మెయిన్ ఫీచర్

చెదరని జ్ఞాపకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ప్రపంచ ప్రజలు మనసు గెలుచుకున్న అందాల యువరాణి. అందుకే అందరి హృదయ సామ్రాజ్ఞి అయింది. ఆమె అందమైన నవ్వు వెనుక దాగివున్న విషాదం ప్రజానీకాన్ని వెన్నాడుతూనే ఉంది. ఆ నవ్వు అనంత విశ్వంలో కలిసిపోయి నేటికి ఇరవై ఏళ్లు. అయినా ఈనాటికీ అందరి మనసుల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఆమే బ్రిటిష్ ప్రినె్సన్ డయాన. రేపటికి ఆమె చనిపోయి రెండు దశాబ్దాలు దాటింది. ఒక్క బ్రిటన్‌లోనే కాదు యావత్ యూరప్ ఖండంలోనూ ఈ అందాలరాశిని ఇప్పటికి అనుక్షణం తలచుకుంటూనే ఉంటున్నారు. ఆమె ఇరవై వర్థంతి సందర్భంగా యూరప్ ఖండంలోని ప్రముఖ మేగజైన్లు, దినపత్రికలు, టీవీలు వారం రోజులు ముందుగానే ఆమె గురించి ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి. బ్రిటన్‌లో డయానా కోసం స్పెషల్ ఎడిషన్లు, సప్లిమెంట్స్, ప్రత్యేక వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఆమె మృత్యువుకు కారణమైన మిస్టరీని ఈనాటికీ ఛేదించలేకపోయినప్పటికీ ఆస్ట్రియాకు చెందిన ఒఆర్‌ఎఫ్ అనే పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఈ వారంలోనే ఎన్నో డాక్యుమెంటరీలను రూపొందించి విడుదల చేసింది. ‘డయానా ఇప్పటికీ.. ఎప్పటికీ మరిచిపోలేం’ అంటూ బకింగ్‌హోమ్ ప్యాలెస్‌లో ఆమె గడిపిన జీవితంపై కథనాలు వెలువరిస్తున్నాయి. వియన్నాలోనైతే ఆగస్టు 31వ తేదీనాడు రేడియో కార్యక్రమాలన్నీ కూడా ఆమెకు అంకితమివ్వబోతున్నాయి. ఆస్ట్రియాలో ఓ ప్రముఖ జర్నలిస్ట్ ఫాన్ ఈవాల్డ్ వియాన్నా పార్క్ లో ఆమె జ్ఞాపకార్థం స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్-2 ఛానల్ ఆదివారంనాడు డయానా మీద తీసిన పలు పరిశోధనాత్మక డాక్యుమెంటరీలను ప్రసారం చేసింది. ఇరవై ఏళ్లు అయినప్పటికీ ఇలా ప్రజలు ఆమెను జ్ఞప్తికి తెచ్చుకుంటూ స్వచ్చందంగా కార్యక్రమాలు నిర్వహించటం గొప్ప విషయమే. శత్రువులను కూడా తన చిరునవ్వుతో గెలుచుకున్న ఆమె మరణానికి ముందు అనుభవించిన మానసిక క్షోభను నేడు పలువురు గుర్తుకు తెచ్చుకుంటు కన్నీరు పెడుతున్నారంటే డయానాపట్ల ఉన్న అభిమానాన్ని చాటిచెబుతుంది. బల్గేరియాలోని వార్తాపత్రికలు కనీసం ఐదు పేజీలకు తగ్గకుండా కథనాలు ప్రచురించాయి. ప్రముఖ బిబిసి ఛానల్ సైతం ‘డయనాతో 7 రోజులు’ అనే డాక్యుమెంటరీని ప్రచురించింది. కన్న తల్లితో ఆమెకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఆమె జీవితంలోని కొన్ని విశేషాలు..
డయాన జూలై1,1961లో జన్మించారు. ఆమెకు ఇద్దరు అక్కలు. ఒక తమ్ముడు ఉన్నారు. సంపన్న వంశంలోనే పుట్టింది.
