మెయిన్ ఫీచర్

వచ్చెను వసంతలక్ష్మి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆమని కోయిల కూసినవేళ, అవనికి దిగెనొక అభినయ శోభ’. కోకిలలూ కవి కోకిలలూ గొంతెత్తి గానం చేసే శుభ తరుణం ఉగాది. కొత్త పాతల మేలుకలయిక. తీపి- చేదు- షడ్రుచుల జీవన సమ్మేళనం-
2016 ఏప్రిల్ 8వ తేదీ శుక్రవారం అశ్వనీ నక్షత్రంతో నూతన దుర్ముఖ నామ సంవత్సరం ప్రవేశిస్తున్నది. నూతన ఆంగ్ల సంవత్సరం (2016) కూడా శుక్రవారం నాడే ప్రారంభం కావటం యాదృచ్ఛికం కావచ్చు. శుక్రుడు పాపుడే అయినా కళాకారులకు మేలు చేస్తాడని ప్రతీతి. రాజు శుక్రుడు- ఇతడు మద్యప్రియుడు. బ్రాహ్మణుడే అయినా దుష్టుడు- రాక్షసరాజు. దేశంలో అందరికీ సరియైన న్యాయం జరుగదు. వ్యవసాయదారులు నష్టపోవచ్చు. రాజు శుక్రుడైతే, మంత్రి బుధుడు. సేనాధిపతి కుజుడు. ధాన్యాధిపతి- గురువు. సస్యాధిపతి - శని అర్ఘ్యాధిపతి - మేఘాధిపతి కూడా కుజుడు. రసాధిపతి చంద్రుడు అందువలన మిశ్రమ ఫలితాలు సంభవించనున్నాయి. ఈశ్వరారాధన ద్వారా సమస్యలను అధిగమించవచ్చు. దుర్ముఖ శబ్దానికి దుశ్శాలువ అన్నట్లు మంచి అర్థం కూడా చెప్పుకోవచ్చు. నూతన సంవత్సర వ్రత విధానం నిర్ణయసింధు, ధర్మసింధు, వ్రతకల్ప ధ్రుమము నిర్ణయామృతము వంటి ఋషిప్రోక్త గ్రంథములలో చెప్పబడింది. ఒకప్పుడు ఫాల్గుణ పూర్ణిమనుండి ఉగాది ప్రారంభం అయ్యేది. ఇప్పుడు చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది- ఉక్ అంటే నక్షత్రం. యుగాది అంటే సృష్టి ప్రారంభం. ధృవస్థానాలు మారటం వల్ల ఉగాది వెనుకకు జరిగింది. ఈ సంవత్సరం కొందరు ప్రముఖుల శృంగార చరిత్రలు పత్రికలకు ఎక్కుతాయి. పురుషులతోబాటు స్ర్తిలు కూడా నేరాలు చేసే మాఫియా గాంగ్‌లు ఏర్పరచుకుంటారు. బ్లాక్ మార్కెటు పెరుగుతుంది. ఊహించని విధంగా రాజకీయ విద్రోహాల హత్యలూ జరుగుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలల్లోనూ కరవు వస్తుంది. తీవ్రవాదుల ఏరివేతకై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది. కల్తీకల్లు తాగి ప్రజలు మరణిస్తారు. ఇదంతా శుక్రుడు రాజుకావటం వల్ల వచ్చిన ప్రమాదమే. ఇక మంత్రి బుధుడు. దీనివల్ల చాలా ప్రజల సమస్యలపై కోర్టు తీర్పులు నిర్ణయాత్మకంగా మారుతాయి. చట్టసభలకు న్యాయస్థానాలకు మధ్య అభిప్రాయభేదాలు పొడసూపుతాయి. ఉగ్రవాద చర్యలవల్ల కొందరు నాయకులకు ప్రాణాపాయం ఉంది. దుష్టరాజకీయాలు ప్రబలి రాజకీయ రంగంలో నిజాయితీ తగ్గుతుంది. కరువులవల్ల ఆకుకూరలు లభ్యం కావు. ధరలు పెరుగుతాయి. సేనాధిపతి కుజుడు కావటంవలన మారణాయుధాలు విచ్చలవిడిగా ఉపయోగిస్తారు.
