మెయిన్ ఫీచర్

బాల మేధావులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అతిగొప్ప మెన్సా సంస్థలో సభ్యులుగా అవకాశం కొల్లగొట్టేస్తూ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నారు. పది నుంచి పనె్నండేళ్లలోపున్న బాలబాలికలు గడచిన ఐదారు సంవత్సరాలుగా ఈ ఘనత సాధిస్తున్నారు. ముఖ్యంగా భారత సంతతి చిన్నారుల సాధిస్తున్న ఫలితాలు మేధోవర్గాలను మురిపిస్తున్నాయి. ప్రపంచంలోనే పేరున్న సంస్థ ‘మెన్సా’. ప్రజ్ఞాసూచీ (ఐక్యు) పరీక్షలు నిర్వహించి ఉత్తమ ఫలితం సాధించినవారికి సభ్యత్వం ఇచ్చే సంస్థ ఇది. ప్రపంచంలోనే అతిగొప్ప శాస్తవ్రేత్తలుగా పేరొందిన అలనాటి ఐన్‌స్టీన్, ఈనాటి స్టీఫెన్ హాకింగ్స్‌వంటి వారి ఐక్యు 160గా రికార్డయిన సంగతి తెలిసిందే. కానీ మన చిన్నారులు బ్రిటిష్ మెన్సా సంస్థ నిర్వహిస్తున్న ఐక్యు పరీక్షల్లో 162 పాయింట్లు సాధించి వారికన్నా మెరుగైన స్థితిలో ప్రతిభ చూపి ఔరా అనిపిస్తున్నారు. తాజాగా ఈ ఏడాది రాజ్‌గౌరి పవార్ అనే పనె్నండేళ్ల బాలిక 162 పాయింట్లతో 99 శాతం పర్సంటైల్ సాధించి మెన్సా సభ్యత్వం సాధించింది. మేధస్సుకు సంబంధించిన కొలమానంగా చెప్పుకునే ‘ఐక్యుఖ (ప్రజ్ఞా సూచి) పరీక్షలు వివిధ సంస్థలు నిర్వహిస్తున్నప్పటికీ బ్రిటిష్ మేన్సా సంస్థ ఏటా నిర్వహించే ఐక్యు టెస్ట్‌కు ప్రపంచంలో ప్రాధాన్యం ఉంది. 130కు పైగా పాయింట్లు సాధిస్తే మెన్సా సంస్థలో సభ్య త్వం సాధించే అవకాశం ఉంటుంది. ఒక్క మేధస్సు తప్ప కుల, మత, రంగు, జాతి, ఆర్థిక స్థితిగతులు, వయసు, లింగ బేధాలను చూడకుండా సభ్యత్వం ఇవ్వడం ఈ సంస్థ ప్రత్యేకత. ప్రస్తుతం 20వేల మంది సభ్యులు ఇందులో ఉన్నారు. వారిలో 2వేలమంది చిన్నారులే. వీరంతా 12 ఏళ్లలోపు వారే. 2 సంవత్సరాల నుంచి శతాధిక వృద్ధులూ సభ్యు ల్లో ఉన్నారు. రిక్షాతొక్కే నిరుపేద నుంచి ప్రపంచంలో పేరెన్నికగన్న సంపన్నులూ వీరిలో ఉన్నారు. సభ్యత్వానికి కొలమానం ఒక్కటే. ఐక్యు పరీక్షల్లో మంచి మార్కులు, లేదా 98 శాతం పర్సంటైల్ సాధించడం. ఇప్పుడు ఈ ఏడాది నిర్వహించిన బ్రిటిష్ మెన్సా ఐక్యు టెస్ట్‌లో భారత సంతతి విద్యార్థిని రాజ్‌గౌరి పవార్ 162 పాయింట్లు సాధించి రికార్డు సృష్టించింది. 99శాతం పర్సంటైల్‌తో ఔరా అనిపించింది. ‘విదేశీగడ్డపై భారత సంతతి బాలికగా ఈ ఘనత సాధించడం నాకెం తో గర్వకారణంగా ఉంది. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను’ అని వివిధ పత్రికలతో మాట్లాడుతూ ఆమె వ్యాఖ్యానించింది. ఆమె తండ్రి డాక్టర్ సూరజ్‌కుమార్ యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్‌లో రీసెర్చ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. మహారాష్టల్రోని పూనె జిల్లాకు చెందిన బారామతి గ్రామం వారి స్వస్థలం. స్విమ్మింగ్, నెట్‌బాల్, చెస్ ఆటలంటే ఇష్టమంటున్న రాజ్‌గౌరి ఫిజిక్స్, ఖగోళశాస్త్రం, పర్యావరణం అంశాలంటే ఇష్టమని, మెడిసిన్ చేయాలని ఉందని అంటోంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే పరీక్షలకు భిన్నంగా బ్రిటిష్ మెన్సా ఐక్యు టెస్ట్ ఉంటుందంటున్న నిత్యం చదువుకునే సబ్జెక్టులతో దీనికి సంబంధం ఉండదని అంటోంది. ఇక ఇల్‌ఫోర్డ్‌కు చెందిన ఫుల్లీవుడ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థి ధ్రువ్ తలతి గతేడాది మెన్సాస్ కేటిల్ 3 బి పేపర్ విభాగంలో 162 పాయింట్లు సాధించి రికార్డు సాధించాడు. అప్పు డు అతడి వయస్సు పదేళ్లు మాత్ర మే. పరీక్ష పెద్ద కష్టం గా లేదు, కానీ సమయమే సరిపోదంటాడు ధ్రువ్. ఎప్పుడూ ఆటల్లో, తినడం లో మునిగిపోయే ధ్రువ్ ఇంత మంచి ఫలితం సాధిస్తాడని అనుకోలేదంటారు అతడి తల్లిదండ్రులు. ఇక క్షమియా వాహి గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సిందే. ఆమె కూడా గత ఏడాది బ్రిటిష్ మేన్సా ఐక్యు పరీక్షలో 162 మార్కులు, 99 పర్సంటైల్‌తో ఔరా అనిపించింది. ఆ ఘనత సాధించినప్పుడు ఆమె వయసు 11 సంవత్సరాలు మాత్రమే. ఐటి మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ వికాస్, పూజావాహిల ముద్దుల పట్టి ఆమె. ముంబై నుంచి ఇంగ్లండ్ వెళ్లిన ఆ కుటుంబం ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. 