డయానకు బాల్లెట్ నృత్యం అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు చిన్నప్పటి నుంచి ఆటలు బాగా ఆడేది.
ఆమె యుక్త వయసులో ఉండగా.. తల్లిదండ్రులు విడిపోయారు. బోర్డింగ్ స్కూల్లో వేసినా అక్కడ కూడా ఆమె ఎల్లప్పుడూ ఎంతో సంతోషంగానే ఉండేది.
స్కూలు విద్యాభ్యాసం అయిపోగానే ఆయాగా పనిచేసింది. ఆ తరువాత నర్సరీ అసిస్టెంట్‌గానూ పనిచేశారు.
ప్రిన్స్ చార్లెస్‌తో వివాహం తరువాత ఆమె బ్రిటన్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అందానికి ఐకాన్‌గా మారిపోయారు. రాజవంశంలోకి అడుగుపెట్టిన తరువాత ఆమె జీవితమే మారిపోయింది.
ఆ వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ సందర్భంగా ఆమె ధరించిన గౌను పొడవు 7.5 మీటర్లు.
ప్రిన్స్ చార్లెస్‌తో పరిచయం 1970లో కలుగగా.. 1981లో ఆమెను వివాహం చేసుకునేందుకు చార్లెస్ సంసిద్ధత వ్యక్తం చేశారు.
వివాహనికి 3,500 మంది ముఖ్యమైన అతిథిలు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహన్ని దాదాపు ప్రపంచవ్యాప్తంగా 750 మిలియన్ల ప్రజల్లో టీవీల్లో వీక్షించారు.
పెళ్లయిన తరువాత ఆమె ఎక్కువగా స్కూళ్లు, ఆసుపత్రులు సందర్శించి పిల్లలకు, రోగులకు ఓదార్పునందించేవారు.
అతి తక్కువ కాలంలో బ్రిటన్‌లోనేగాక యావత్ ప్రపంచ ప్రజల మనసు గెలుచుకున్న యువరాణి ఎవరంటే డయాన అని చెప్పవచ్చు.
రాజవంశంలోకి అడుగుపెట్టినా ఆమె రాజభోగాల వైపు మొగ్గు చూపులేదు. సాధారణ జీవితానే్న ఇష్టపడేవారు.
చారిటీ సంస్థలకు విరాళాలు పోగేసి ఇచ్చేవారు. హెచ్‌ఐవి, ఎయిడ్స్ పేషెంట్లను చూస్తే చీదరించుకుంటాం. కాని డయాన వారిని అక్కున చేర్చుకున్న సున్నిత మనస్కురాలు.
ప్రిన్స్ చార్లెస్‌తో విడాకులు తరువాత ఆమె పాపులార్టీ ఏమాత్రం తగ్గలేదు. ఆమెను ‘ప్రజల రాణి’గా అభివర్ణించారు. 1997లో పారిస్ సందర్శించిన సందర్భంగా ఆమె కారును ఫొటోగ్రాఫర్స్ వెంబడించారు. ఈ సందర్భంగా జరిగిన కారు ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలయ్యారు.
అమె మరణం ప్రతి ఒక్కరిని కదిలించింది. అంతేకాదు ఈ సందర్భంగా నిర్వహించిన అంతిమయాత్రను టీవీల ముందు కూర్చుని 32 కోట్లమంది ప్రజలు వీక్షించారు.
డయాన మృతి తరువాత ఆమె పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వంద చారిటీ సంస్థలు ఏర్పాటయ్యాయ్యంటే ఆమెకు ఉన్న ప్రజాదరణ వెల్లడవుతుంది.
పిల్లలంటే అభిమానాన్ని చూపే డయాన అంటే బ్రిటన్‌లో చిన్నారులే ఓ పార్క్‌లో ఆమె పేరుతో ఓ ఫౌంటెన్ ఏర్పాటు చేసుకుని ఆడుకుంటున్నారు.

చిత్రాలు.. డయాన, *తన పిల్లలను స్కూలుకు పంపుతున్న డయాన (ఫైల్ ఫొటో)

-టి.ఆశాలత