మెయిన్ ఫీచర్

చెట్టంత ఎదిగిన మట్టిమనిషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిలో కొబ్బరికాయ కొట్టడంవల్ల పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ మొక్క నాటితే పుణ్యం వస్తుంది అని నమ్మినోడు. మార్చి 30న పద్మశ్రీ పురస్కారం గ్రహించిన సందర్భంగా.. కరెన్సీ నోట్లపై చెట్ల ఆవశ్యకతను తెలిపే వాక్యాలను ముద్రించాలని కోరినవాడు. నడకకన్నా నిదానంగా పరుగెత్తే డొక్కు లూనా.. దానికి తగిలించిన పర్యావరణ సూక్తులు, ప్రకృతి అనుకూల నినాదాలు, ఒంటిపై ముతక పంచె చొక్క మెడలో వేళ్లాడేసుకున్న వృక్షో రక్షతో రక్షతిః బోర్డు.. ఆ రింగు బోర్డే ఆయన కంఠా భరణం..

చెట్టును చూసినపుడే కాదు చల్లని గాలి వీచినపుడల్లా చెట్టంత ఎదిగిన ఆ మట్టి మనిషి గుర్తొస్తాడు.. మంచి గుణం మనిషితనం గ్లోబుపై విస్తరించుకొని మహావృక్షమై వెలిసినోడు.. వనజీవిగా విస్తరించిన వేరు దరిపల్లి రామయ్య అతని అసలు పేరు. ప్రకృతి సిగలో పువ్వుల సంతసం.. మొక్కల మోముపై ఆకుపచ్చ సంతకం.ఇంతింతై పద్మశ్రీ అంతైనోడు నాటిన విత్తు నింగికెసిన చెట్టంతైనోడు. ప్రకృతెంత పచ్చగా మురిసిపోతుందో తను చుట్టిన చెట్టు చీరలో.. కొమ్మల గూటిలో పిట్టంతైనోడు.. ఎన్ని పక్షులు సేద తీరాయో తను కట్టిన కొమ్మ గూటిలో.. మరెన్ని విహంగాలు కడుపు నింపుకున్నాయో తను నాటిన హరిత ధాన్యాగారంలో.. ఎన్ని ప్రాణులు సేదతీరాయో తను నాటిన చెట్ల నీడలో పర్యావరణమెంత ఉపశమనం పొందిందో ఓజోన్ పొర గాయంలో..

