మెయిన్ ఫీచర్

అనాథలకు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సేవ చేయాలంటే బ్యాంక్ బాలెన్స్‌లు అవసరం లేదు. నలుగురికి మంచి చేయాలనే మంచి మనసుంటే చాలు. ఇలాంటివారికి సరైన వేదిక హైదరాబాద్ యంగిస్తాన్ ఫౌండేషన్. సమాజానికి తమ వంతు సేవ చేయాలనుకునే యువతరానికి ఇదొక మంచి ఫ్లాట్‌ఫాం.
పిజ్జా డెలివరీ బాయ్‌కి పేదలంటే మమకారం
యంగిస్థాన్ ఫౌండేషన్ అనే సంస్థను ఏర్పాటు చేసింది అరుణ్ యల్లమాటి. చిన్నప్పటి నుంచి కష్టాల మధ్యనే బతికాడు. కనీస అవసరాలకు నోచుకోలేదు. 18 ఏళ్ల వయసులో పిజ్జాలు డెలివరీ చేసి ఆ డబ్బుతో చదువుకున్నాడు. ఇలాంటి దిగువ మధ్యతరగతి యువకుడు నేడు ఐదు లక్షల మంది అనాథలకు అండగా నిలబడ్డాడు. ఇందుకోసం మూడేళ్ల క్రితం యంగిస్తాన్ అనే ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశాడు. తొలుత ఐదుగురు వలంటీర్లతో తన ప్రయాణాన్ని ఆరంభించాడు. ఆ రోజుల్లో కేవలం 10 మంది నిరాశ్రయులకు మాత్రమే అన్నం పెట్టేవాడు. నాలుగేళ్లు తిరిగేసరికి సంస్థ కార్యకలాపాలు అతను ఊహించనంతగా పెరిగాయి.
సవాళ్లకు ఎదురీత
ఈ సంస్థ స్ధాపించినప్పటి నుంచి సమస్యలు ఎదురవుతున్నా వాటిని సవాల్‌గా తీసుకుని ముందుకు సాగుతుంది ఈ యువతరం. కొంతమంది వలంటీర్లు మధ్యలోనే వెళ్లిపోతుంటారు. కొత్తగా వచ్చి చేరుతుంటారు. మరికొంతమంది సాయం చేయకపాగా అనుమానాస్పదంగా చూస్తూ కెరీర్‌ను డెవలప్ చేసుకోమని సలహా ఇస్తుంటారు. వీటన్నింటిని తట్టుకుంటూ సంస్థను ముందుకు తీసుకువెళుతున్నారు.
ఇపుడు అరుణ్‌తో పాటు సేవ చేయటానికి ముందుకు వచ్చేవారంతా 18 నుంచి 30 ఏళ్లలోపువారే. వీరిలో స్టూడెంట్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటారు.
ఎలాంటి సేవాకార్యక్రమాలు చేస్తారు?
హైదరాబాద్‌లో పేదలకు కడుపునిండా ఆహారాన్ని అందించాలనే సదాశయంతో ఈ సంస్థ అడుగులు వేసింది. ఫుట్‌పాత్‌లపై ఉండే వెయ్యిమంది అనాథలకు ఆహార పొట్లాలు అందించేవారు. తొలుత ఈ వలంటీర్లే చేతి డబ్బులు వేసుకుని సబ్సిడీపై ఆహార పొట్లాలు తీసుకుని అందించేవారు. అనాథలకు ఆహార పొట్లాలు అందించే ప్రాజెక్టులో నేడు 70 మంది వలంటీర్లు ఉన్నారు. వీరంతా సరుకులు, కూరగాయలు తీసుకువచ్చి వండి పొట్లాలుగా కట్టి అందిస్తున్నారు.
ఈ సంస్థ కార్యకలాపాలు నేడు హైదరాబాద్‌తో పాటు ముంబయి, భోపాల్, నొయిడా నగరాల్లో విస్తరించింది. దాదాపు ఐదు లక్షల మంది అనాథలకు ఆదివారం నాడు కడుపునిండా అన్నం పెడుతున్నారు.
అంతేకాదు నిరాశ్రయుల కనీస అవసరాలు తీరుస్తారు. అంటే జుట్టు నీట్‌గా కట్ చేయడం, స్నానం చేయించటం, మంచి బట్టలివ్వటం, వారికి గాయాలుంటే ట్రీట్‌మెంట్ చేయించటం చేస్తుంటారు. ఈ సేవ కోసం 50 మంది వలంటీర్లు ప్రతి ఆదివారం సిద్ధంగా ఉంటారు. జెండర్ అవేర్‌నెస్ ప్రాజెక్టు పేరుతో మురికివాడల్లోని 50 మంది మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్నారు. మరో 50 మంది చిన్నారులకు చదువుచెప్పిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లలో, ఫుట్‌పాత్‌పై, ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర తచ్చాడే అనాథ పిల్లల్ని చేరదీస్తారు. చలికాలంలో ఫుట్‌పాత్‌లపై పడుకునే అనాథలకు దుప్పట్లు పంపిణీ చేస్తారు. ఎండాకాలంలో చెప్పులు, తాగునీరు అందిస్తారు.
దేశమంతా విస్తరించాలనే ఆశయం
సేవా కార్యకలాపాలను దేశమంతా విస్తరింపచేయాలనేది ఈ యువసైన్యం ఆశయం. అంతేకాదు 24 గంటల పాటు వీధివీధి తిరుగుతూ కనిపించిన అనాథకల్లా కడుపునిండా ఆహారాన్ని అందించాలని భవిష్యత్తు ప్రణాళిక. అంతేకాదు విమెన్ ఆఫ్ కరేజ్ అనే ప్రాజెక్టు కింద రకరకాల చైతన్య కార్యక్రమాలు నిర్వహించి ఐదు వేల మంది అమ్మాయిలను భాగస్వామ్యులను చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. సాటి మనిషి సాయం చేయడమే పరమావధిగా పెట్టుకున్న ఈ ఫౌండేషన్‌కు ఆసియా ఫసిఫిక్ అవార్డు దక్కింది.
హైదరాబాద్‌లోని ఒ కూడలి ప్రాంతం. ఫుట్‌పాత్‌పై ఓ అనాథ పడుకున్నది. ఆమె జట్టు అట్టలుకట్టి ఉంది. మురికి బట్టలతో అసహ్యంగా ఉన్నది. ఇంతలో ఇద్దరు యువ వలంటీర్లు అక్కడకు వచ్చారు. ఆమెను తీసుకువెళ్లి స్నానం చేయించారు. నీట్‌గా జుట్టు కట్ చేశారు. శుభ్రమైన దుస్తులు ఇచ్చి వేయించారు. చిన్న అద్దాన్ని తీసుకువచ్చి ఆమెను చూడమన్నారు. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఆ అనాథ ఆశ్చర్యపోయంది. తానేనా ఇలా ఉంది అని సంబరపడింది. సంతోషంతో చిన్నిపిల్లలాగా వలే చప్పట్లు చరిచింది. ఆ వలంటీర్ల వంక కృతజ్ఞతగా చూసింది.