అగ్రరాజ్యాల మధ్య స్నేహం క్షీణిస్తుంది. కిడ్నాపులు, హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతాయి. ఉగ్రవాదులు జనసామాన్యంలో కలిసి గందరగోళం సృష్టిస్తారు. చైన్‌స్నాచింగ్‌లను ఆపలేరు. మతకల్లోలాలు రాబోతున్నాయి. విదేశాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులను మోసం చేసి దొంగ వీసాలు ఇచ్చే ముఠాలు వస్తాయి. ఇదంతా అంగారకుని ప్రభావం. ఈ సంవత్సరం సస్యాధిపతి శని. ఈ కారణంగా భూముల ధరలకు రెక్కలు వస్తాయి. పొగాకు పండించే రైతులు విలవిలలాడుతారు. విత్తనాలు, ఎరువులు ధరలు పెరుగుతాయి. తుపానులకు సాగర తీర ప్రజలు సిద్ధంగా ఉండాలి. పాలు, పండ్లు, పెరుగు వెన్న వంటి వస్తువుల ధరలు పెరుగుతాయి. ధాన్యాధిపతి గురువు కావటం వలన కూరలు, నిత్య జీవితావసర ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. కల్తీ పదార్థాలు ప్రాణాంతకంగా తయారవుతాయి.
మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి కుజుడు కావటంవలన ఈదురుగాలులు అకాల వర్షాలు సంభవిస్తాయి. భూకంపాలకు సిద్ధంగా ఉండాలి. పాకిస్తాన్ సహా ముస్లిం దేశాలల్లో ఉగ్రవాదులు (ఐసిస్) వంటి సంస్థల దాడులు పెరిగి ప్రజలు మరణిస్తారు. రసాధిపతి చంద్రుడు కావటంవలన శృంగారం హద్దుమీరిపోతుంది. స్ర్తిలు కీలక పదవులు పొందగలుగుతారు. మామిడి పంట తగ్గి ధర ఎక్కువ అవుతుంది. నీరసాధిపతి శనికావటంవలన ఆన్‌లైన్ నేరాలు, యువతీ యువకులలో నేరప్రవృత్తి పెరుగుతుంది. గంజాయి, హషిష్, డ్రగ్స్ అమ్మకాలు పెరుగుతాయి. శ్రమించకుండా ధనం సంపాదించాలనే కోరిక ఎక్కువ అవుతుంది. 2016 జులై నెల జాగ్రత్తగా ఉండండి. ఈ విపత్తులనుండి రక్షింపబడడానికి రోజూ దేవాలయాలకు వెళ్లి దైవఅర్చన చేసుకోవాలి. ఎర్రచందనం దొంగలు విజృంభిస్తారు. అమెరికాలో విపత్తులు సంభవిస్తాయి.
క్రికెట్ నేరాలు బయటకువస్తాయి. భారత క్రికెట్ సారథి ధోనీకి గ్రహస్థితి అనుకూలంగా లేదు. ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలతో భూగోళం దద్దరిల్లుతుంది. చైనాకు ప్రాకృతిక కష్టాలు తప్పవు. చంద్రబాబు, జగన్‌ల మధ్య రాజకీయ వివాదాలు తారస్థాయికి చేరుతాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి మంచికాలం- కానీ, ప్రత్యేక హోదా రాదు. హెలికాప్టర్లు కూలి కొందరు ప్రముఖులు మరణిస్తారు. ప్రధాని నరేంద్రమోదీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు కేంద్ర మంత్రులు తొలగింపబడుతారు. బొగ్గు కుంభకోణంలో ప్రముఖులు అరెస్టు చేయబడుతారు. ఆంధ్రప్రదేశ్,తెలంగాణాల్లో సాగునీరు, తాగునీరు అందక జనం విలవిలలాడుతారు. పోలవరం ప్రాజెక్టు నదుల అనుసంధానం ఊపునందుకుంటుంది. ఘోరమైన విమాన ప్రమాదం జరుగబోతున్నది. తమిళనాడు ముఖ్యమంత్రిణి జయలలితకు తీవ్ర అనారోగ్యం- పఠాన్‌కోట్ వంటి మరికొన్ని దాడులకు జాతి సిద్ధంగా ఉండాలి.