ఖమ్మం గ్రామీణం రెడ్డిపల్లి నుండి ఢిల్లీకి విస్తరించిన ఘనఖ్యాతి తనది. రాష్టప్రతి చేతులమీదుగా పద్మశ్రీ పొందిన అతి సామాన్యుడు. ఏ ప్రచారం లేదు, ఎవరి సిఫారసు లేదు. చేపట్టిన వృక్ష మహాయజ్ఞపు అంకితభావమే ఆయనను ప్రతిష్ఠాత్మక పురస్కార అర్హుడిని చేసింది. పద్మశ్రీ వరించింది. ఇంటిలిజెన్స్ నివేదికలో ఆయనకా పురస్కారం దక్కింది. సమాజానికి మంచి చేయాలన్న సంకల్పం పనిలో చూపే చిత్తశుద్ధే అందుకు దోహదమయ్యింది.
చేసే ఆ పని ఎంత చిన్నదైనా కావచ్చు.. కొంచెమైనా సరే అందులో నిజాయితీ ఉంటే చాలు, ఎప్పటికైనా అది నిన్ను నిన్నుగా నిలబెడుతుంది. విశ్వ యవనికపై నీ ఉనికిని ప్రత్యేకంగా ఆవిష్కరిస్తుంది. గడ్డి పువ్వులా ఈ రోజు మట్టి నేలలో ఎక్కడ నువ్ దాగున్నా తాటిచెట్టంతగా ఆకాశం వేదిక ఎక్కిస్తుంది. ఆ రోజు నిన్ను చదవాలంటే నీ వాళ్ళే కాదు లోకం తలలన్నీ పైకెగరేయాల్సిందే. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం దరిపల్లి రామయ్య ఉరఫ్ వనజీవి రామయ్య. ఈయన సాధించిన ఘనత ప్రతి ఒక్కరికీ స్ఫూర్తివంతం, యువతరానికి ఆదర్శం..
అతనికి అయిదేళ్ళ వయస్సప్పుడు కలిగిన చెట్టు ప్రేమ గత అరవై అయిదేళ్ళుగా కొనసాగుతూనే వుంది. పెళ్లి సంసారం తన ప్రేమకు అవరోధం కాలేదు. భార్య సైతం అతని ప్రేమకు దాసోహం.. ఎందుకంటే ఆమె రామయ్య జానకమ్మ- భర్త చెట్టుకు అంటుకొమ్మ.
మీలో ఎవరు కోటీశ్వరుడు.. విన్నప్పుడల్లా వనజీవి రామయ్యే గుర్తొస్తాడు. ఒకటా రెండా అతను నాటిన మొక్కలు ఒక కోటి పైమాటే. వెదజల్లిన విత్తనాలు ఆకాశంలో నక్షత్రాలన్నీ. తన గుడిసె పక్క ఖాళీ స్థలంలో కోట్ల విలువైన ఎర్ర చందనం చెట్లున్నా ఏమీ లేని పేదవాడు.
చీపురు పట్టి ఫొటోలకు ఫోజిచ్చి చేతులను శుభ్రపరచుకునే నేత కాదు. గుంతలో మొక్క పాతి చేతులు దులుపుకునే నాయకుడూ కాదు.. రామయ్య చెట్టు నాటి చేతులు కడుక్కోడు, మొక్క పురిటి మట్టిని గుండెలకు హత్తుకుంటాడు. తను నడిచొస్తుంటే కొమ్మలు పూలు పరిచి స్వాగతమంటాయ్. జన్మ దానం చేసిన తండ్రితో చెట్టు సెల్ఫీ దిగుతుంది. గుండె ఆల్బంలో భద్రపరచుకుంటుంది.
చెట్లే బిడ్డలు, బిడ్డల్లోనూ చెట్లే. హరిత, చందన, పుష్ప, లావణ్య అతని కూతుర్ల పేర్లు. ఎంత మమేకం ప్రకృతితో. అన్నం తినని రోజుందేమోకానీ చెట్ల సేవలో తరించని రోజుండదు. వేసవిలో సమీప అడవులు కొండలు కోనలనుండి విత్తనాలు సేకరించటం, వర్షాకాలంలో వాటిని నారు పోసి ఇంటివద్దే మొలకెత్తించటం.. పసిపాపల్లా నీరు నోటికందించి బతికించటం.. ఎదిగిన మొక్కలను కాలనీల్లో రోడ్ల వెంట, ఖాళీ జాగాల్లో నాటి సంరక్షించడం స్థానికులకు దత్తత ఇవ్వటం..
