘‘అమ్మమ్మా నీకు కృష్ణుడి కథ చెబుతానంది మనవరాలు. లండన్‌లో పుట్టిపెరుగుతున్న తన మనవరాలికి మన పురాణ పురుషుడి కథ కూడా తెలుసా అని ఆ అమ్మమ్మ ఒకింత ఆశ్చర్యపోయింది. లండన్‌లో ఉన్న తన కుమార్తె ఇంటికి వచ్చిన సుధామూర్తి మనవరాలు చెప్పే కథ వినటానికి అంగీకరించి కూర్చుంది. ‘కృష్ణుడు ఓ కొంటె పిల్లాడు. ఓరోజు అతను స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లాడు. అక్కడ చాలామంది ఆంటీలు స్నానం చేస్తున్నారు. అప్పటికే ఆ ఆంటీలు ఆ కొంటె కృష్ణుడిపై తల్లికి ఫిర్యాదు చేశారు. మీ అబ్బాయి మా ఇళ్లల్లోకి వచ్చి రిఫ్రిజరేటర్‌లో ఉన్న వెన్న అంతా తినేస్తున్నాడు అని ఫిర్యాదు చేశారు. అందుకే ఆ ఆంటీలకు గుణపాఠం చెప్పాలని కృష్ణుడు అక్కడకు వచ్చాడు. వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఇది ఆడవాళ్లు స్నానం చేసే సమయం కాబట్టి రావద్దు అని అడ్డుకున్నాడు. వెంటనే ఆ కొంటె కృష్ణుడు అపార్ట్‌మెంట్‌లోని ఫస్ట్ఫో్లర్‌లోకి వెళ్లి డ్రెస్సింగ్ రూమ్‌లో ఆ ఆంటీలు పెట్టుకున్న బట్టలన్నీ తీసుకువెళ్లిపోయాడు. ఇపుడు ఆంటీలందరూ ఏమి చేస్తారో చూడాలని ఆ కొంటె కృష్ణుడు ఎదురుచూస్తున్నాడు. వాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చి అక్కడ దుస్తులు లేకపోవటం చూసి కృష్ణుడ్ని పిలిచి తమ బట్టలు ఇవ్వమని అభ్యర్థించారు. లేదంటే కోర్టులో నీమీద దావా వేస్తాం అని అన్నారు. చివరకు ఇరువురు రాజీకి వచ్చిన తరువాత కృష్ణుడు వారి డ్రెస్సులు వారికి ఇచ్చివేశాడు.’
మనవరాలు చెప్పిన కృష్ణుడి కథ విని సుధామూర్తి ఆశ్చర్యపోయింది. భగవంతుడైన కృష్ణుడిపైనే దావా వేస్తామని చెప్పిన మనవరాళ్లకు కృష్ణుడి గురించి ఇదా తెలిసింది అని ఆశ్చర్యపోయింది. వాళ్లు నివసిస్తున్న ప్రస్తుత సామాజిక వాతావరణంలో వాళ్లకు కృష్ణుడు గురించి ఇలా కాకుండా ఎలా అర్థమవుతుంది. పురాణాల్లోని కథలు అతిశయోక్తిగా వర్ణించి రాయటం వల్ల ఆ కథల్లోని అసలు నీతి చిన్నారులకు చేరువకావటం లేదని గ్రహించింది. అందరి అమ్మమ్మల్లా ఆమె ఊరుకోలేదు. అప్పటికే ఆమె కలం నుంచి ఎన్నో రచనలు పుస్తకాలు అచ్చయ్యాయి. ఈసారి పిల్లలుకు పురాణ కథల పాఠాలు చెప్పాలని భావించి 11 రోజుల్లో పుస్తకాన్ని రాయటం పూర్తిచేశారు. అలా ఆమె కలం నుంచి వచ్చిందే ‘్దళ డళూఔళశఆ’ఒ గళ్పళశళ:శ్రీశఖఒఖ్ఘ ఘళఒ యూౄ దళ ఘ్ద్ఘఇ్ద్ఘ్ఘఆ్ఘ’ మహాభారతం కథలను పిల్లలకు అందించటమనేది బాధ్యతగా భావించాను కాబట్టే ఈ పుస్తకాన్ని ఇలా తక్కువ కాలంలో పూర్తిచేయగలిగానని అంటారు. రాయటం నాకు ఆనందాన్ని ఇస్తుంది. ప్రజల భావోద్వేగాలను, కష్టాలను కథా వస్తువులుగా తీసుకుని బాగా రాయగలను. నేను చేస్తున్న పని వల్లే ఇలా రాయగలుగుతున్నాను’ అని చెబుతారు.
**