162కు 162 మార్కులు సాధించడం మాటలుకాదుకదా. ఐపాడ్‌పై కేటిల్ 3 పేపర్ బి విభాగంలోకూడా ఆమె ప్రజ్ఞ చూపింది. చదరంగం ఆటలో బ్రిటన్‌లో జాతీయస్థాయి ట్రోఫీలను గెలుచుకున్న క్షమియా ఓ సంచలనంగా మారింది. ఇక బెంగళూరులో పుట్టి ఇంగ్లండ్ చేరుకున్న సాన్యా వర్మ రెండేళ్ల క్రితం ఇదే సంచలనాన్ని నమోదు చేసింది. హారీపోటర్ అండ్ ది హంగర్ గేమ్స్ సిరీస్ అంటే ఇష్టపడే సాన్యా పదకొండేళ్ల వయసులో 162 పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. వయసుకు, ప్రజ్ఞాసూచి (ఐక్యు)కు సంబంధం లేదని తేలిపోయింది. ఈ విషయంలో కూతురు సాన్యతో పందెం కట్టి పది పౌండ్లు ఓడిపోయానంటున్నాడు ఆమె తండ్రి సునీర్ వర్మ. అద్భుతమైన ఫలితాలు సాధించిన సాన్యావర్మ, క్షమియా వాహి హౌస్ ఆఫ్ కామన్స్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానం పొందడం గర్వకారణమంటాడు భారత సంతతికి చెందిన యుకె పార్లమెంటేరియన్ వీరేందర్ శర్మ. ఇక పదకొండేళ్ల వయసులోనే ఐక్యు పరీక్షలో 162 పాయింట్లు సాధించిన లైడియా సెబాస్టియన్ మరో భారతీయ సంచలనం. ఈమె కూడా హారీపోటర్ సిరీస్‌ను ఒకపట్టుపట్టింది. ఏడు పుస్తకాలను మూడేసిసార్లు చదివేసింది. వయోలిన్ వాద్యంలో నాలుగేళ్ల వయసులోనే ప్రావీణ్యం సాధించింది. ఆమె తండ్రి అరున్ సెబాస్టియన్ రేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. వెబ్‌సైట్‌లలో ఐక్యు పరీక్షల ప్రశ్నపత్రాలు తరచూ చూసేదని అంటాడతను. ఆరునెలల వయసులోనే తను మాట్లాడటం మొదలెట్టిందని అతడు ఆనందంగా చెబుతూంటాడు. ఇక పదేళ్ల ముకుంద్ కూడా మెన్సాస్ వెర్బల్ రీజనింగ్ కేటిల్ 3 బి స్కేల్ ఐక్యు పరీక్షలో 162 మార్కులు సాధించాడు. హైలాండ్స్ ప్రైమరీ స్కూల్ విద్యార్థి అయిన ముకుంద్ సోని తను సాధించిన ఫలితాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. తమ పిల్లాడు తెలివైనవాడేనని తెలుసుకానీ, ఇంత గొప్ప ఫలితం సాధిస్తాడని ఊహించలేదంటాడు అతడి తండ్రి మహేంద్ర సోని. భారత్‌కు తిరిగివచ్చేస్తావా అని అడిగితే ‘తప్పకుండా వచ్చేస్తా. మంచి అవకాశం రావాలంతే. అయితే ఇప్పుడు మాత్రం చదువు ఇక్కడే పూర్తిచేస్తా’ అన్నది అతడి సమాధానం. సాంకేతిక ప్రగతి సాధించిన ఈ రోజుల్లో వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వదిలేసి, గమనిస్తూ వారిని స్వేచ్ఛగా ఎదిగేలా చేస్తే ఇలాం టి ఫలితాలు వస్తాయంటున్నారు వారి తల్లిదండ్రులు. దారితప్పకుండా వారిని గమనిస్తూ, ప్రోత్సా హం అందిస్తే సహజంగా వచ్చిన మేధ పదునుదేరుతుందని అం టారు వారు. ఐక్యు పరీక్షల్లో ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్స్‌ను మించి మార్కులు వచ్చినా వారిలా అంతటి గొప్ప శాస్తవ్రేత్తల్లా రాణిస్తారా అన్నది పక్కనబెడితే అంత చిన్నవయసులో వారి సాధించిన ఘనత తక్కువేమీకాదు. పైగా అలా బ్రిటిష్ మెన్సా ఐక్యు పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధిస్తున్నవారిలో భారత సంతతి చిన్నారులు ఉండటం ఎంతో గర్వకారణం.

చిత్రాలు.. రాజ్‌గౌరి * ధ్రువ్ *లైడియా *క్షమియా వాహి *సాన్యావర్మా *ముకుంద్ సోని

- కృష్ణతేజ