చంద్రబాబు నాయుడు, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి, కెసిఆర్‌ల ప్రశంసలు సన్మానాలు పొందినోడు.. నాటి ప్రధాని పి.వి.నరసింహారావు, గవర్నర్ సుశీల్ కుమార్ షిండేల ద్వారా కేంద్ర సేవా అవార్డు, వనమిత్ర అవార్డు పొందినోడు. జనవరి 25న కేంద్రం ప్రకటించిన పద్మాల్లో ఒకడు. గుడిలో కొబ్బరికాయ కొట్టడంవల్ల పుణ్యం వస్తుందో రాదో తెలియదు కానీ మొక్క నాటితే పుణ్యం వస్తుంది అని నమ్మినోడు. పద్మశ్రీ మార్చి 30న పురస్కారం గ్రహించిన సందర్భంగా.. కరెన్సీ నోట్లపై చెట్ల ఆవశ్యకతను తెలిపే వాక్యాలను ముద్రించాలని కోరాడు.
నడకకన్నా నిదానంగా పరుగెత్తే డొక్కు లూనా.. దానికి తగిలించిన పర్యావరణ సూక్తులు, ప్రకృతి అనుకూల నినాదాలు, ఒంటిపై ముతక పంచె చొక్క మెడలో వేళ్లాడేసుకున్న వృక్షో రక్షిత రక్షతి బోర్డు.. ఆ రింగు బోర్డే ఆయన కంఠాభరణం..
ఎవరైనా మనుషులుగానే పుడతాం.. పుట్టుకతో ఎవరూ మహాత్ములు కారు. చేసిన మంచి పనులవల్లనే మహాత్ములవుతారు.
మనిషిగా పుట్టినందుకు సమాజానికి మేలు కలిగించే మంచి పని ఒక్కటైనా చేయాలి. మతం ఏదైనా, మానవజన్మ ప్రసాదిస్తూ భూమీదకు పంపేముందు దేవుడు చెవిలో చెప్పే హితోక్తి.. అక్కడ ఊకొట్టి అమ్మ కడుపు నుండి బాహ్య లోకానికి బయటపడగానే అన్నీ మరిచిపోతాం.. కానీ కొందరికి మాత్రం జ్ఞాపకశక్తి ఎక్కువ. మరుసటి దినం మాస్టారుకు అప్పగించాల్సిన పాఠం మననం చేసుకునే విద్యార్థిలా ఆ మహత్ వాక్య సాధకులవుతారు. చరిత్ర గ్రంధ కావ్యంలో ప్రత్యేక పుటలవుతారు. మనిషికి కులం అవసరం లేదు. దేశానికి మతంతో పనిలేదు. హిత కార్యానికి విద్య అక్కర్లేదు. అనాగరికత అవరోధం కాదు.
శ్రామికుని చెమటకు తగిన ఫలితం అందాలి. పవిత్ర గ్రంథం బోధించినట్టుగా చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది. కానీ ప్రతి పనినీ శ్రమలా భావించలేం. వెల నిర్ణయించలేం. ఆ మాటకొస్తే పరోపకార క్రియ పనీ కాదు, శ్రమా కాదు. కానీ పరుల ప్రయోజనార్థం నువ్వు ఖర్చు చేసిన కాలానికి ఏదో ఒక రోజు అత్యధిక విలువ దక్కితీరుతుంది. నువ్వు అడగకపోయినా ఫలాలు ఇచ్చి తీరుతుంది చెట్టు. కానీ మొక్క నాటిన నాడే ఫలం ఆశించకూదు. ఏ చెట్టూ ఎల్లకాలం ఉండదు. పచ్చగా ఉన్నప్పుడే గుప్పెడు గింజలు రాల్చేది తన స్ఫూర్తిగా వందల మొక్కలు మొలిపించమని, జ్ఞాపకంగా వాటిని బతికించమని.

భర్త చెట్టుకు అంటుకొమ్మ.

అతనికి అయిదేళ్ళ వయస్సప్పుడు కలిగిన చెట్టు ప్రేమ గత అరవై అయిదేళ్ళుగా కొనసాగుతూనే వుంది. పెళ్లి సంసారం తన ప్రేమకు అవరోధం కాలేదు. భార్య సైతం అతని ప్రేమకు దాసోహం.. ఎందుకంటే ఆమె రామయ్య జానకమ్మ- భర్త చెట్టుకు అంటుకొమ్మ.
మీలో ఎవరు కోటీశ్వరుడు.. విన్నప్పుడల్లా వనజీవి రామయ్యే గుర్తొస్తాడు. ఒకటా రెండా అతను నాటిన మొక్కలు ఒక కోటి పైమాటే. వెదజల్లిన విత్తనాలు ఆకాశంలో నక్షత్రాలన్నీ. తన గుడిసె పక్క ఖాళీ స్థలంలో కోట్ల విలువైన ఎర్ర చందనం చెట్లున్నా ఏమీ లేని పేదవాడు.

-కంచర్ల శ్రీనివాస్