మహిళలు సామాజిక సమానత్వం సాధించలేదు
ఇన్ఫోసిస్ అనే పేరు వింటేనే గుర్తుకువచ్చేది సుధామూర్తి పేరు. సేవే శ్వాసగా చేసుకుని 16 ఏళ్ల ప్రాయం నుంచి దేశవ్యాప్తంగా చేస్తున్న ఆమె సేవకు పద్మశ్రీ లభించటం అనేది చాలా చిన్న పురస్కారమే. ఈ సేవామూర్తి ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. వాటిలో ఇవి కొన్ని..
కోట్లాది రూపాయల ఆస్థి ఉన్నా షాపింగ్ చేయడం ఇష్టం ఉండదు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్న ఆమెకు సమయపాలన అంటే ఇష్టం. ఉదయం 8.30 గంటలకు ఠంచనుగా చైర్ లో కూర్చొని ఉంటారు. తోటి ఉద్యోగులకు ఈ విషయంలో ఆమే స్ఫూర్తి.
**
రోజంతా పనిలో నిమగ్నమవుతారు. రోజుకు కనీసం 400 ఈమెయిల్స్, మరో 400 కాల్స్‌కు సమాధానం ఇస్తారు. ఇప్పటికీ ఆ రెండంతస్తుల ఇంట్లోనే గత 28 ఏళ్ల నుంచి నివశిస్తున్నారు. ఇక్కడే ఆమెకు ఇద్దరు పిల్లలు రోహాన్, అక్షత. జీవితంలో వాళ్లిద్దరూ స్ధిరపడ్డారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి ఉదయం 5.30గల్లా నిద్రలేచే అలవాటు చేశారు.
పుస్తక పఠనం ఆమెకు ఎంతో ఇష్టం. రోజుకు కనీసం 100 నుంచి 200 పేజీలు చదువుతారు. మ్యూజిక్ వింటారు. అరగంట సేపు ఆనందంగా సినిమా సైతం చూస్తారు.
పూణేలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో ఓ ఉద్యోగిని హత్యకు గురైన విషయంపై మాట్లాడుతూ ఈ హత్య గురించి ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధిని అడిగితే బాగుంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళల గురించి మాట్లాడుతూ ఈనాటికీ సామాజిక సమానత్వాన్ని సాధించలేదని అంటారు.
ఇన్ఫోసిస్ పనిమీద దొంగలు, బందిపోట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా తిరిగాను. ఈ సందర్భంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కాని రాత్రిపూట ప్రయాణాలను సాధ్యమైనంత వరకు చేయను. ఎందుకంటే సమయం ఆదా అవుతుందన్న కారణంతో అనవసరమైన ఇబ్బందులు పడటం ఎందుకని అంటారు.

క్లాసులో ఒకే ఒక్క విద్యార్థిని ఆమే
50 ఏళ్ల క్రితం ఆమె హుబ్లీలోని బివిబి ఇంజినీరింగ్ కాలేజీలో చదివేటపుడు ఆ క్లాసులో ఆమె ఒక్కతే విద్యార్థిని. అందరూ మగపిల్లలే. యుక్త వయసు నుంచి కూడా ఆమె ఎవ్వరి మీద ఆధారపడేవారు కాదు. క్లాసు లో ఒకవేళ నోట్స్ రాసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ పాఠాన్ని మళ్లీ మళ్లీ చదివి నోట్స్ తయారుచేసుకునేవారు. ఈ వయసులోనూ ఆమె తన స్వశక్తినే నమ్ముతారు.
తాను చదివిన బివిబి కాలేజీ యాజమాన్యమే ఆమె జీవితంపై పుస్తకం వేయటం అరుదైన విషయం. ఆ పుస్తకం పది లక్షల కాపీలు వరకు అమ్ముడుపోవటం మరో ప్రత్యేకత.
లింగ వివక్షపై జెఆర్‌డికి లేఖ
లింగ వివక్షపై జెఆర్‌డి టాటాకు ఆమె స్వయంగా ఉత్తరం రాశా రు. ఇంటిలో ఎలాంటి వివక్షతను ఎదుర్కోని ఆమె టాటా సంస్థలో అలాంటి పరిస్థితి ఎదురయ్యే సరికి జెఆరడి టాటాకు ఉత్తరం రాశారు. ఉత్తరం రాసిన పది రోజులకే ఆమెకు టాటా నుంచి టెలిగ్రామ్ వచ్చింది. కంపెనీ ఖర్చులతో ఇంటర్యూకు హాజరుకావాల్సిందిగా ఆ లేఖలో జెఆర్‌డి ఆహ్వానించారు.