తెలుగు ప్రాంతాలపై చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు విరుచుకుపడుతారు. లష్కరేతోయిబా ఐసిస్‌ల వలన భారీ జన నష్టం- నేపాల్‌లో మళ్లీ భూకంపాలు వస్తాయి. హైదరాబాద్ నగరంలో రాజకీయ సుస్థిరత వలన పెట్టుబడులు పెట్టేందుకు కొందరు ముందుకు వస్తారు. నాగపూర్, బొంబాయి, పూణె, హైదరాబాదుకు ఉగ్రవాదుల దాడులు పొంచి ఉన్నాయి. ఈ సంవత్సరం నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పతనం కావచ్చు. దిల్లీకి భూకంప ప్రమాదం, హిమాలయ రాష్ట్రాలల్లో వరదలు హైదరాబాద్‌కు నీటి కష్టాలు ప్రారంభం. వర్షాలు లేక కోటి మంది నగరవాసులు అల్లాడుతారు. గ్రీసుకు వలెనే ఇంగ్లండు, జర్మనీ దేశాలకు ఆర్థిక సంకటం. ఉత్తరప్రదేశ్‌లో మతకల్లోలాలు అదుపుచేయటంలో అఖిలేశ్‌యాదవ్ విఫలుడవుతాడు. దక్షిణ భారతంలో ఒక సంగీత గాత్రం ఆగిపోతుంది. కెసిఆర్‌కు ఇది కలిసివచ్చే కాలం. స్విస్ బ్యాంకు ఖాతాలు వెలుగుచూస్తాయి.
దేశంలో దొంగ సన్యాసులు ప్రజలను మోసం చేస్తారు. విదేశాలలోని హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతాయి. హైదరాబాద్‌లో ఒక హెరిటేజ్ బిల్డింగ్ కూలిపోతుంది. జననష్టం జరుగవచ్చు. ఇండియా- పాకిస్తాన్‌ల మధ్య, ఇజ్రాయిల్- పాలస్తీనాల మధ్య యుద్ధం ప్రత్యక్షంగా లేక పరోక్షంగా జరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత, బెంగాల్‌లో మమత గెలువబోతున్నారు. నితీశ్‌కుమార్‌కు ఢోకా లేదు. బిజెపిలో అద్వానీకి మళ్లీ ప్రాధాన్యం పెరుగుతుంది. విద్యాలయాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతాయి. గోహత్యలను ఆపలేరు. జలవివాదాలు పెరుగుతాయి.
ఈసారి పవిత్రమైన కృష్ణా నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ నది మహారాష్టల్రోని మహాబలేశ్వర్ వద్ద జన్మించి ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవివద్ద సాగర సంగమం చేస్తుంది. నదీ పరీవాహక ప్రాంతాలల్లో ఎవరైనా నదీ స్నానాలు చేయవచ్చు. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం 2016 ఆగస్టు 11వ తేదీ నుండి 23వ తేదీ వరకు పుష్కర కాలం.
ఉగాది విధులు: పంచాంగ శ్రవణం- ప్రపా(జల) దానం, ధ్వజారోహణం, నూతన వస్తధ్రారణం, నింబ పుష్ప, అశోక పల్లవ భక్షణం- ప్రతిమా దానం బ్రహ్మపూజ నెయ్యి వేప పూత బెల్లము మామిడి ముక్కలు కలకండ మిరియాలు కలిపిన వేప ప్రసాదము పరగడుపున తీసుకోవాలి.
ఇది వరుసగా చంద్రబుధగురుశుక్ర శాంతి కారకములు. వాత పిత్త కఫ నిర్మూలనములు. వరుసగా వసంత నవరాత్రములలో సౌభాగ్య గౌరీవ్రతం మత్స్య నారాయణవ్రతం లక్ష్మీవ్రతం చేయాలి. రామనవమినాడు కల్యాణం. వడపప్పు విసనకర్రలు పానకం పంచి పెట్టాలి. నూతన సంవత్సర దేవతకు స్వాగతం పలుకుదాం.
శ్రీకరమై రసకవితా శ్రీకరమై సర్వజన వ
శీకరమై శోభాకరమై నవరస సు
ధాకరముదయించె దివ్యధాత్రి హసింపన్
దుర్ముఖుడి పుడరుదెంచెను నిర్మల చితమ్ము
తోడ నీలగళుండు
దుష్కర్మము తొలగుట
జనావళి ధర్మాచరణంబు కొరకు
ధ్యానింపవలెన్’’

-ముదిగొండ శివప్రసాద్