మెయిన్ ఫీచర్

ప్రతిభమెరిసింది..కొలువుదక్కింది ( రిజర్వేషన్లు తోసిరాజని సివిల్స్ గెలిచిన ధీర)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ త్వానికి కన్నా విలువైంది లేదని తల్లిదండ్రులు చెప్పారు. చిన్నప్పటి నుంచి పేద, అర్హులైన అభ్యర్థులను చూశాను. వారికి రిజర్వేషన్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసు. అదే సమయంలో ధనవంతుల పిల్లల తల్లిదండ్రులు ఈ రిజర్వేషన్లను అవకాశంగా తీసుకుని లబ్ధిపొందుతున్న విషయం తెలుసు. ఆత్మవంచన చేసుకోదలచుకోలేదు. అందుకే రిజర్వేషన్లు నాకు వర్తింపజేయవద్దని వేడుకున్నాను.
-డిన్‌చెంగ్‌ఫా బారువా

డిన్‌చెంగ్‌ఫా బారువా అస్సాంకు చెందిన మధ్యతరగతి అమ్మాయ. ఆర్థికంగా ఉన్నత స్థానంలోనూ లేదు. బీజీ సామాజిక వర్గానికి చెందిన ఈ యువతి కల ప్రభుత్వ ఉద్యోగం సంపాదించటం. ఆ కలను సాకారం చేసుకోవటానికి ప్రతిభనే నమ్ముకుంది. పట్టుబట్టి సాధించింది. పేదవర్గాలను వెన్నుతట్టి ప్రోత్సహించే రిజర్వేషన్లను సైతం తిరస్కరించింది. గంటలకొద్ది పుస్తకాలకు అతుక్కుపోయి చదివింది. వేలాదిమందితో పోటీపడి నెగ్గింది. విలువలు కలిగిన వ్యక్తిగా ఎదిగి విజయాన్ని సాధించింది. రెండు పదులు దాటిన ఈ యువతి. అస్సాంకు చెందిన సివిల్ సర్వీసు పరీక్షలలో నెగ్గి అసిస్టెంట్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ మేజస్ట్రేట్‌గా ఎంపికైంది. ప్రస్తుతం నాగోన్ జిల్లాలోని కలియాబార్‌లో పోస్టింగ్ ఇచ్చారు. ఇందులో గొప్పేముంది అని పెదవి విరిచేయకండి. రిజర్వేషన్ సదుపాయంతో ఉద్యోగం సంపాదించందని తేలిగ్గా తీసిపారేయకండి. నాకసలు రిజర్వేషనే్ల వద్దు నా ప్రతిభను బట్టి ఉద్యోగం ఇవ్వమని ఇంటర్యూలో ధైర్యంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఉద్యోగం సంపాదించిన ప్రతిభావంతురాలు. అధికారులు సైతం డిన్‌చెంగ్‌ఫా బారువా ధీరత్వానికి అచ్చెరవొందారు. 26 ఏళ్ల ఈ యువతి ఏపీఎస్‌సి మెయిన్ పరీక్ష రాసింది. ఈ పరీక్షకు 50,000 మంది హాజరైతే ఇందులో 90మంది ఫైనల్‌కు ఎంపిక వరకు వచ్చారు. ఇందులో ఈమె ఒకరు. అస్సాంలో బీసీ సామాజిక వర్గానికి 27శాతం రిజర్వేషన్ అమలవుతుంది. కాని డిన్‌చెంగ్‌ఫా ఓపెన్ కేటగిరీలోనే దరఖాస్తు చేసుకుంది. అదే మరొకరైతే అసలు ఉద్యోగం
వస్తుందో రాదో అనే బెంగతో బిసీ రిజర్వేషన్‌ను వినియోగించుకుంటారు. కాని ఈ యువతి అలా చేయలేదు.
పోనీ కుటుంబం ఎమన్నా ఆర్థికంగా ఉన్నతస్థితిలో ఉందంటే అదీ లేదు. ఊహ తెలిసినప్పటి నుంచి కూడా రిజర్వేషన్ సదుపాయాన్ని ఉపయోగించకుండానే ఉన్నత చదువులు చదివింది. దేశ రాజధాని ఢిల్లీలో చదువుకున్న డిన్‌చెంగ్‌ఫా తల్లి రిటైర్డ్ ప్రొఫెసర్. తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. ఈమె కొన్నాళ్లు జర్నలిస్ట్‌గా కూడా పనిచేసింది. అనేక సామాజిక అంశాలను తీసుకుని స్టోరీలుగా రాసింది.
తొలుత వ్యాపారం రంగంలోకి అడుగుపెట్టాలని అనుకున్నది. కాని అదే సమయంలో ఏపీఎస్‌సి పోటీ పరీక్షల ప్రకటన పడటంతో దరఖాస్తు చేసుకుంది. రెండు నెలలు మాత్రం పిలిమినరీ పరీక్షలకు ప్రిపేర్ అయింది. మెయిన్స్‌లో సైకాలజీ, పొలిటికల్ సైన్స్‌ను తీసుకుంది. దీనికోసం ఐదు నెలల పాటు రెయింబవళ్లు కష్టపడింది. ఇందులో రెండవ ర్యాంకు సంపాదించింది. దీంతో రిజర్వేషన్లుతో నాకు అవసరం లేదని అనిపించింది. అంతేకాదు వౌఖిక పరీక్షల్లో ఆమె ఇచ్చిన సమాధానాలకు వారు సంతృప్తిని వ్యక్తంచేయటం జరిగింది. సమానత్వం దిశగా స్ర్తిలు అడుగువేయాలనే ఈ యువ అధికారిణి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే బద్దకస్తులు అనే మాటను వమ్ము చేస్తూ తన బాధ్యతలను నిర్వహిస్తోంది. ఉద్యోగరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వీకెండ్స్‌లోనూ పనిచేస్తుంటాను. విధి నిర్వహణ పట్ల అంకితభావంతో ప్రతిరోజూను చాలెంజ్‌గా తీసుకుని ముందుకు సాగుతాను అని అంటుంది.

చిత్రం...తల్లిదండ్రులతో డిన్‌చెంగ్‌ఫా బారువా

అంగన్‌వాడీల సమావేశంలో మాట్లాడుతున్న డించ్గ్ఫో బోర

-లత