టెల్కో, టాటా మోటార్స్‌లో మహిళా ఉద్యోగులనే తీసుకునేవారు కాదు. కాని సుధామూర్తి రాసిన ఉత్తరంతో మార్పు వచ్చింది. అంతేకాదు
టెల్కోలో తొలి మహిళా ఉద్యోగినిగా సుధామూర్తి పనిచేశారు.
సుధామూర్తికి వంటచేయటం రాదు. పెళ్లిళ్లు, పార్టీలకు ఎక్కువగా వెళ్లరు.
16 రాష్ట్రాలకు విస్తరించిన సేవలు
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చేపట్టే సేవా కార్యక్రమాలు దాదాపు దేశంలో 16 రాష్ట్రాలకు విస్తరించాయి. విద్య, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఆరోగ్యం, ఆర్ట్స్, సాంస్కృతి తోడ్పాటు, అనాథల సంరక్షణ తదితర వాటిపై సేవలు అందిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలలో లైబ్రరీల ఏర్పాటు, గ్రామీణులకు కంప్యూటర్ ప్రోగ్రామ్స్‌లో శిక్షణ, స్కూళ్లలో మధ్యాహ్నం భోజన పథకంలో భాగస్వామ్యం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటివరకు 10 వేల టాయిలెట్స్, భువనేశ్వర్, మంగుళూరులు ఆసుపత్రులలో చిన్న పిల్లల వార్డులు నిర్మించటం, బెంగళూరులో ఉచిత కంటి వైద్య పరీక్షల కేంద్రం ఏర్పాటు, ప్రతిభగల పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, పాఠశాల భవనాల నిర్మాణం, వరదలు, తుపానులు వంటి విపత్తులు వచ్చినపుడు బాధితులను ఆదుకోవటం- ఇలా ఒకటేమిటి ఎన్నో సేవాకార్యక్రమాలను ఈ ఫౌండేషన్ అందిస్తోంది.
అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయమేమింటే సుధామూర్తి ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చోవటానికి ఇష్టపడరు. పుస్తక పఠనం ప్రాణం.
మా జనరేషన్‌లో విడాకులు ప్రసక్తేలేదు. ఇపుడున్న జనరేషన్ దత్తతకు సిద్ధమవుతున్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు అవుతున్నారు. కాని సహనం మాత్రం లోపిస్తోందన్నది అభిప్రాయం.
సుధామూర్తి తన కుమారిడికి చిన్నప్పటి నుంచి సంస్కృతం నేర్పించారు. హార్వర్డ్ యూనివర్శిటీలో చదివిన ఆమె కుమారుడు రోహన్ కంప్యూటర్స్‌లో పీహెచ్‌డీ చేశారు. చరిత్ర అంటే సుధామూర్తి ఎంతో ఇష్టపడతారు. నేను చాలా సాధారణ మహిళను. నాపై సినిమా తీసేంత స్థాయి లేదని భావిస్తున్నా అని వినమ్రంగా చెబుతారు.
కర్నాటక నుంచి ఓ యువకుడితో పరిచయమైంది. మంచి స్నేహితులుగా ఉండేవాళ్లం. తదనంతరం పెళ్లి చేసుకున్నాం అంటూ సుధామూర్తి తన గురించి క్లుప్తంగా చెప్పారు.

చిత్రాలు..చిన్నారులతో సుధామూర్తి

- టి.ఆశాలత